
కావలసిన పదార్థాలు:
చికెన్ – 1/2 కిలో (శుభ్రం చేసినది)
ఉల్లిపాయలు – 2 (సన్నగా తరిగినవి)
టమోటాలు – 2 (ముక్కలు చేసినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 స్పూన్
కారం – 2 స్పూన్లు
ఉప్పు – తగినంత
పసుపు – 1/4 స్పూన్
ధనియాల పొడి – 1 స్పూన్
గరం మసాలా – 1/2 స్పూన్
నూనె – 3 స్పూన్లు
బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు – కొద్దిగా
కొత్తిమీర – కొద్దిగా
తయారీ విధానం:
మొదటగా ఒక బౌల్‌లో శుభ్రం చేసిన చికెన్ తీసుకుని, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కనీసం 5-10 నిమిషాలు పక్కన ఉంచండి. ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ స్టవ్ మీద పెట్టి, అందులో నూనె వేయండి. నూనె వేడయ్యాక బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు వేసి వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి రంగు మారే వరకు వేయించండి. ఉల్లిపాయలు వేగాక టమోటా ముక్కలు వేసి మెత్తబడే వరకు ఉంచండి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని కుక్కర్‌లో వేసి, ఒకటి రెండు నిమిషాలు బాగా కలపాలి. తగినన్ని నీళ్లు పోసి, చివరగా గరం మసాలా చల్లి కుక్కర్ మూత పెట్టండి. కేవలం 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి, ఆవిరి పోయాక తీయండి. ఎంతో రుచికరమైన స్పైసీ చికెన్ కర్రీ సిద్ధం! చివరగా కొత్తిమీర చల్లుకుని వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది.