Banana Benefits and Effects : అరటి పండు తిననివారు.. ఇష్టపడని వారు బహుఅరుదు అని చెప్పవచ్చు.. ఈ అరటిపండులో ఆరోగ్యకరమైన పిండి పదార్ధాలతో పాటు.. ఎన్నో పోషకాలున్నాయి. అరటిపండుని తినడం వల్ల ఆకలిని నియంత్రిస్తుంది. దీంతో బరువు కూడా కంట్రోల్ అవుతుంది. అంతేకాదు అరటిపండు తినడం వల్ల షుగర్ లెవెల్ ను నియంత్రిస్తుంది. ఇన్సులిన్ ఉత్తత్తికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది అయితే అన్ని అరటిపండ్లు తినడం మంచిదేనా అంటే.. కాదు కొన్ని అరటిపండ్లు తినడం ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.. మరి ఈరోజు ఏ అరటిపండ్లు తినడం ఆరోగ్యానికి మంచిది.. ఏవి హానికరం అనేవి తెలుసుకుందాం..!
బ్రౌన్ కలర్ అరటి పండ్లు
బాగా పండిన అరటిపండు మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇటువంటి అరటిపండ్లు తినడం మంచిది కాదని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. అరటి పండు బాగా పండినప్పుడు.. ఆరోగ్యానిచ్చే పిండి పదార్ధాలు చక్కెరా మార్పు చెందుతాయి. అదే సమయంలో అరటిలో ఈ స్థాయి యాంటీఆక్సిడెంట్ ఇతర స్థాయిల కంటే ఎక్కువగా ఉంటుంది. బాగా పండిన అరటిలో గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ నుంచి చక్కెర స్థాయి 3 గ్రాముల పెరుగుదల ఉందని ఆరోగ్యనిపుణులు తెలిపారు. అంతేకాదు ఎక్కువ పండిన అరటిలో తక్కువ ఫైబర్ ఉంటుంది. అందుకని బాగా పండిన లేదా.. బ్రౌన్ కలర్ అరటి పండ్లను తినే సమయంలో ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
పసుపుఅరటిపండు
పసుపు రంగు అరటిపండు అన్నిటికంటే ఉత్తమమైంది. ఆరోగ్యానికి చాలామంచిది. సంపూర్ణంగా పండిన పసుపు అరటి తినడం చాలా మంచిది.చాలా రోగాలు మనకు సోకవట. అంతేకాదు సులభంగా జీర్ణమై తక్షణ శక్తిని ఇస్తాయట. పిండి పదార్ధం చాలా తక్కువగా ఉండటం దీనికి కారణం. మరియు ఇందులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్నందున, రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది.
ఆకుపచ్చ అరటి పండ్లు
ఇక ఆకుపచ్చ అరటి పండ్లు బరువు తగ్గడానికి ఉత్తమమైనవి. ఈ అరటిపండ్లు తక్కువ చక్కెర కంటెంట్ తక్కువ ఉంటుంది. అందుకని
గ్రీన్ కలర్ అరటి పండ్లు షుగర్ పెరగకుండా కాపాడుతాయి. ఈ కలర్ అరటి పండ్లు నెమ్మదిగా జీర్ణమవుతాయ. దీని వల్ల రక్తంలో గ్లూకోజ్ పరిమాణం నెమ్మదిగా పెరుగుతాయి. ఇక వీటిని నేరుగా తినడం కంటే ఇతర ఆహార పదార్ధాలుగా వాడవచ్చు. బజ్జిలు, స్మూతీ, కూరవంటివి చేసుకొనవచ్చు .
Also Read: ఇటు కార్ల చోరీ.. అటు నకిలీ నోట్ల చలామణి.. పోలీసులకు దొరికిపోయిన నటుడు, నిర్మాత..!