Teeth Whitening: మన పెద్దల దంతాలు ఆరోగ్యంగా, దృఢంగా ఉండడానికి రహస్యమేమిటో తెలుసా..? వాటిని అనుసరిస్తున్న విదేశీయులు

|

Mar 30, 2021 | 8:53 AM

Teeth Whitening: ప్రస్తుత కాలంలో చిన్నా పెద్ద తేడా లేకుండా.. అందరికీ దంత సమస్యలు వస్తున్నాయి. దంతాల నొప్పులు, చిగుళ్లు నొప్పి, రక్తం రావడం, నోటి దుర్వాసన ఇలా అనేక రకాల సమస్యలు ఇబ్బందులు పెడుతున్నాయి. వీటికి నివారణకు....

Teeth Whitening: మన పెద్దల దంతాలు ఆరోగ్యంగా, దృఢంగా ఉండడానికి రహస్యమేమిటో తెలుసా..? వాటిని అనుసరిస్తున్న విదేశీయులు
Neem Stick
Follow us on

Teeth Whitening: ప్రస్తుత కాలంలో చిన్నా పెద్ద తేడా లేకుండా.. అందరికీ దంత సమస్యలు వస్తున్నాయి. దంతాల నొప్పులు, చిగుళ్లు నొప్పి, రక్తం రావడం, నోటి దుర్వాసన ఇలా అనేక రకాల సమస్యలు ఇబ్బందులు పెడుతున్నాయి. వీటికి నివారణకు వాడండి అంటూ మార్కెట్ లో రోజుకో టూత్ పేస్ట్ లు వస్తున్నాయి. అయితే పూర్వకాలంలో మన పెద్దలకు ఇటువంటి టూత్ పేస్టులు ఏమీ లేవు.. అయినా వారి దంతాలు ఎంతో గట్టిగా ఉండేవి.. ఇంకా చెప్పాలంటే.. మన తాతగారు దంతాలు గట్టిగా ఉండి చెరకు గెడను కూడా ఈజీగా తినేస్తుంటే.. మన తండ్రి.. మనం దంత సమస్యలతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో అసలు అప్పుడు వారు ఏం వాడారు.. దంతాలు అంత బలంగా ధృడంగా ఉండడానికి అనుకోని వారు అతి తక్కువ.. మరి అప్పటి వారి పళ్ళు అంత ధృడంగా ఉండడానికి సీక్రెట్ ఏమిటో తెలుసా..? వేపపుల్లలు, ఉత్తరేణి పుల్లలు, పసుపు, ఉప్పు ఇవండీ.. అప్పటి సహజ టూత్ పేస్టులు

వేప పుల్లలతో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల కలిగే ప్రయాణాలు ఏమిటో తెలుసా..? ఈ వేపపుల్లతో అనేక ఔషధ గుణాలున్నాయి. అందుకని దీనితో రోజూ దంతాలను తోముకుంటే చిగుళ్లు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాదు నోటి దుర్వాసనని కూడా నివారిస్తుంది.

నోటి దుర్వాసన వస్తున్న వారు రోజు వేప పుల్లతో దంతాలను శుభ్రం చేసుకోవాలి.. అయితే ముందుగా వేప పుల్లని బాగా నమిలి.. ఆ రసాన్ని పిక్కిలి పట్టాలి.. తర్వాత పండ్లను తోమాలి.. ఇలా రోజు చేస్తే.. నోటి దుర్వాసన పోతుంది.. సూక్ష్మక్రిములు చేరకుండా రక్షణ కల్పిస్తుంది.

ఇక దంతాల చివుళ్లు వాపు, చివుళ్ళ నుంచి రక్తం కారడం వంటి సమస్యలున్నవారు రోజూ వేప పుల్లతో శుభ్రం చేసుకుంటే వేపలో ఉంటె యాంటీ బాక్టీరియల్ , యాంటీ మైక్రోబియ‌ల్ గుణాలు నోట్లోని బాక్టీరియాను నాశ‌నం చేస్తాయి. చివుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. దంతాలు, చిగుళ్ల వాపులు సహజంగానే తగ్గుతాయి.,

కొంతమందికి చిగుళ్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ సమస్య ఉన్నవారు రోజూ తప్పని సరిగా వేపపుల్లతో దంతాలను శుభ్రం చేసుకోవాలి.. అలా చేయడంతో ఈ సమస్యనుంచి బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే దంతాలు, చిగుళ్ల స‌మ‌స్య ఉంటె చాలా మందిలో దవడ ఎముక దెబ్బతినే అవకాశం ఉంది.. అందుకని చివుళ్ళ ఇన్ ఫెక్షన్ ను నిర్లక్ష్యం చేయకూడదు.

యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు వేపపుల్లలో అధికంగా ఉంటాయి. దీంతో రోజూ 15 నిమిషాల పాటు పళ్ళు తోముకుంటే నోటి, దంతాల, చివుళ్ళ సమస్యలు తగ్గుతాయి. అంతేకాదు.. రోజూ వేప పుల్లతో దంతావధానం చేస్తే.. శరీరంలోని చాలా అవయాలు ఆరోగ్యంగా ఉంటాయి. మనం మరచిపోయిన ఈ వేప పుల్లను ఇప్పుడు అమెరికాలో కూడా వాడడం విశేషం

Also Read: చిత్రం చెప్పిన విశేషం.. నడవలేని శునకంపై కరుణ చూపిన గ్రామీణ డాక్టర్.. పిక్ సోషల్ మీడియాలో వైరల్

ఈరోజు ఉత్కంఠంగా మారిన కార్తీక్ దీపం .. దీప, పిల్లల వద్దకు చేరుకున్న డాక్టర్ బాబు