శ్రీరామనవమి రోజున క్యారెట్ పాయసం నైవేద్యం సమర్పించండి.. రామయ్య ఆశీస్సులు మీ సొంతం.. రెసిపీ ఏమిటంటే

తొలి తెలుగు మాసం చైత్ర మాసం శుక్ల పక్షం నవమి రోజున శ్రీ రామ నవమి పండగగా హిందువులు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున రామయ్యకు నైవేద్యంగా పానకం, వడపప్పు, చలిమి వంటి సాంప్రదాయ వంటలను నైవేద్యంగా సమర్పిస్తారు. అంతేకాదు పాయసం, పులిహోర వంటి వంటకాలను కూడా రామయ్యకు సమర్పించే ఆచారం పురాతన కాలం నుంచి వస్తోంది. అయితే పాత వంటకాలకు సరికొత్త రుచులను అద్దుతూ రుచికరమైన డెజర్ట్‌లను ప్రయత్నించండి. ఈ రోజు రెసిపీ గురించి తెలుసుకుందాం..

శ్రీరామనవమి రోజున క్యారెట్ పాయసం నైవేద్యం సమర్పించండి.. రామయ్య ఆశీస్సులు మీ సొంతం.. రెసిపీ ఏమిటంటే
Carrot Kheer

Updated on: Apr 05, 2025 | 6:43 PM

హిందువులు తెలుగు సంవత్సరంలో మొదటి రోజున ఉగాది పండుగగా జరుపుకుంటారు. ఇది తెలుగు సంవత్సరంలో మొదటి పండుగ. తరువాత తొమ్మిది రోజులకు ఎంతో ఉత్సాహంగా శ్రీ రామ నవమి పండగను జరుపుకుంటారు. రామ నవమి రోజున లక్షలాది మంది భక్తులు శ్రీరాముడిని పూజిస్తారు. ఆరాధిస్తారు. ఈ ఏడాది శ్రీ రామ నవమి దినోత్సవాన్ని ఆదివారం 6వ తేదీ రోజున ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. కనుక శ్రీరాముడికి నైవేద్యంగా సమర్పిచేందుకు పానకం, వడపప్పు, శనగలతో పాటు ప్రత్యేక స్నాక్స్, వంటకాలు చేయాలనుకునే వారు ఈ పాయసం రెసిపీని ప్రయత్నించవచ్చు. ముఖ్యంగా వివాహితులు అయి దూర ప్రాంతాలలో నివసించే వారికి, ఈ సులభమైన, రుచికరమైన డెజర్ట్‌లను తయారు చేయడం చాలా సౌకర్యంగా ఉంటుంది. క్యారెట్ పాయసం కోసం ఒక సాధారణ వంటకం వంట వ్లాగ్ Xtra ఫ్లేవర్స్‌లో షేర్ చేశారు. ఈ రోజు క్యారెట్ పాయసం రెసిపీ గురించి తెలుసుకుందాం..

తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:

  1. బాస్మతి బియ్యం- 1/4 కేజీ
  2. క్యారెట్ – 1
  3. నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు
  4. ద్రాక్ష, జీడిపప్పు – 10 నుంచి 12
  5. పాలు – 1/2 లీటరు.
  6. యాలకులు – 2
  7. చక్కెర (పటిక బెల్లం)- 1 కప్పు
  8. పాలపొడి- మూడు స్పూన్లు

పాయసం తయారుచేసే విధానం:

బాస్మతి బియ్యాన్ని బాగా కడిగి, నీటిలో గంటసేపు నానబెట్టాలి. తర్వాత నీటిని వడకట్టి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. తరువాత ఒక క్యారెట్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నాలుగైదు నిమిషాలు ఉడికించాలి. తరువాత ఈ క్యారెట్ ను చల్లారనిచ్చి.. బ్లెండర్ లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత ఒక పాన్ తీసుకుని గ్యాస్ స్టవ్ మీద పెట్టి.. వేడి చేసి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసి.. కిస్మిస్, జీడిపప్పు వేసి, బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. తర్వాత పక్కన పెట్టాలి. తరువాత అదే పాన్ లో అర లీటరు పాలు పోయాలి. పాలు వేసి.. స్విమ్ లో మంట పెట్టి మరిగించండి. ఇదే సమయంలో దంచి వేసిన యాలకులు జోడించండి. తరువాత ముందుగా రుబ్బిన బియ్యం మిశ్రమాన్ని పాలలో కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి, అది ఉడికే వరకు అలాగే ఉంచండి. బియ్యం పిండి ఉడికిన తర్వాత ఈ మిశ్రమంలో చక్కెర లేదా పటికబెల్లం పొడిని వేసి.. తరువాత తురిమిన క్యారెట్ ను వేసి మరిగించాలి. చివరగా ద్రాక్ష, జీడిపప్పు వేయండి. చివరగా పాలపొడిని, నెయ్యిని జోడించి ఒక్కసారి కలపండి. ఈ విధంగా చేస్తే వేడి వేడి టేస్టీ టేస్టీ క్యారెట్ పాయసం తినడానికి రెడీ అయినట్లే.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..