Summer Diet Tips : వేసవి వచ్చేసింది.. రోజు రోజుకీ ఎండలు మండిపోతున్నాయి. భానుడు భగభగమంటున్నాడు. ఉష్ణోగ్రత రోజు రోజుకీ పెరిగిపోతుంది. వేడికి ఏమి తినాలన్నా ఇబ్బంది అనిపిస్తుంది.. దీంతో శరీరాన్ని చల్ల బరచడానికి.. ఉపయోగపడే ఆహారం వైపు దృష్టి సారిస్తాం.. అయితే ఈ రోజు శరీరాన్ని కూల్ గా ఉంచే త్వరగా జీర్ణమయ్యే ఆహార పదార్ధాల గురించి తెలుసుకుందాం..!
1. పెరుగు :
వేసవిలో ఈ పెరుగును మజ్జిగ రూపంలో రోజూ సేవించడం ద్వారా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. చర్మ సంబంధిత వ్యాధులకు మజ్జిగ దివ్యౌషధంగా పనిచేస్తుంది. పెరుగు, మజ్జిగ శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. ఇక పెరుగును అన్నంలో కలిపి తినవచ్చు.. లేదా రైతా గా తయారు చేసుకుని కూడా తినవచ్చు..
2. పుదీనా :
మండు వేసవిలో సేద దీరడానికి పుదినా చక్కటి ఔషధం. ఈ పుదినాను పచ్చడి , పానీయాలు, రైతా, ఐస్‌క్రీమ్‌లలో కూడా ఉపయోగించవచ్చు. ఈ పుదీనా తాజాదనంతో పాటు చల్లదనాన్ని ఇస్తుంది. ఆహారపదార్ధాలు మరింత రుచిని పెంచడానికి ఇది సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్నందున, ఇది మీ చర్మం, జీర్ణక్రియ, రోగనిరోధక శక్తికి పెంచుతుంది. ఎండ వేడి నుంచి పుదీనా షర్బత్ మంచి ఉపశమనం కలిగిస్తుంది.
3. దోసకాయ
ఇది శరీరానికి మంచి చల్లదనాన్ని ఇస్తుంది. అయితే ఎక్కువగా సలాడ్ లోనే ఉపయోగిస్తారు. ఈ దోసకాయ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి మరియు అవసరమైన పోషకాలను అందించడానికి కావాల్సిన నీరు అందిస్తుంది. దోసకాయలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి, అంతేకాదు కొవ్వు అసలు ఉండదు.. కనుక దోసకాయ వేసవిలో మంచి ఆహారపదార్ధం.
4. నిమ్మకాయ నీరు
వేసవిలో నిమ్మకాయ నీరు మంచి స్నేహితుడు. నిమ్మకాయ నీరులో చక్కెరకు బదులుగా.. తేనె ను జోడిస్తే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. నిమ్మకాయ రసం శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపర్చడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
5. పుచ్చకాయలు
ఎండ వేడిని.. దాహార్తిని తీర్చడం లో పుచ్చకాయ ఎంతో ఉపయోగపడుతుంది. పుచ్చకాయలో ఎన్నో ఔషధ గుణాలు దాగివున్నాయి. ఇందులో 92 శాతం నీరే. పుచ్చకాయలో కొలెస్ట్రాల్ ఉండదు. ఇక దీనిలో ఉండే పొటాషియం మూత్రవ్యవస్థను సాఫీగా సాగేలా చేస్తుంది. ఎండాకాలంలో ఉక్కపోత వల్ల స్వేదంతో పాటు శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు కూడా వెలువడి విపరీతమైన దప్పిక పుడుతుంది. ఆ సమయంలో పుచ్చకాయ మంచి ఆహారం.
Also Read: మళ్లీ విరుచుకుపడుతున్న కరోనా… నిన్న ఒక్క రోజు 3,251 మంది మృతి.. కరోనా లెక్కల జాబితాలో రెండో స్థానం