Evening Snacks: సాయంత్రం స్నాక్స్‌గా ఇవి తింటే సూపర్.. రుచితో పాటు మంచి ఆరోగ్యం..

|

Mar 01, 2022 | 6:57 PM

Evening Snacks: ఆధునిక కాలంలో సాయంత్రం ఆహారంగా చాలామంది చిరుతిండికి అలవాటు అయ్యారు. ఇది మంచిదే కానీ ఎటువంటి ఆహారాలు తీసుకోవాలో తెలిసి ఉండాలి. లేదంటే

Evening Snacks: సాయంత్రం స్నాక్స్‌గా ఇవి తింటే సూపర్.. రుచితో పాటు మంచి ఆరోగ్యం..
Evening Snacks
Follow us on

Evening Snacks: ఆధునిక కాలంలో సాయంత్రం ఆహారంగా చాలామంది చిరుతిండికి అలవాటు అయ్యారు. ఇది మంచిదే కానీ ఎటువంటి ఆహారాలు తీసుకోవాలో తెలిసి ఉండాలి. లేదంటే ఆరోగ్యానికి బదులు అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటారు. సాయంత్రం స్నాక్స్‌గా చాలామంది ప్యాకేజి చేసిన ఫుడ్స్‌, చిప్స్, ఫాస్ట్‌ఫుడ్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ఆహారాలు శరీరంలో అధిక కొవ్వుకి కారణం అవుతున్నాయి. దీనివల్ల బరువు విపరీతంగా పెరుగుతున్నారు. అందుకే తినేటప్పుడు ఒక్కసారి ఆలోచించాలి. లేదంటే ఆస్పత్రుల చుట్టు తిరగాల్సి ఉంటుంది. పిల్లలు, వృద్ధుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జంక్ ఫుడ్‌కి ఎంత దూరంగా ఉంటే మంచిది. సాయంత్రం స్నాక్స్‌గా చాలా మంచి ఫుడ్ తీసుకోవచ్చు. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం. మఖానా గురించి మీకు తెలిసే ఉంటుంది.  మఖానా సులభంగా జీర్ణమవుతుంది. దీనివల్ల ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు. సంపూర్ణమైన ఆహారం అని చెప్పవచ్చు. ఇందులో తక్కువ స్థాయిలో కొలెస్ట్రాల్ ఉంటుంది. గుండె జబ్బులు, ఊబకాయంతో బాధపడేవారికి ఇవి ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది కాకుండా మఖానా యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. చాలా తేలికగా సులభంగా జీర్ణమవుతుంది.

గింజలు

తృణ ధాన్యాలు సాయంత్రం స్నాక్స్‌కి సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు ఉంటాయి. ఫైబర్ కంటెంట్‌ ఎక్కువగా ఉండటం వల్ల పిల్లలు, వృద్ధులకి చాలా మంచి చేస్తుంది. గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొనేవారికి చాలా మంచిదని చెప్పవచ్చు.

బాదంపప్పులు

బాదంపప్పు ఈవినింగ్‌ స్నాక్స్‌కి సూపర్ పుడ్‌ అని చెప్పవచ్చు. ఇందులో విటమిన్ ఈ, కాల్షియం, ఐరన్ అధికంగా ఉంటాయి. రుచిలో గొప్పగా ఉండటమే కాకుండా బాదంపప్పు మెదడు ఆరోగ్యాన్ని పెంచుతుంది. బరువు తగ్గడానిక సహాయం చేస్తుంది. కొలెస్ట్రాల్‌, ఆకలిని తగ్గిస్తుంది.

గుమ్మడి గింజలు

గుమ్మడి గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో విటమిన్ B, మెగ్నీషియం, ఐరన్, ప్రోటీన్స్‌ ఎక్కువగా ఉంటాయి. సాయంత్రం టీ తాగుతూ.. ఈ గింజలు తింటే అద్భుతంగా ఉంటుంది. ఇది మంచి అల్పాహారం అని పోషక నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు అవిసె గింజలు కూడా మంచి చిరుతిండికి ఉదాహరణగా చెప్పవచ్చు.

Zodiac Sign: ఈ 4 రాశులవారు పెద్ద పిసినారులు.. కానీ ఈ విషయంలో మాత్రం ఫస్ట్..!

Cholesterol: శరీరంలో కొవ్వు పెరగకూడదంటే ఈ ఆహారాలు డైట్‌లో ఉండాల్సిందే..!

Peepal Tree: రావిచెట్టుని పూజిస్తే అద్భుత ఫలితాలు.. ఆ బాధలన్నింటికి చక్కటి పరిష్కారం..