
Aloe Vera For Weight Loss: కలబందను చర్మ సౌందర్యం కోసం చాలా సంవత్సరాలుగా ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. కలబందను చర్మానికే కాకుండా అనేక వ్యాధులకు కూడా ఉపయోగిస్తారు. కలబందలో ఉండే విటమిన్లు ఎ, సి, ఇ, ఫోలిక్ యాసిడ్, కోలిన్, మెగ్నీషియం, జింక్, క్రోమియం, సెలీనియం, సోడియం, ఐరన్, జింక్, మాంగనీస్ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అంతే కాదు, కలబంద మీ నడుముచుట్టూ ఉన్న కొవ్వును కూడా తగ్గిస్తుంది. తద్వారా మీ బరువు చాలా త్వరగా తగ్గేందుకు సహాయపడుతుంది. అలోవెరా జెల్ శరీరంలోని విష పదార్థాలను బయటకు తీసి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. మీరు కూడా దీనిని ఉపయోగించి మీ బరువును తగ్గించుకోవాలనుకుంటే, ఈ వార్త మీకోసమే. కలబందను ఉపయోగించి ఎలా బరువు తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
నిమ్మరసంతో కలబందను చేర్చితే..
నిమ్మరసంతో కలబందను కలిపి తీసుకోవడం వల్ల మీ బరువు తగ్గొచ్చు. ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం మిక్స్ చేసి అందులో కలబంద రసాన్ని కలపండి. ఈ మిశ్రమాన్ని ఉదయం పూట తాగాలి. ఇది ఒక అద్భుతమైన పానీయం. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల దాని ప్రయోజనాలు మరింత పెరుగుతాయి.
అలోవెరా జెల్..
కలబంద తాజా ఆకులను తీసుకుని, దానిలోని గుజ్జును బయటకు తీయాలి. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఈ గుజ్జును తినండి. ఇలా చేయడం వల్ల మీ బరువు తగ్గడం మొదలవుతుంది.
తినడానికి ముందు కలబంద జ్యూస్..
తినడానికి ముందు కలబంద రసం తీసుకుంటే, బరువు ఈజీగా తగ్గొచ్చు. ఇందుకోసం భోజనానికి 20 నిమిషాల ముందు ఒక చెంచా కలబంద రసం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. దీని వల్ల శరీరంలో నిల్వ ఉండే కొవ్వు వేగంగా కరిగిపోతుంది. అలోవెరాలో విటమిన్ బి ఉంటుంది. ఇది కొవ్వును విచ్ఛిన్నం చేసి శక్తిగా మార్చడం ద్వారా పనిచేస్తుంది. దీన్ని రెండు వారాల పాటు ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సమాచారం కోసమే. ఇందులో అందించిన ఏ చిట్కా, పద్ధతినైనా పాటించాలని కోరుకుంటే తప్పుకుండా వైద్యుడిని సంప్రదించి సరైన నిర్ణయం తీసుకోవాలి.