ఇంట్లో కూరలు లేనప్పుడు బెస్ట్ ఆప్షన్ టమాటా కుర్మా.. అన్నం, బిర్యానీ, చపాతీల్లోకి సూపర్.. రెసిపీ

బంగాళా దుంపలతో చేసిన కూరలు అంటే పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు. అందుకనే బంగాళా దుంపలు లేని ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఈ బంగాళా దుంపలతో చేసిన కుర్మా గురించి అందరికీ తెలిసిందే. ఆలూ కూర్మాని శాఖాహార, మాంసాహార ప్రియులు అనే తేడా లేకుండా ఇష్టంగా తింటారు. అయితే ఆలూ కొందరికి ఆరోగ్య సమస్యలను కలిగించవచ్చు. అటువంటి వారు ఆలూ కుర్మాకు బదులుగా టేస్టీ టేస్టీ టమాటా కుర్మాని తెలుసుకుందాం..

ఇంట్లో కూరలు లేనప్పుడు బెస్ట్ ఆప్షన్ టమాటా కుర్మా.. అన్నం, బిర్యానీ, చపాతీల్లోకి సూపర్.. రెసిపీ
Tomato Kurma

Updated on: Apr 27, 2025 | 4:17 PM

ఆలూ కుర్మా కంటే రుకరమైన కూర టమాటా కుర్మా. ఇది ఇంట్లో కూరగాయలు లేనప్పుడు మంచి ఆప్షన్. ప్రత్యేకించి ఈ టమాటా కుర్మా రుచి ఎలా ఉంటుందంటే.. జిహ్వ చాపల్యాన్ని తీరుస్తుంది. అంతేకాదు ఈ టమాటా కుర్మా అన్నంలోకి మాత్రమే కాదు, బిర్యానీ, చపాతీ, పుల్కా వరకూ అన్నింటికీ సూపర్​ కాంబోగా సెట్ అయిపోతుంది. టమాట కూర్మాని తిన్నవారు తప్పకుండా హ్యాపీ ఫీలవుతారు. ఫుడ్ లవర్స్ మాత్రమే కాదు ప్రతి ఒక్కరూ ఈ టమాట కుర్మాని రుచి చూసి వావ్ అంటారు. ఈ రోజు టమాటా కుర్మా రుచిని గురించి తెలుసుకుందాం..

టమాటా కుర్మాకు కావాల్సిన పదార్ధాలు:

టమాటాలు అర కిలో

ఉల్లిపాయ – రెండు

ఇవి కూడా చదవండి

జీలకర్ర- 1/2 స్పూన్

బిర్యానీ ఆకు

రాతి పువ్వు

జాపత్రి

వెల్లుల్లి – ఐదు రెమ్మలు

కరివేపాకులు – కొన్ని

నూనె సరిపడా

ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్

కారం – రెండు స్పూన్లు

పసుపు – చిటికెడు

ఉప్పు- రుచికి సరిపడా

కొత్తిమీర – కొంచెం

మసాలా పేస్టు తయారీకి కావలసిన పదార్ధాలు

పచ్చి కొబ్బరి- తురిమినది ఒక కప్పు

పచ్చి మిర్చి- 2

సోంపు – 1 స్పూన్

వేయించిన శనగపప్పు- 2 స్పూన్లు

లవంగాలు-4

దాల్చిన చెక్క- చిన్న ముక్క

యాలకులు- 2

నూనె – మూడు స్పూన్లు

తయారీ విధానం: ముందుగా టమాటా కుర్మా కోసం మసాలా పేస్ట్ ని రెడీ చేసుకోవాలి. ఒక మిక్సి గిన్నె తీసుకుని.. కొబ్బరి తురుము, పచ్చి మిర్చి, సోంపు ,వేయించిన శనగపప్పు, లవంగాలు, దాల్చిన చెక్క ,
యాలకులతో పాటు కొంచెం నూనె వేసుకుని కొంచెం కొంచెం నీరు పొస్తూ పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ మసాలా పేస్ట్ ని ఒక గిన్నెలోకి తీసుకుని ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద బాణలి పెట్టి కూర తయారీకి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె వేడి ఎక్కిన తర్వాత జీలకర్ర, బిర్యానీ ఆకు, రాతి పువ్వు, జాపత్రి వేసి కలుపుకోవాలి. మసాలా దినుసులు వేగిన తర్వత చిన్నగా చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. తర్వాత కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి.. తర్వాత కరివేపాకులు వేసి వేయించండి.

ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్​లోకి వచ్చేటంత వరకూ వేయించి చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు ముక్కలుగా వేసి రెండు నిమిషాలు వేయించాలి. ఈ మిశ్రమం వేగిన అనంతరం రుచికి తగినంత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి ఉల్లిపాయ టమాటా మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఇది వేగిన అనంతరం ఒక కప్పు నీళ్లు పోసి కలుపుని బనలిపై మూత పెట్టి 10 ని. ఉడికించండి. పచ్చివాసన పోయి గ్రేవీ దగ్గరకు ఉడికిన తర్వాత ఇందులో రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ ని వేసుకుని బాగా కలుపుకోవాలి. అనంతరం కప్పు నీళ్లు పోసి.. రుచి చూసుకోండి. అవసరం మేరకు ఉప్పు వేసి మూత పెట్టి మరో10 నిమిషాలు ఉడికించాలి. చివరిగా కొత్తిమీర వేస్తే అంతే ఆలూ కుర్మాకి మించి టేస్టీ టేస్టీ టమాటా కుర్మా రెడీ. ఈ కూర అన్నంలోకి మాత్రమే కాదు బిర్యానీ, చపాతీ, పులకా వంటి వాటిల్లో దేనిలోకైనా అదిరిపోతుంది.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి