AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మామిడి పండ్లను ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..? లైట్ తీసుకోకుండా ఇవి తెలుసుకోండి..

మామిడి పండు కేవలం రుచికరమైనదే కాదు.. విటమిన్లు, ఖనిజాలకు అది ఒక పవర్ హౌస్ వంటిది. రోగనిరోధక శక్తిని పెంచడం నుండి గుండె ఆరోగ్యాన్ని కాపాడటం వరకు మామిడి చేసే మేలు అంతా ఇంతా కాదు. అయితే సరైన పద్ధతిలో నిల్వ చేయకపోతే పండ్ల రాజులోని అమృత గుణాలు ఆవిరైపోయే ప్రమాదం ఉంది. మామిడి పండ్లను తాజాగా ఉంచుతూనే వాటి పూర్తి ఆరోగ్య ప్రయోజనాలను ఎలా పొందాలో తెలుసుకుందాం..

మామిడి పండ్లను ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..? లైట్ తీసుకోకుండా ఇవి తెలుసుకోండి..
How To Store Mangoes In The Fridge
Krishna S
|

Updated on: May 04, 2026 | 1:12 PM

Share

వేసవి వచ్చిందంటే చాలు.. మార్కెట్లు రంగురంగుల మామిడి పండ్లతో నిండిపోతాయి. బంగినపల్లి నుండి రసాల వరకు ప్రతి రకం మామిడికి దానికంటూ ఒక ప్రత్యేక రుచి ఉంటుంది. అయితే మామిడి పండ్లను కొన్న తర్వాత చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు వాటిని నేరుగా ఫ్రిజ్‌లో పెట్టడం. అసలు మామిడి పండ్లను ఫ్రిజ్‌లో పెట్టవచ్చా..? పెడితే ఎలాంటి మార్పులు వస్తాయి..? అనే అంశాలపై నిపుణులు కీలక విషయాలు వెల్లడించారు.

ఫ్రిజ్‌లో నిల్వ చేయడం: నిపుణుల హెచ్చరిక

మామిడి పండు ఒక ఉష్ణమండల పండు. ఇది సహజంగానే వేడి వాతావరణంలో పెరుగుతుంది. మీరు పచ్చి మామిడి పండ్లను తెచ్చినట్లయితే, వాటిని పొరపాటున కూడా ఫ్రిజ్‌లో పెట్టకండి. చల్లని ఉష్ణోగ్రత మామిడి పండు పండే ప్రక్రియను పూర్తిగా ఆపేస్తుంది. దీనివల్ల పండు పైన మెత్తగా మారినా, లోపల మాత్రం పుల్లగా, రుచి లేకుండా ఉంటుంది. వీటిని గది ఉష్ణోగ్రత వద్ద వరి గడ్డిలోనో లేదా కాగితపు సంచులలోనో ఉంచితేనే సహజమైన తీపి వస్తుంది. పండు పూర్తిగా పండిన తర్వాత అది పాడైపోకుండా ఉండాలంటే ఫ్రిజ్‌లో పెట్టవచ్చు. ఇది పండు లైఫ్‌ను మరో 4 నుండి 5 రోజులు పొడిగిస్తుంది.

నిల్వ చేసేటప్పుడు పాటించాల్సిన స్మార్ట్ చిట్కాలు

మామిడి పండ్లను ప్లాస్టిక్ కవర్లలో ఉంచితే అందులో తేమ చేరి పండు త్వరగా కుళ్లిపోతుంది. వాటికి బదులుగా పేపర్ టవల్స్ లేదా కాగితపు సంచులు వాడండి. మామిడి ముక్కలను నిల్వ చేయాలనుకుంటే, వాటిని గాలి చొరబడని ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇలా చేసిన ముక్కలను 24 గంటల లోపు తినడం ఉత్తమం. ఫ్రిజ్‌లో ఉన్న మామిడి పండ్లను నేరుగా తినకూడదు. తినడానికి అరగంట ముందు వాటిని బయటకు తీసి, సాధారణ నీటిలో వేసి ఉంచాలి. దీనివల్ల పండులోని చల్లదనం తగ్గి, సహజ రుచి బయటకు వస్తుంది.

కేవలం రుచి మాత్రమే కాదు.. ఒక ఔషధ గని

మామిడి పండును పండ్ల రాజు అని ఊరికే అనలేదు. ఇందులో దాగున్న ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు..

వ్యాధి నిరోధక శక్తి : విటమిన్-సి మరియు విటమిన్-ఏ పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలో తెల్ల రక్త కణాలు పెరుగుతాయి. ఇది ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని రక్షిస్తుంది.

జీర్ణక్రియకు అమృతం: మామిడిలో ఉండే ‘అమైలేస్’ అనే ఎంజైమ్స్, పీచు పదార్థం ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడతాయి. మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఇది ప్రకృతి ఇచ్చిన వరం.

కంటి వెలుగు: ఇందులో ఉండే బీటా కెరోటిన్, జీక్సాంథిన్ కంటి రెటినాను రక్షించి, రేచీకటి వంటి సమస్యలను నివారిస్తాయి.

గుండె, రక్తపోటు: మామిడిలోని మెగ్నీషియం, పొటాషియం రక్త నాళాలను రిలాక్స్ చేసి, రక్తపోటు నియంత్రణలో ఉండేలా చూస్తాయి.

చర్మం, జుట్టు: కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా చర్మంపై ముడతలు రాకుండా నివారిస్తుంది. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి కూడా మామిడి సహకరిస్తుంది.

అతిగా తింటే ప్రమాదమేనా..?

ఏదైనా అతిగా తింటే అనర్థమే. మామిడి పండ్లలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు వైద్యుల సలహా మేరకే తీసుకోవాలి. అలాగే రాత్రిపూట మామిడి పండ్లు తినడం కంటే ఉదయం లేదా మధ్యాహ్నం స్నాక్స్ సమయంలో తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us