
నేటి కాలంలో ఆహారపు అలవాట్లు వేగంగా మారుతున్నాయి. మాంసాహారంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది ఇప్పుడు సీఫుడ్ వైపు మొగ్గు చూపుతున్నారు. చేపలలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం, ప్రోటీన్లు గుండెకు, మెదడుకు ఎంతో మేలు చేస్తాయి. అయితే అన్ని చేపలు ఒకే రుచిని కలిగి ఉండవు. మత్స్యకారులు, భోజన ప్రియులు అత్యంత ఇష్టపడే 5 రకాల చేపలు, వాటి ప్రత్యేకతలు ఇప్పుడు చూద్దాం.
చదునైన శరీరం, పొడవైన రెక్కలతో ఉండే ఈ చేప మాంసం చాలా మృదువుగా ఉంటుంది. ఇందులో ముళ్లు ఉండవు, కాబట్టి పిల్లలకు నిరభ్యంతరంగా పెట్టవచ్చు.ఇందులో ఉండే కాల్షియం పిల్లల ఎముకలు, దంతాలను దృఢంగా మారుస్తుంది. సూప్‌లు, ఫ్రైలకు ఇది చాలా బాగుంటుంది.
దీనిని వంజీరం లేదా నెయ్యి చేప అని కూడా పిలుస్తారు. సముద్రపు చేపలలో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. దీనికి వెన్నెముక తప్ప విడిగా ముళ్లు ఉండవు. మాంసం నాణ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు వారానికి ఒకసారి ఈ చేపను తినడం ఉత్తమం.
వెండి రంగులో, పసుపు రెక్కలతో ఉండే ఈ చేపలో అనేక రకాలు ఉన్నాయి. ఇది సూప్‌లు, స్టూలలో అద్భుతమైన రుచిని ఇస్తుంది. ఇందులో చిన్న ముళ్లు ఉంటాయి కాబట్టి పిల్లలకు ఇచ్చేటప్పుడు కాస్త జాగ్రత్త అవసరం. ఇది కూడా బరువు తగ్గడానికి బాగా సహకరిస్తుంది.
సముద్రపు పాచిని మాత్రమే ఆహారంగా తీసుకునే ఈ చేప చాలా స్వచ్ఛమైనది, మృదువైనది. మధ్యస్థ పరిమాణంలో ఉండి ముళ్లు లేకుండా ఉండటం వల్ల అందరూ ఇష్టపడతారు. ఇందులోని ఒమేగా-3 మెదడు అభివృద్ధికి, గుండెకు మేలు చేస్తుంది. ముఖ్యంగా చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.
పాము లాంటి పొడవైన శరీరం ఉండే ఈ చేపను కత్తి చేప అని కూడా పిలుస్తారు.ఇతర చేపల కంటే ఇందులో ముళ్లు కాస్త ఎక్కువ. గ్రేవీ లేదా పుడ్డింగ్ లాగా చేసుకుని తింటే రుచి అద్భుతం. వృద్ధాప్యంలో వచ్చే జ్ఞాపకశక్తి సమస్యలను తగ్గిస్తుంది. కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా, మనల్ని చురుగ్గా ఉంచుతుంది.
ఈ చేపల రుచి, పోషక విలువలు ఎక్కువగా ఉండటం వల్ల వీటి ధర సాధారణ చేపల కంటే కాస్త ఎక్కువగానే ఉంటుంది. మార్కెట్‌లో వీటి ధర కిలో రూ.200 నుండి రూ.500 వరకు ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం వారానికి రెండుసార్లు చేపలను ఆహారంలో చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..