Friendship Day: రెండు దేహాలు… ఒక ప్రాణం అనే స్నేహితుడి కోసం ఒక రోజు.. ఫ్రెండ్ షిప్ డే ని ఇలా జరుపుకోండి.. సంతోషం అంతా మీ సొంతం

అన్ని బంధాలను దేవుడిస్తే.. మనిషి తనకు తానుగా ఏర్పాటు చేసే బంధం స్నేహం బంధ. నిజమైన ఒక్క స్నేహితుడి ఉంటే చాలు జీవితంలో కష్టం నష్టం అన్న మాటే ఉండదు అని అంటారు. అటువంటి విలువైన స్నేహ బంధాన్ని ప్రత్యేకంగా చేయడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం స్నేహ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2025 సంవత్సరంలో ఆగస్టు 3న ఫ్రెండ్ షిప్ డేని జరుపుకుంటున్నారు. ఈ ఫ్రెండ్ షిప్ డే కి సంబంధించిన ఆసక్తికరమైన చరిత్ర, ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం..

Friendship Day: రెండు దేహాలు... ఒక ప్రాణం అనే స్నేహితుడి కోసం ఒక రోజు.. ఫ్రెండ్ షిప్ డే ని ఇలా జరుపుకోండి.. సంతోషం అంతా మీ సొంతం
Friendship Day

Updated on: Aug 02, 2025 | 10:07 PM

ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్ షిప్ డేగా జరుపుకుంటారు., అంటే 2025 సంవత్సరంలో స్నేహితుల దినోత్సవాన్ని ఆగష్టు 3వ తేదీన జరుపుకుంటున్నారు. ఈ రోజు జీవితంలో ఆనందాన్ని నింపే అన్నితికంటే విలువైన స్నేహానికి అంకితం చేయబడింది. జీవితంలోని ప్రతి సుఖ దుఃఖ సమయంలో నిలబడే వ్యక్తులు స్నేహితులు మాత్రమే. అయితే స్నేహితుల కోసం ఒక ప్రత్యేక దినోత్సవ వేడుక ఎప్పుడు, ఎలా ప్రారంభమైందో ఎప్పుడైనా ఆలోచించారా.. ఫ్రెండ్‌షిప్ డే ఎందుకు జరుపుకుంటారు దీని గురించి ఆసక్తికరమైన చరిత్ర, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం..

స్నేహితుల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారంటే

ఫ్రెండ్‌షిప్ డే అనేది కేవలం ఒక రోజు కాదు.. మనకు స్నేహితులు ఎంత ముఖ్యమో వారికి వ్యక్తపరిచే సందర్భం. చిన్నతనంలో ఆటల్లో అయినా, కాలేజీ సరదా సందర్భాల్లోనైనా, ఆఫీసు కబుర్లు ససమయంలో నైనా, జీవిత పోరాటం అయినా.. ఎవరైతే మనతో అడుగడుగునా అండగా నిలబ్దటారో అతడే మనకు నిజమైన స్నేహితుడే. స్నేహం వయస్సును, భాషను, కులాన్ని చూడదు ఎందుకంటే అది హృదయాలతో ఏర్పడే సంబంధం మాత్రమే. ఈ ఫ్రెండ్ షిప్ డే ఒక మంచి స్నేహితుడు మన జీవితంలోని ఒత్తిడిని ఎలా తగ్గించగలడో, కష్ట సమయాల్లో ఒక ఆశాకిరణంగా ఎలా మారగలడో, సంతోషకరమైన క్షణాలను చిరస్మరణీయంగా ఎలా మారుస్తాడో గుర్తు చేస్తుంది.

స్నేహితుల దినోత్సవ చరిత్ర

ఈ స్నేహితుల దినోత్సవం వేడుక నేడు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నప్పటికీ.. ఇది 1950లలో అమెరికాలో ప్రారంభమైంది. ‘హాల్‌మార్క్ కార్డ్స్’ వ్యవస్థాపకురాలు జాయిస్ హాల్, ప్రజలు ఒకరికొకరు కృతజ్ఞతలు చెప్పుకుని, స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ సరదాగా గడపాలని భావించారు. అలా పుట్టింది స్నేహితుల దినోత్సవం.

ఇవి కూడా చదవండి

ఆగస్టు మొదటి ఆదివారం రోజున ఫ్రెండ్ షిప్ డేని జరుపుకునే సంప్రదాయం మొదలైంది. ఇది కాలక్రమేణా ప్రజాదరణ పొంది ఒక సంస్కృతిగా మారింది. వారాంతంలో వస్తుంది కనుక ప్రతి ఒక్కరికీ తమ స్నేహితులతో సమయం గడపడానికి.. రోజుని మరింత హాయిగా మార్చుకునేందుకు వీలు కలుగుతుంది.

ఈ రోజు మాత్రమే కాదు ఐక్యరాజ్యసమితి (UN) 2011 సంవత్సరంలో జూలై 30ని ‘అంతర్జాతీయ స్నేహ దినోత్సవం’గా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, సమాజాల మధ్య పరస్పర అవగాహన, సామరస్యం, శాంతిని ప్రోత్సహించడం దీని ఉద్దేశ్యం.

స్నేహితుల దినోత్సవాన్ని ఎలా జరుపుకోవాలంటే

వాస్తవానికి ఈ రోజు జరుపుకోవడానికి ఎటువంటి నియమాలు లేవు, అయితే కొన్ని విషయాలు మాత్రం ఈ రోజుని మరింత ప్రత్యేకంగా చేస్తాయి:

మీ చిన్ననాటి లేదా కళాశాల స్నేహితులను కలవండి లేదా కాల్ చేయండి.

మీ బెస్ట్ ఫ్రెండ్ కి సర్ప్రైజ్ గిఫ్ట్ ని లేదా మీ ప్రేమని తెలియజేస్తూ ఒక గ్రీటింగ్ కార్డు పంపండి.

పాత ఫోటోల కోల్లెజ్ తయారు చేసి సోషల్ మీడియాలో షేర్ చేయండి.

మీకు ఇష్టమైన స్నేహితులతో కలిసి సినిమా రాత్రి చూడండి లేదా బయట తినండి.

ముఖ్యంగా మీ స్నేహితులను హృదయపూర్వకంగా పలకరించి మీకు వారి స్నేహం ఎంత విలువైనదో చెప్పండి.

స్నేహానికి నిజమైన అర్థం

కొన్నిసార్లు మనం జీవితపు పరుగు పందెంలో మనకు అత్యంత ప్రియమైన సంబంధాలను విస్మరిస్తాము. ఫ్రెండ్‌షిప్ డే అనేది ఒక్కసారి ఆ ఉరుకుల పరుగుల జీవితం నుంచి ఆగి ఆలోచించడానికి.. మనకు ఉన్న స్నేహితులే మన గొప్ప సంపద అని అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం.

స్నేహం అంటే ఎటువంటి స్వార్థం లేకుండా ఒకరి కోసం నిలబడటం, చెప్పకుండానే ఒకరి బాధను అర్థం చేసుకోవడం.. ఎటువంటి నటన లేకుండా ఒకరినొకరు అంగీకరించడం. అందుకనే సృష్టిలో స్నేహానికన్న మిన్న లోకానా లేదురా అన్నాడో సినీ కవి.

 

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..