Eating Habits for Sleep: నిద్రలేమితో అవస్థపడుతున్నారా..? హాయిగా నిద్రపోవాలనుకుంటే మీ అలవాట్లను ఇలా మార్చుకోండి!

నిద్రలేమితో ఆకలిని పుట్టించే హార్మోన్ గ్రెలిన్ ఎక్కువగా విడుదలై ఆకలి ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. కడుపు నిండిందనే భావన కల్పించే హార్మోన్ లెప్టిన్ తక్కువగా విడుదలై మరింత ఆహారం తినేవిధంగా చేసి ఊబకాయానికి దారితీస్తుంది. నిద్రలేమివల్ల మలబద్దకం, డిప్రెషన్, కోపం, చిరాకు ఎక్కువవుతాయి. ఇది చివరికి ఎనిమీయాకు దారి తీస్తుంది. ఆకలి మందగించడం ఇతర సమస్యలు చుట్టుముడతాయి. కాబట్టి నిద్రలేమికి యోగా, వాకింగ్, సైక్లింగ్ వంటివి చేయాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.

Eating Habits for Sleep: నిద్రలేమితో అవస్థపడుతున్నారా..? హాయిగా నిద్రపోవాలనుకుంటే మీ అలవాట్లను ఇలా మార్చుకోండి!
Eating Habits For Sleep

Updated on: Jul 18, 2024 | 9:27 PM

Eating Habits for Sleep: ఆధునిక జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది నిద్రలేమి సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. విపరీతమైన ఆలోచనలు, వయసుకు మించిన ఒత్తిడి, భవిష్యత్తుపై భయాందోళనలు, అనారోగ్య సమస్యలు, ఇతరత్రా కారణాల వలన నిద్రపై ప్రభావం పడుతుంది. అయితే, మీరు రోజూ తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మీరు ప్రశాంతంగా నిద్రపోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే ఆ తర్వాతి ఉదయం తాజాదనంతో మేల్కోంటారని అంటున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం…

నిద్ర అనేది రోజూ సమస్యగా మారితే.. అది మన రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఇందులో భాగంగానే ఎన్నో రోగాలు, ఇన్ఫెక్షన్లు మనల్ని ఎప్పటికప్పుడు వేధిస్తాయి. దృష్టిలోపం అనేది నిద్ర సమస్యలను కలిగించే మరొక సమస్య. దీని వల్ల కళ్లు పొడిబారడంతోపాటు కంటి నొప్పి కలుగుంది. నిద్ర సమస్యలు ఉన్నవారిలో కనిపించే మరో లక్షణం అధిక ఆకలి. మీరు సాధారణం కంటే ఆహారం పట్ల ఎక్కువ ఆకర్షితులవుతున్నట్లు అనిపిస్తే జాగ్రత్తగా ఉండండి. నిద్రలేమి సమస్య ఉన్న వ్యక్తులు బరువు విషయంలో తరచుగా సమస్యలు ఎదుర్కొంటారు. ఈ విషయాన్ని కూడా నిశితంగా పరిశీలించుకోవాలి. రెగ్యులర్ గా సరైన నిద్ర లేని వారు బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అది మీరు గమనించాలి. అధిక ఒత్తిడి కూడా మిమ్మల్ని నిద్రలేమికి దారితీస్తుంది. అధిక ఒత్తిడికి కూడా నిద్ర లేకపోవడం కారణం అంటున్నారు నిపుణులు.

నిద్రలేమితో ఆకలిని పుట్టించే హార్మోన్ గ్రెలిన్ ఎక్కువగా విడుదలై ఆకలి ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. కడుపు నిండిందనే భావన కల్పించే హార్మోన్ లెప్టిన్ తక్కువగా విడుదలై మరింత ఆహారం తినేవిధంగా చేసి ఊబకాయానికి దారితీస్తుంది. నిద్రలేమివల్ల మలబద్దకం, డిప్రెషన్, కోపం, చిరాకు ఎక్కువవుతాయి. ఇది చివరికి ఎనిమీయాకు దారి తీస్తుంది. ఆకలి మందగించడం ఇతర సమస్యలు చుట్టుముడతాయి. కాబట్టి నిద్రలేమికి యోగా, వాకింగ్, సైక్లింగ్ వంటివి చేయాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. సిగరెట్, అల్కహాల్ వంటివాటికి దూరంగా ఉండడం మంచిది. మనిషికి మంచినిద్ర చాలా చాలా అవసరం. నిద్ర కరువైతే శరీరం రోగాలకు నిలయమవుతుంది. నిద్ర శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో కీలకం.

ఇవి కూడా చదవండి

రాత్రుళ్లు నిద్రపోయే సమయానికి కనీసం రెండు, మూడు గంటల ముందుగానే మీ భోజనాన్ని పూర్తి చేయాలి. అంటే డిన్నర్ చేసిన 2-3 గంటల తర్వాత నిద్రపోవాలి. తినగానే నిద్రపోకూడదు, ఆలస్యంగా తినకూడదు. క్రమం తప్పకుండా ఇలా చేస్తూ ఉంటే మీకు మంచి నిద్రపడుతుంది. అలాగే, హైడ్రేటెడ్‌గా ఉండటం కూడా మంచి నిద్రకు అవసరం. ఇందుకోసం పగటిపూట తగినంత నీరు తాగడం వల్ల మీరు హైడ్రేట్‌గా ఉంటారు.
రాత్రి పడుకునే ముందు క్యామోమైల్ లేదా వలేరియన్ రూట్‌తో చేసిన హెర్బల్ టీని తాగడం వల్ల మీరు త్వరగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. లేదా గోరువెచ్చని పాలు తాగటం కూడా మంచి నిద్రను ప్రేరేపిస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..