ప్రస్తుతం చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. బరువు తగ్గించుకునేందకు ఎన్నో ప్రయత్నాలు చేస్తు్న్నారు. అయితే, మీరు కూడా బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా..? అయితే మీరు రోజ్ టీ గురించి తప్పక తెలుసుకోవాలి. కేవలం బరువు తగ్గేందుకు మాత్రమే కాదు.. ఈ టీ మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. శారీరకంగానే కాదు మానసికంగా కూడా దృఢంగా ఉండేలా చేస్తుంది. అలాంటి రోజ్ టీని రోజూ తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయో తెలుసా..? రోజ్ టీ ఎలా తయారు చేయాలి..? లాభాలు ఏంటి..? రోజ్ టీ గురించి మరింత తెలుసుకుందాం..
రోజ్ టీ తయారు చేయడం చాలా సులభం. దీనికి ఎక్కువ పదార్థాలు అవసరం లేదు. గులాబీ రేకులను నీటిలో మరిగించి నేరుగా తాగవచ్చు. లేదా.. టీ పొడి, గులాబీ రేకులు వేసి ఉదయాన్నే డికాక్షన్ చేసుకుని సేవించవచ్చు. సాధారణ టీలా కాకుండా ఇది ఆరోగ్యకరమైనది. బరువు తగ్గడంలో ఈ టీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అలాగే, ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణక్రియకు కూడా సహకరిస్తాయి.
బరువు తగ్గడంలో సహాయాలు: రోజ్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది. అలాగే, ఇది శరీరం నుండి విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను కూడా నివారిస్తుంది. కెఫిన్ కలిగిన టీల కంటే రోజ్ టీ చాలా ఆరోగ్యకరమైనది. ఇది మీ మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఈ రోజ్ టీ వివిధ రకాల ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..