పొట్ట గుట్టలా మారి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పండ్లు మామూలివి కావు.. కొవ్వును కోసి దెబ్బకు క్లీన్ చేస్తాయి..

|

Oct 04, 2024 | 3:33 PM

ప్రస్తుత కాలంలో చాలామంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. బరువు అధికంగా పెరగడం వల్ల శరీరం పర్సనాలిటీ చెదిరిపోవడంతోపాటు.. అనేక వ్యాధులకు కూడా కారణం అవుతుంది.. స్థూలకాయం మధుమేహం, క్యాన్సర్, థైరాయిడ్ వంటి తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. బరువు తగ్గడానికి ప్రజలు అనేక రకాల ఆహారాలను అనుసరిస్తారు.

పొట్ట గుట్టలా మారి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పండ్లు మామూలివి కావు.. కొవ్వును కోసి దెబ్బకు క్లీన్ చేస్తాయి..
Weight Loss Tips
Follow us on

ప్రస్తుత కాలంలో చాలామంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. బరువు అధికంగా పెరగడం వల్ల శరీరం పర్సనాలిటీ చెదిరిపోవడంతోపాటు.. అనేక వ్యాధులకు కూడా కారణం అవుతుంది.. స్థూలకాయం మధుమేహం, క్యాన్సర్, థైరాయిడ్ వంటి తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. బరువు తగ్గడానికి ప్రజలు అనేక రకాల ఆహారాలను అనుసరిస్తారు. కష్టపడి పనిచేయడం ద్వారా కొవ్వును తొలగించుకోవాలనుకుంటారు. దీనికోసం వ్యాయామం, జిమ్ లో చెమటోడ్చడం, డైటింగ్ లను అనుసరిస్తారు. అయినప్పటికీ, చాలా మందికి దాని నుండి ప్రయోజనం చేకూరదు.. మీరు బరువు తగ్గడానికి తగినంతగా శ్రమించలేకపోతే, కొన్ని పండ్లు మీకు దివ్యౌషధంగా పనిచేస్తాయి..

అధిక బరువుతో బాధపడేవారికి ఈ పండ్లు ఫ్యాట్ బర్నర్స్ లాగా పనిచేస్తాయి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల బరువు త్వరగా తగ్గడం ప్రారంభమవుతుంది. కొవ్వును కరిగించే పండ్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకోండి..

ఈ పండ్లు కొవ్వును కరిగిస్తాయి..

  1. ఆపిల్ : ఆపిల్‌లో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఒక పెద్ద సైజు యాపిల్‌లో 5.4 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేసే ఇలాంటి ఎన్నో పోషకాలు ఈ పండులో ఉన్నాయి. ఈ పండు తింటే బరువు తగ్గడంతోపాటు.. అనేక వ్యాధులు దూరమవుతాయి.. వాటి ప్రమాదం కూడా తగ్గుతుంది.
  2. కివి: కివిలో విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఒక అధ్యయనం ప్రకారం.. కివి తినడం వల్ల బిపి తగ్గుతుంది. నడుము పరిమాణం కూడా తగ్గుతుంది. ఈ పండును ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఊబకాయం సమస్య నుంచి బయటపడవచ్చు.
  3. బెర్రీలు: బెర్రీలలో చాలా తక్కువ కేలరీలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల కొలెస్ట్రాల్, బీపీ, వాపు తగ్గుతాయి. ఎవరైనా అధిక బరువుతో బాధపడుతుంతే.. దానిని నియంత్రించడానికి బెర్రీలు తినవచ్చు.
  4. ద్రాక్షపండు: వేగవంతంగా బరువు తగ్గించే గుణాలు ద్రాక్షపండులో ఉన్నాయి. దీన్ని తినడం ద్వారా, మనకు రోజువారీ అవసరాలలో సగానికి పైగా విటమిన్ సి లభిస్తుంది. ఈ పండు గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) కొన్నిసార్లు తక్కువగా ఉంటుంది. దీని కారణంగా బరువును నియంత్రించడంలో ఇది చాలా మంచిదని భావిస్తారు. ఇది కొవ్వును సులభంగా కరిగిస్తుంది.
  5. పుచ్చకాయ: మీరు త్వరగా బరువు తగ్గాలనుకుంటే పుచ్చకాయ తినవచ్చు. పుచ్చకాయలో తక్కువ కేలరీలు, ఎక్కువ నీరు ఉంటాయి. అంతే కాకుండా పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఈ పండులో పుష్కలంగా లభిస్తాయి. ఇది కొవ్వును తగ్గిస్తుంది – శరీరం నుంచి తొలగిస్తుంది.

వీటితోపాటు.. సీతాఫలం, నారింజ, అరటిపండు, అవకాడో, చెర్రీ, నేరేడు పండు పండ్లు కూడా బరువు తగ్గడంలో ప్రభావవంతంగా ఉంటాయి.

బరువు తగ్గేందుకు ఈ పండ్లు తినడంతోపాటు.. తగినంత నీరు తాగాలని, జీవనశైలిని మార్చుకోవాలని, మంచిగా నిద్రపోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..