Paneer Tikka Masala: ఇంట్లోనే రెస్టారెంట్ టెస్ట్ తో పన్నీర్ టిక్కా మసాలా తయారీ చేసుకోవడం ఎలా అంటే..!

|

Apr 10, 2021 | 12:52 PM

Paneer Tikka Masala: రెగ్యులర్ గా ఒకే రకం ఆహారపదార్ధాలను తిండడానికి పిల్లలే కాదు.. పెద్దలు కూడా బోర్ ఫీల్ అవుతారు. దీంతో ఎక్కువగా రెస్టారెంట్స్ వైపు చూస్తారు. అయితే...

Paneer Tikka Masala: ఇంట్లోనే రెస్టారెంట్ టెస్ట్ తో పన్నీర్ టిక్కా మసాలా తయారీ చేసుకోవడం ఎలా అంటే..!
Pannir Tikka Masala
Follow us on

Paneer Tikka Masala: రెగ్యులర్ గా ఒకే రకం ఆహారపదార్ధాలను తిండడానికి పిల్లలే కాదు.. పెద్దలు కూడా బోర్ ఫీల్ అవుతారు. దీంతో ఎక్కువగా రెస్టారెంట్స్ వైపు చూస్తారు. అయితే రెస్టారెంర్ట్స్ లో దొరికే వివిధరకాల ఐటెమ్స్ ను ఇంట్లోనే అంతే రుచిగా తయారు చేసుకోవచ్చు.. ఈరోజు టేస్టీ టేస్టీ పనీర్ టిక్కా మసాల తయారీ విధానం గురించి తెలుసుకుందాం..!

కావలసిన పదార్థాలు:

పనీర్‌ క్యూబ్స్‌ – 1 కప్పు,
అల్లం రసం – 1 టేబుల్‌ స్పూను,
ఉప్పు, మిరియాల పొడి – రుచికి తగినంత,
పెరుగు – 1 టేబుల్‌ స్పూను,
నూనె – 2 టేబుల్‌ స్పూన్లు,
టమోటాలు – 3,
పచ్చిమిర్చి -1,
జీలకర్ర – అర టీ స్పూను,
ఇంగువ – చిటికెడు,
బిర్యాని ఆకు – 1,
దనియాల పొడి, కారం – 1 టీ స్పూను చొప్పున,
పసుపు – పావు టీ స్పూను,
పంచదార – అర టీ స్పూను,
మొక్కజొన్న పిండి – 1 టీ స్పూను,
కొత్తిమీర – 1 కట్ట,
గరం మసాల – పావు టీ స్పూను.

తయారుచేసే విధానం:

పనీర్‌కు అల్లం రసం, ఉప్పు, పెరుగు, మిరియాల పొడి పట్టించి గంటపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇంతలో టమోటాలు, పచ్చిమిర్చి కలిపి పేస్టు చేసుకోవాలి. కొద్ది నీటిలో మొక్కజొన్న పిండి జారుగా కలపాలి. ఫ్రిజ్‌ నుండి తీసిన పనీర్‌ గది ఉష్ణోగ్రతకు వచ్చాక చిన్నమంటపై దోరగా వేగించి పక్కనుంచాలి. అదే కడాయిలో నూనె వేసి జీలకర్ర, ఇంగువ, బిర్యాని ఆకు, టమోటా గుజ్జు, దనియాలపొడి, పసుపు, కారం, పంచదారను వేసి.. కమ్మటి వాసన వచ్చే వరకూ వేయించాలి. ఇప్పుడు నీటిలో కలుపుకున్న మొక్కజొన్న ని వేసి.. అది చిక్కబడిన తరువాత పనీర్‌ ముక్కలు వేసి వేయించాలి.. కొంచెం సేపటి తర్వాత కొత్తిమీర తరుగు, గరం మసాల కలిపి దించెయ్యాలి.

అంతే ఎంతో రుచికరమైన పన్నీర్ టిక్కా మసాలా కూర రెడీ.. ఈ మసాల కూర బ్రెడ్ తో పావ్ బాజీ తహారలో తిన్నా బాగుటుంది. లేదా అన్నంతో బాగుంటుంది.

Also Read: ఒత్తిడిని తగ్గించి ఊరిపితితుత్తుల పనితీరు మెరుగుపరిచే ఆసనం. ఏమిటంటే..!

హైటెక్ పద్ధతిలో మొక్కజొన్న పొత్తులను కాలుస్తున్న బామ్మ.. పిక్ ను షేర్ చేసిన వివిఎస్ లక్ష్మణ్