ఆధునిక ప్రపంచం.. ఉరుకులు పరుగులు జీవితం.. లైఫ్ స్టైల్ పూర్తిగా మారింది.. పని ఒత్తిడి.. బిజీ లైఫ్, సమస్యలు ఇలా అనేక కారణాలతో చాలామంది ఆహారం పై దృష్టిపెట్టడం లేదు.. ఫలితంగా పలు ప్రమాదకర సమస్యల బారిన పడుతున్నారు.. చాలామంది తిరిక లేకుండా గడుపుతున్నారు.. ఇలాంటి సమయంలో ఇంట్లో తినకుండా బయట లేదా మార్కెట్ లలో దొరికే ఆహార పదార్థాలను తింటూ కడుపునింపుకుంటున్నారు.. అయితే.. క్రమంలోనే ఆ ఫుడ్ తోపాటు పలు సాఫ్ట్ డ్రింక్స్ ను కూడా తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.. అయితే.. చాలామంది స్వీట్స్ కంటే శీతల పానీయాలు తాగడం మంచిదన్న ఊహలో ఉంటారు.. అలా అనుకుంటే మీరు పెను ప్రమాదంలో పడినట్లే.. అంటూ హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు..
స్వీడన్‌లో 70,000 మంది పెద్దలపై నిర్వహించిన తాజా అధ్యయనంలో స్వీట్లు తినడం కంటే శీతల పానీయాలు తరచుగా తాగడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. ఇందులో స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్, క్రమరహిత హృదయ స్పందన, అనూరిజం (ధమనులలో వాపు) వంటి తీవ్రమైన సమస్యలు ఉన్నాయి.
స్వీడన్‌లో నిర్వహించిన ఈ పరిశోధనలో పాల్గొన్న వారు 1997 – 2009 మధ్య ఆహార సంబంధిత ప్రశ్నపత్రాలను పూరించారు. శీతల పానీయాలు, తీపి పానీయాలు – జ్యూస్‌లు, జామ్ లేదా తేనె వంటి టాపింగ్స్, పేస్ట్రీలు, మిఠాయి లేదా ఐస్ క్రీం వంటి స్వీట్లు అనే డ్రింక్స్ ద్వారా వారికి ఎన్ని కేలరీలు వచ్చాయి..? అన్న అన్న ప్రశ్నలు అడిగి వివరాలు సేకరించారు. 20 సంవత్సరాలకు పైగా ఫాలో-అప్ తర్వాత, 70వేల మందిలో సుమారు 26,000 మంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. అధ్యయనం ప్రకారం, శీతల పానీయాలు తాగేవారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు.
శీతల పానీయాలలో సాంద్రీకృత చక్కెర ఉంటుంది.. ఇది శరీరానికి మరింత హానికరం. శీతల పానీయాల గురించి ఆరోగ్య నిపుణుల ప్రకమారం.. సోడాలో ఖాళీ కేలరీలు ఉంటాయి. అయితే స్వీట్‌లలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు వంటి ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి కొంతవరకు శరీరానికి సమతుల్యతను అందిస్తాయి. శీతల పానీయాలు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది.. దీని కారణంగా ఇన్సులిన్ హార్మోన్ ఎక్కువ పరిమాణంలో పని చేస్తుంది. ఈ ప్రక్రియ వాపు – శరీరంలోని నరాలకు నష్టం కలిగిస్తుంది.. ఇది గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. అంతే కాకుండా శీతల పానీయాలు కూడా బరువు పెరగడం, ఊబకాయం ప్రమాదాన్ని పెంచుతాయి. ఇది అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యలకు దారితీస్తుంది.
ముఖ్యంగా యువతలో పెరుగుతున్న వ్యసనం దృష్ట్యా శీతల పానీయాలపై అవగాహనలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.. శీతల పానీయాలకు బదులుగా పండ్లతో కలిపిన నీరు లేదా ఇంట్లో తయారుచేసిన స్మూతీలను తీసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా.. మీ ఆహారంలో తక్కువగా చక్కెరను వినియోగించాలని, ఇంకా ఆహారంతో పాటు డ్రింక్స్ తీసుకోవడం మానుకోవాలని పేర్కొంటున్నారు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి