Tandoori Chicken Recipe : స్మోకీ ఫ్లేవర్‌తో దేశీ తందూరి చికెన్.. ఈ ఒక్క ట్రిక్‌తో టేస్ట్ అదిరిపోతుంది!

మాంసాహార ప్రియులకు తందూరి చికెన్ అంటే ప్రాణం. కానీ హోటల్ లో దొరికే ఆ స్మోకీ ఫ్లేవర్, ఎర్రటి రంగు ఇంట్లో రాదని చాలా మంది అనుకుంటారు. ముఖ్యంగా తందూరి ఓవెన్ లేకపోతే ఇది అసాధ్యమని భావిస్తారు. అయితే, తందూరి ఓవెన్ లేకపోయినా, అతి తక్కువ మసాలాలతో రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే తందూరి చికెన్ తయారు చేసుకోవచ్చు. మీ కుటుంబ సభ్యులను మెప్పించే ఆ సీక్రెట్ రెసిపీ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Tandoori Chicken Recipe : స్మోకీ ఫ్లేవర్‌తో దేశీ తందూరి చికెన్.. ఈ ఒక్క ట్రిక్‌తో టేస్ట్ అదిరిపోతుంది!
Tandoori Chicken A Delicious Recipe

Updated on: Jan 21, 2026 | 6:26 PM

హోటల్ స్టైల్ తందూరి చికెన్ కు ఉండాల్సిన ప్రధాన లక్షణం ‘స్మోకీ ఫ్లేవర్’. ఆ పొగ వాసన వస్తేనే తందూరి తిన్న అనుభూతి కలుగుతుంది. దీనికోసం ఖరీదైన పరికరాలు అక్కర్లేదు, వంటగదిలోని సాధారణ పాన్ ఒక చిన్న బొగ్గు ముక్క ఉంటే చాలు. మ్యారినేషన్ నుండి స్మోకీ టచ్ ఇచ్చే వరకు ప్రతి దశలోనూ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే, మీ ఇంటి నుండే తందూరి సువాసనలు వెదజల్లడం ఖాయం.

కావలసిన పదార్థాలు:

చికెన్ ముక్కలు (మీడియం సైజు) – అర కిలో

చిక్కటి పెరుగు – 3 టేబుల్ స్పూన్లు

అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్

కారం, పసుపు, ఉప్పు – తగినంత

తందూరి మసాలా & గరం మసాలా – ఒక్కో టీస్పూన్

కాశ్మీరీ మిర్చి పొడి (రంగు కోసం) – 1 టీస్పూన్

నిమ్మరసం, నూనె, వెన్న (Butter) – అవసరమైనంత

చిన్న బొగ్గు ముక్క – స్మోకీ ఫ్లేవర్ కోసం

తయారీ విధానం

ముందుగా ఒక గిన్నెలో పెరుగు, కారం, పసుపు, మసాలాలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం కొంచెం నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చికెన్ ముక్కలకు పట్టించి కనీసం గంటసేపు రిఫ్రిజిరేటర్‌లో మ్యారినేట్ చేయాలి. ఎంత ఎక్కువ సేపు మ్యారినేట్ చేస్తే చికెన్ అంత జ్యుసీగా మారుతుంది. తర్వాత పాన్ లో నూనె, వెన్న వేసి చికెన్ ముక్కలను రెండు వైపులా ఎర్రగా కాలే వరకు వేయించాలి.

చివరగా ‘స్మోకీ ఫ్లేవర్’ కోసం ఒక చిన్న బొగ్గు ముక్కను ఎర్రగా కాల్చి, దానిని ఒక చిన్న స్టీల్ కప్పులో పెట్టి ఆ కప్పును చికెన్ పాన్ మధ్యలో ఉంచాలి. బొగ్గుపై కొంచెం నూనె వేయగానే పొగ వస్తుంది, వెంటనే పాన్ పై మూత పెట్టి 5-10 నిమిషాలు ఉంచాలి. ఈ పొగ చికెన్ ముక్కలకు పట్టి హోటల్ లాంటి అద్భుతమైన రుచిని ఇస్తుంది.