Custard Fruit Salad: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్‌లో కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ ఏయే పండ్లతో ఎలా తయారుచేసుకోవాలంటే

|

Aug 18, 2021 | 1:59 PM

Fruit Salad Recipe : ఫ్రూట్ సలాడ్ అనేది వివిధ రకాలైన పండ్లతో కూడిన వంటకం. రకరకాల పండ్లను ముక్కలుగా కట్ చేసి సలాడ్ గా తింటారు.. అయితే ఈ ఫ్రూట్ సలాడ్ లో..

Custard Fruit Salad: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్‌లో కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ ఏయే పండ్లతో ఎలా తయారుచేసుకోవాలంటే
Custard Fruit Salad
Follow us on
Fruit Salad Recipe : ఫ్రూట్ సలాడ్ అనేది వివిధ రకాలైన పండ్లతో కూడిన వంటకం. రకరకాల పండ్లను ముక్కలుగా కట్ చేసి సలాడ్ గా తింటారు.. అయితే ఈ ఫ్రూట్ సలాడ్ లో ఏయే పండ్లను ఉపయోగించాలనే విషయంపై అందరికి అవగాహన ఉండదు. ఆరోగ్యానికి ఎంతో మంచిదైన ఈ ఫ్రూట్ సలాడ్ ను పెద్దలు పిల్లలు ఇష్టంగా తింటారు. కనుక ఈ ఫ్రూట్ సలాడ్ ను ఎలా తయారు చేసుకోవాలి.. ఏయే పండ్లను ఉపయోగించవచ్చు తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు:

పాలు
కస్టర్డ్ పౌడర్
యాపిల్
అరటిపండు
చెర్రీ
మామిడిపండు
కివీ
బొప్పాయి
పైనాపిల్
బ్లూబెర్రీ
సపోటా

తయారీ విధానం :

ముందుగా స్టౌ మీద పలు పెట్టి మరిగించాలి. అనంతరం కస్టర్డ్ పౌడర్ కొంచెం తీసుకుని ఓ గిన్నెలో వేసి.. దానిని పాలతో కానీ నీటితో కానీ ఉండలు లేకుండా ఉడికించాలి. కొంచెం సేపు మరిగించాక స్టౌ మీద నుంచి కస్టర్డ్ గినెను దింపేసుకుని చల్లాబెట్టుకోవాలి. అనంతరం పైన చెప్పిన పండ్లను చిన్న చిన్న ముక్కలుగా కలుపుకోవాలి. అనంతరం బాదాం పప్పు, జీడీ పప్పు, కిస్మ్ మిస్, కలిపి తింటే టెస్టు చాలా బాగుంటుంది.
ఈ ఫ్రూట్ సలాడ్ తినడం వలన తక్షణ శక్తి లభిస్తుంది. ముఖ్యంగా పండ్లను తినడానికి ఇష్టపడేవారికి ఫ్రూట్ సలాడ్ బెస్ట్ అప్షన్. ఒకొక్క పండు విడివిడిగా తినే బదులు ఇలా ఒకటిగా తింటే రుచి రుచి.. పోషణకు పోషణ. ఈ ఫ్రూట్ సలాడ్ ఆరోగ్యానికి ఆరోగ్యనని , శక్తిని , పోషణ ఇస్తాయి.
Also Read: ఇదేమి వింతరా బాబు.. ఆ ఊళ్లో అందరూ నగ్నంగానే తిరుగుతారు.. డ్రెస్‌తో వస్తే నో ఎంట్రీ