Lemon Water: నిమ్మరసం ఎక్కువగా తాగుతున్నారా..? శరీరంలో ఏమవుతుందో తెలిస్తే షాక్‌ అవుతారు..!

దంతాల సున్నితత్వం ఉన్నవారు నిమ్మకాయను ఎక్కువగా ఉపయోగించకూడదు. నిమ్మకాయను ఎక్కువగా తీసుకోవడం ఎముకలకు కూడా ప్రమాదకరం. నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. దీన్ని తాగడం వల్ల ఎముకల్లో నిల్వ ఉన్న క్యాల్షియం వేగంగా కరిగిపోవడం ప్రారంభమవుతుంది. శరీరం నుండి మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. 

Lemon Water: నిమ్మరసం ఎక్కువగా తాగుతున్నారా..? శరీరంలో ఏమవుతుందో తెలిస్తే షాక్‌ అవుతారు..!
Lemon Water Side Effect
Image Credit source: pexels

Updated on: Jun 11, 2024 | 9:19 PM

నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల కూడా శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం వల్ల తరచుగా మూత్రవిసర్జన వస్తుంది. దీని వల్ల శరీరం నుంచి నీరు ఎక్కువగా విడుదలవుతుంది. ఇది కాకుండా, ఎలక్ట్రోలైట్స్, సోడియం వంటి మూలకాలు మూత్రం ద్వారా శరీరంలోంచి వెళ్లిపోతాయి.. ఇది కొన్నిసార్లు డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. అంతేకాదు.. నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం వల్ల నోటి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది దంత క్షయానికి కూడా కారణం కావచ్చు. ఇది దాని ఆమ్ల స్వభావం కారణంగా దంతాల సున్నితత్వాన్ని కలిగిస్తుంది. కాబట్టి శరీరాన్ని తాజాగా ఉంచుకోవడంతోపాటు దంతాలు, చిగుళ్ల ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి.

నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్‌తో పాటు ఆక్సలేట్ కూడా సమృద్ధిగా లభిస్తుంది. నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో క్రిస్టల్స్ రూపంలో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఇది మూత్రపిండాలలో రాళ్ల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది. మీకు కిడ్నీ వ్యాధి ఉన్నట్లయితే, నిమ్మకాయ రసం తక్కువగా తీసుకోవటం మంచిది. ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఎసిడిటీ సమస్య పెరుగుతుంది. అలాంటి వారు ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగకపోవడమే ఉత్తమం. నిమ్మకాయలో అధిక మొత్తంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఎసిడిటీని పెంచుతుంది.

నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాల సున్నితత్వాన్ని పెంచుతుంది. దీంతో దంతాలను రక్షించే ఎనామిల్ కూడా బలహీనపడుతుంది. దంతాల సున్నితత్వం ఉన్నవారు నిమ్మకాయను ఎక్కువగా ఉపయోగించకూడదు. నిమ్మకాయను ఎక్కువగా తీసుకోవడం ఎముకలకు కూడా ప్రమాదకరం. నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. దీన్ని తాగడం వల్ల ఎముకల్లో నిల్వ ఉన్న క్యాల్షియం వేగంగా కరిగిపోవడం ప్రారంభమవుతుంది. శరీరం నుండి మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..