Masala Chai: మసాలా చాయ్…ఎంతో రుచికరమైన, సుగంధ చాయ్. టీ ప్రియులందరూ దీన్ని చాలా ఇష్టంగా తాగుతారు. టీలో వందల రకాలు ఉన్నాయి. వాటిలో మసాలా టీ చాలా ప్రసిద్ధి చెందింది. మసాలా చాయ్ అనేది సుగంధ ద్రవ్యాలతో చేసిన టీ. చాలా మంది ఈ మసాలా టీని రకరకాలుగా తయారుచేస్తారు. ఈ చాయ్ కోసం పాలు, టీ పౌడర్‌తో పాటుగా సుగంధ ద్రవ్యాలను ఉపయోగిస్తారు. చలికాలంలో ఈ మసాలా చాయ్ తాగడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. మసాలా దినుసులతో తయారుచేసిన ఈ చాయ్ జీర్ణవ్యవస్థను పెంపొందించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇది రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం మసాలా టీ ఇప్పుడు రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన నాన్-ఆల్కహాలిక్ పానీయం.
మసాలా చాయ్ ప్రపంచంలోని రెండవ అత్యుత్తమ నాన్-ఆల్కహాలిక్ పానీయంగా గుర్తింపుపొందింది. TasteAtlas సాంప్రదాయ వంటకాలు, స్థానిక పదార్థాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రామాణికమైన రెస్టారెంట్‌ల ఎన్‌సైక్లోపీడియా, ప్రపంచంలోని అత్యంత ఇష్టపడే ఆల్కహాల్-రహిత పానీయాల జాబితాను విడుదల చేసింది. ఇందులో ‘భారతదేశంలోని ఉత్తమ ఆహారాలు, పానీయాల జాబితాలో మసాలా చాయ్ రెండవ స్థానంలో ఉంది. మెక్సికోకు చెందిన అగువాస్ ఫ్రెస్కాస్ నంబర్ వన్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. దీని పండ్లు, దోసకాయలు, పప్పులు, చక్కెర మరియు నీటితో తయారు చేస్తారు.భారత్‌లో లస్సీ మూడో స్థానంలో ఉంది.
.@TasteAtlas reveals #masalachai as a global #favourite in non-alcoholic #beverages pic.twitter.com/1dFIwl6LxV
— Sowmya Raju (@SowmyaRaju3009) January 17, 2024
మసాలా టీ తాగటం వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. చాయ్‌లో ఉపయోగించే లవంగాలు వంటి మసాలాలు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది కడుపు మంట, నొప్పి, గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది. అయితే ఈ గుణాలున్న టీని రోజూ తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. అయితే ఈ చాయ్ ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
మసాలా టీ కోసం కావలసినవి..
– లవంగాలు
– ఏలకులు
-నల్ల మిరియాలు
– రెండు దాల్చిన చెక్కలు
– అల్లం
ఒక చెంచా జాజికాయ పొడి
మసాలా టీ తయారు చేయడం ఎలా: ముందుగా మీకు కావాల్సిన మోతాదులో లవంగాలు, యాలకులు, మిరియాలు, దాల్చిన చెక్కను నాన్ స్టిక్ పాన్‌లో వేసి ఒక నిమిషం వేయించాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ తీసుకోండి. మసాలాలన్నీ చల్లారిన తర్వాత అల్లం, జాజికాయ వేసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు పాలు, టీ పౌడర్, సరిపడ నీళ్లు పోసుకుని టీ తయారు చేయండి.. అందులోనే ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న మసాలాను కప్పుకు చిటికెడు చొప్పున వేసుకోవాలి. టీ బాగా మరిగిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు.. రుచికరమైన మసాలా టీ రెడీ.. దీన్ని తాగితే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి