AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షాకాలంలో స్క్రీన్ పెట్టుకుంటే ఏమవుతుంది.? చర్మం పాడవకుండా ఉండాలంటే ఇలా చేయండి..

వర్షాకాలం రాగానే వాతావరణం చల్లబడిపోతుంది. ఆకాశం నిండా నల్లటి మేఘాలు కమ్ముకుని ఉండటం వల్ల చాలా మంది తమ సన్‌స్క్రీన్‌ను పక్కన పెట్టేస్తుంటారు. ఎండ లేనప్పుడు సన్‌స్క్రీన్ ఎందుకులే అనుకోవడం మనం చేసే అతిపెద్ద పొరపాటు. చర్మ నిపుణుల సూచనల గురించి తెలుసుకుందాం..

వర్షాకాలంలో స్క్రీన్ పెట్టుకుంటే ఏమవుతుంది.? చర్మం పాడవకుండా ఉండాలంటే ఇలా చేయండి..
Skipping Sunscreen In Monsoon
Krishna S
|

Updated on: Jul 05, 2026 | 4:25 PM

Share

వర్షాకాలం ప్రారంభం కాగానే చాలా మంది తమ రోజువారీ చర్మ సంరక్షణ దినచర్య నుండి సన్‌స్క్రీన్‌ను పక్కన పెట్టేస్తుంటారు. ఆకాశం మేఘావృతమై, ఎండ లేనప్పుడు సన్‌స్క్రీన్ ఎందుకులే అని అనుకోవడం సర్వసాధారణం. అయితే సన్‌స్క్రీన్ అనేది కేవలం ఎండ రోజుల్లో మాత్రమే వాడేది కాదని, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అన్ని కాలాల్లోనూ వాడాల్సిన అత్యవసర రక్షణ కవచమని చర్మవ్యాధి నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆకాశంలో మేఘాలున్నా, వర్షం పడుతున్నా సన్‌స్క్రీన్‌ను ఎందుకు అస్సలు స్కిప్ చేయకూడదో.. ఈ వర్షాకాలంలో ఎలాంటి సన్‌స్క్రీన్‌ను ఎంచుకోవాలో ఇప్పుడు చూద్దాం..

మేఘాలను చీల్చుకుంటూ వచ్చే ముప్పు..

అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ ప్రకారం.. సూర్యుడి నుండి వచ్చే హానికరమైన UV కిరణాలు దాదాపు 80 శాతం వరకు మేఘాలను సైతం ఛేదించుకుని భూమిని చేరగలవు. కాబట్టి బయట వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ, ఈ కిరణాల ప్రభావం మన చర్మంపై నిరంతరం ఉంటుంది. సన్‌స్క్రీన్ వాడకపోవడం వల్ల చర్మంపై సన్నని గీతలు, ముడతలు రావడం, చర్మం రంగు మారడం, ఎండదెబ్బ వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే వాతావరణంతో సంబంధం లేకుండా ప్రతిరోజూ సన్‌స్క్రీన్ రాయడం తప్పనిసరి.

వర్షాకాలానికి ఎలాంటి సన్‌స్క్రీన్‌ను ఎంచుకోవాలి?

ఈ సీజన్‌లో మార్కెట్లో దొరికే ఏ సన్‌స్క్రీన్ పడితే అది వాడటం కంటే, మీ చర్మ రకానికి సరిపోయేలా కొన్ని విషయాలు గమనించాలి.

బ్రాడ్ స్పెక్ట్రమ్: సూర్యుడి నుండి వచ్చే UVA, UVB.. ఈ రెండు రకాల హానికర కిరణాల నుండి రక్షణ ఇచ్చే బ్రాడ్-స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్‌ను మాత్రమే ఎంచుకోండి.

కనీసం SPF 30: వర్షాకాలంలో కూడా కనీసం SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్‌ను వాడటం ఉత్తమం.

వాటర్ రెసిస్టెంట్: వర్షంలో తడిసినా లేదా హ్యూమిడిటీ వల్ల చెమటలు పట్టినా సన్‌స్క్రీన్ కొట్టుకుపోకుండా ఉండటానికి నీటి నిరోధకత కలిగిన దానిని ఎంచుకోవడం ప్రయోజనకరం.

చర్మ రకాన్ని బట్టి మీది జిడ్డు చర్మం అయితే తేలికపాటి జెల్ లేదా మ్యాట్ ఫినిష్ సన్‌స్క్రీన్‌ను ఎంచుకోండి. ఒకవేళ పొడి చర్మం అయితే మాయిశ్చరైజింగ్ సన్‌స్క్రీన్‌ను ఉపయోగించడం మంచిది.

సన్‌స్క్రీన్ రాసేటప్పుడు తీసుకోవాల్సిన 4 జాగ్రత్తలు..

ముందుగానే రాయండి: ఇల్లు వదిలి బయటకు వెళ్లే దానికి కనీసం 15 నుండి 20 నిమిషాల ముందే సన్‌స్క్రీన్‌ను రాసుకోవాలి. దీనివల్ల అది చర్మంలోకి పూర్తిగా ఇంకి, సరైన రక్షణ ఇస్తుంది.

ఈ భాగాలను మర్చిపోకండి: కేవలం ముఖానికి మాత్రమే కాకుండా.. బయటకు కనిపించే మెడ, చెవులు, చేతులకు కూడా సన్‌స్క్రీన్‌ను తప్పకుండా అప్లై చేయాలి.

మళ్లీ రాసుకోవడం: మీరు ఎక్కువ సమయం బయట గడుపుతున్నా లేదా వర్షానికి ముఖాన్ని తరచుగా తుడుచుకుంటున్నా, ప్రతి 2-3 గంటలకొకసారి సన్‌స్క్రీన్‌ను మళ్లీ రాసుకోవడం ముఖ్యం.

ఇంట్లో ఉన్నా తప్పనిసరి: కిటికీల గుండా కూడా UV కిరణాలు లోపలికి వచ్చే అవకాశం ఉన్నందున, ఇంట్లోనే ఉన్నప్పటికీ రోజువారీ అలవాటుగా దీనిని రాసుకోవడం మంచిది.

కాగా చర్మ సౌందర్యం, ఆరోగ్యం అనేది వాతావరణాన్ని బట్టి మారకూడదు. కాబట్టి వర్షం పడుతోందని సన్‌స్క్రీన్‌ను అశ్రద్ధ చేయకుండా, ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఉపయోగిస్తూ మీ చర్మాన్ని మెరిసేలా ఉంచుకోండి.

Follow Us
టమాటో రసం ఇలా పెడితే మూడు రోజులు ఫ్రెష్
టమాటో రసం ఇలా పెడితే మూడు రోజులు ఫ్రెష్
ఆలయాలను పదే పదే సందర్శిస్తున్నారా? నిజమైన దైవ దర్శనం అర్థం ఇదేనట!
ఆలయాలను పదే పదే సందర్శిస్తున్నారా? నిజమైన దైవ దర్శనం అర్థం ఇదేనట!
దసరా, దీపావళి సెలవుల్లో ఊరెళ్తున్నారా? ఈ తప్పు అస్సలు చేయొద్దు
దసరా, దీపావళి సెలవుల్లో ఊరెళ్తున్నారా? ఈ తప్పు అస్సలు చేయొద్దు
9 కాదు.. 16 రోజుల నవరాత్రులు! 500 ఏళ్ల నాటి పుస్తకంతో పూజలు..
9 కాదు.. 16 రోజుల నవరాత్రులు! 500 ఏళ్ల నాటి పుస్తకంతో పూజలు..
డాబాపై తులసి మొక్కను పెంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి!
డాబాపై తులసి మొక్కను పెంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి!
నరాల బలహీనత తగ్గి.. శరీరం ఉక్కులా మారుతుంది..
నరాల బలహీనత తగ్గి.. శరీరం ఉక్కులా మారుతుంది..
కళ్లముందే కాఫీ.. ఐనా ఆన్సర్ ‘టీ’ చెప్పాడు.. UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
కళ్లముందే కాఫీ.. ఐనా ఆన్సర్ ‘టీ’ చెప్పాడు.. UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్
పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్
అబ్బబ్బా.. మూడు మహా యాగాలు.. వీరికి పట్టిందల్లా బంగారమే..!
అబ్బబ్బా.. మూడు మహా యాగాలు.. వీరికి పట్టిందల్లా బంగారమే..!
చిన్నప్పటి నుంచి వస్తున్నా.. ఇలా ఎప్పుడూ జరగలేదు
చిన్నప్పటి నుంచి వస్తున్నా.. ఇలా ఎప్పుడూ జరగలేదు