AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెరిసే చర్మం మాట దేవుడెరుగు.. దీన్ని వాడితే అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్టే

కొల్లాజెన్ అనేది మన శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే ఒక ముఖ్యమైన ప్రోటీన్. ఇది చర్మం, ఎముకలు, కీళ్ల నిర్మాణాన్ని కాపాడుతుంది. వయస్సు పెరిగే కొద్దీ దీని ఉత్పత్తి తగ్గడం వల్ల ముడతలు రావడం సహజం. దీనిని భర్తీ చేయడానికి వాడే సప్లిమెంట్లు అందరికీ సురక్షితం కాకపోవచ్చు.

మెరిసే చర్మం మాట దేవుడెరుగు.. దీన్ని వాడితే అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్టే
Collagen Supplements.jpg
Nikhil
|

Updated on: Mar 23, 2026 | 8:51 PM

Share

మెరిసే చర్మం, దృఢమైన జుట్టు, బలమైన గోర్లు.. నేటి కాలంలో ప్రతి ఒక్కరూ కోరుకునే అందం ఇది. ఈ క్రమంలో ‘కొల్లాజెన్ సప్లిమెంట్లు’ ఒక మ్యాజిక్ పౌడర్‌లా ప్రాచుర్యం పొందాయి. మార్కెట్లో దొరికే కొల్లాజెన్ డ్రింక్స్, క్యాప్సూల్స్ వాడితే యవ్వనంగా కనిపిస్తామని చాలామంది నమ్ముతుంటారు. అయితే, ఈ సప్లిమెంట్లు వాడే ముందు వాటి వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు పొంచి ఉన్న ఆరోగ్య ముప్పుల గురించి కూడా తెలుసుకోవడం అత్యవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సప్లిమెంట్లతో పొంచి ఉన్న ప్రమాదాలు..

  1.  జీర్ణకోశ సమస్యలు- కొల్లాజెన్ పౌడర్లు లేదా పిల్స్ తీసుకున్నప్పుడు కొందరిలో కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట, వికారం వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా అధిక మోతాదులో తీసుకున్నప్పుడు జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది.
  2. అలర్జీల ముప్పు‌‌- మెరైన్ కొల్లాజెన్ (చేపల నుండి తీసేది) సీఫుడ్ అలర్జీ ఉన్నవారికి ప్రమాదకరం. దీనివల్ల చర్మంపై దద్దుర్లు, దురద, గొంతులో అసౌకర్యం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
  3. భారీ లోహాల నిల్వలు- నాసిరకం బ్రాండ్లు వాడటం వల్ల సప్లిమెంట్లలో ఉండే సీసం లేదా ఇతర భారీ లోహాలు శరీరంలోకి చేరే అవకాశం ఉంది. ఇది దీర్ఘకాలంలో ఆరోగ్యానికి హానికరం.
  4.  కిడ్నీలపై ఒత్తిడి- కొల్లాజెన్ తీసుకోవడం వల్ల శరీరంలో ప్రోటీన్ మోతాదు పెరుగుతుంది. ఇప్పటికే కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఈ అదనపు ప్రోటీన్ వడపోత భారం కావొచ్చు.

సహజంగా కొల్లాజెన్‌ను పెంచుకోవడమే శ్రేయస్కరం. సప్లిమెంట్లపై వేల రూపాయలు ఖర్చు చేసే కంటే, మన జీవనశైలిలో చిన్న మార్పులతో సహజంగానే కొల్లాజెన్‌ను వృద్ధి చేసుకోవచ్చు. నిమ్మకాయలు, బెర్రీలు, బెల్ పెప్పర్లు కొల్లాజెన్ ఉత్పత్తికి ఇంధనంలా పనిచేస్తాయి. గుడ్లు, చేపలు, పప్పు ధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. మితిమీరిన సూర్యరశ్మి తగలకుండా చూసుకోవాలి. పొగతాగడం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. సరైన విశ్రాంతి, క్రమబద్ధమైన వ్యాయామం శరీరంలో సహజంగానే ప్రోటీన్ల నిర్మాణాన్ని మెరుగుపరుస్తాయి.

కొల్లాజెన్ సప్లిమెంట్లు వృద్ధాప్యానికి పూర్తిస్థాయి పరిష్కారం కావు. శాస్త్రీయంగా వీటి ప్రయోజనాలు అందరిలో ఒకేలా ఉండవు. కాబట్టి, సప్లిమెంట్లు ప్రారంభించే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. సహజ ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలితోనే శాశ్వతమైన అందం, ఆరోగ్యం లభిస్తాయని గుర్తించాలి.

Follow Us