
సాధారణంగా మనం తినాలనే కోరిక కలిగితే.. అది ఇష్టమైన ఫుడ్ అయితే.. బాగా లాగించేస్తాం.. ఇంకా ఏదైనా పండుగ వచ్చిందంటే చాలా స్పెషల్‌గా ఫుడ్ రెడీ చేసుకుని ఎంతో ఇష్టంగా తింటాం. ఇలాంటి ఫెస్టివల్ డేస్‌లో చాలామంది ఇష్టమైన డైట్ ప్లాన్‌లన్నీ పక్కనపెట్టి మంచిగా ఫుడ్ లాగిస్తుంటారు. అయితే మనం తీసుకున్న ఆహారం మనం మెదడులో ఎన్నో ముఖ్యమైన పనులు చేసేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో మన మెమరీ పవర్ ఏకాగ్రత వంటి అంశాలు కూడా ఉన్నాయి. సరైన విధంగా పద్ధతిగా తీసుకునే ఆహారం మన మానసిక ఆరోగ్యానికి కూడా సహాయంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. అయితే, పండగ సమయాల్లో ఎక్కువగా తీసుకునే ఆహారం వల్ల మన మెదడుపై ఎలాంటి ప్రభావాలు ఉంటాయి.. ఆహార నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..
మనం ఫుడ్ తినేటప్పుడు మన శరీరం నుంచి కొన్ని సిగ్నల్స్ విడుదలై అవన్నీ కలిపి కడుపు నిండిందని మెదడుకు ఒక సిగ్నల్ ఇస్తాయి. ఇందులో మన పేగులు జీవక్రియలు చేసే శక్తిని ఉత్పత్తి చేసే అణువులు హార్మోన్లు అన్నీ ఉంటాయి. ఈ హార్మోన్లనే పాంక్రియాస్ గ్రంథికి ఇన్సులిన్ విడుదల చేయాలని సిగ్నల్స్ ఇస్తాయి. ఇది మన శరీరంలో చక్కర స్థాయిలను నియంత్రిస్తుంది. ఈ సిగ్నల్స్ అన్నీ మన పేగులలోని అన్ని భాగాల నుండి వస్తుంటాయి. పాంక్రియాస్ గ్రంథి ద్వారా విడుదల ఈ హార్మోన్ల నమూనా, వీటి నుంచి మెదడుకు వెళ్లే సంకేతాలు కడుపు నిండిన తర్వాత మనకు కలిగించే నిద్ర మత్తు సంబంధించినవి. కానీ ఖచ్చితంగా ఈ ప్రక్రియ ఎలా పనిచేస్తుంది అనే దానిపై ఇంకా చాలా రీసెర్చ్ చేయాలని వాషింగ్టన్ డిసి లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధకులు తెలిపారు.
అయితే ఎక్కువగా తిన్న తర్వాత రక్తప్రసరణ తగ్గదు అని పరిశోధనలు చెబుతున్నాయి. ఒకేసారి ఎక్కువగా తిన్న కూడా మన మెటబాలిజంపై కాస్త తక్కువ ప్రభావమే పడుతుందని పరిశోధకులు అంటున్నారు. పరిశోధకులు చేసిన అధ్యయనం ప్రకారం.. అప్పుడప్పుడు ఎక్కువగా తినడం అందరూ అనుకున్నంత ప్రమాదకరం కాదు అని తెలిపారు. అయితే ఈ అధ్యయనాన్ని కేవలం యువతపైనే, ఆరోగ్యకరమైన వ్యక్తులపైనే చేశామని దీనిపై మరింత పరిశోధన చేయాల్సి ఉందని వారు అంటున్నారు. ఎక్కువగా తినడం వల్ల చెడు ప్రభావం పడుతుందన్న గ్యారెంటీ లేదని పరిశోధకులు తెలిపారు.
ఒక్కసారి అత్యధికంగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల మన శరీరంపై జరిగే ప్రభావాలపై తక్కువ పరిశోధనలు ఉన్నప్పటికీ ప్రస్తుతం పరిశోధనలు మాత్రం మన మెదడుకి అంత ప్రమాదకరం కాదని సూచిస్తున్నాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం ఒకసారి ఎక్కువగా తినడం మనం అనుకున్నంత ప్రమాదం కాదని నిపుణులు అంటున్నారు.
అప్పుడప్పుడు ఎక్కువగా తినడం ఓకే కానీ అంతకుమించి తింటే శరీరంపై ఒత్తిడి పెరుగుతుందని.. వరుసగా ఐదు రోజులపాటు ఎక్కువగా తినడం వల్ల మన మెదడుపై దీర్ఘకాలిక ప్రభావాలు పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..