Makar Sankranti 2022: మకర సంక్రాంతి భారతదేశం అంతటా వివిధ పేర్లతో నిర్వహించుకునే ప్రసిద్ధ హిందూ పండుగ. ఉత్తరప్రదేశ్‌లో దీనిని ఖిచ్డీ పండుగగా, గుజరాత్, రాజస్థాన్‌లలో గాలిపటాల పండుగగా, తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి, తమిళనాడులో పొంగల్‌గా చేసుకుంటుంటారు. అదే సమయంలో, ప్రతి భారతీయ పండుగలో దేవుడికి నైవేద్యంగా సమర్పించిన తరువాతనే పిండి వంటలను తింటుంటారు. మకర సంక్రాంతి పండుగ రోజు నువ్వులు, బెల్లంతో లడ్డూలు, చిక్కీలు వంటి మిఠాయిలు చేసే సంప్రదాయం ఉంది. చలికాలంలో నువ్వులు, బెల్లం చాలా ప్రసిద్ధి చెందాయని మనకు తెలిసిందే. వీటిని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. నువ్వులు, బెల్లంతో చేసిన లడ్డూల ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది- నువ్వులు ప్రధానంగా తెలుపు, నలుపు రంగుల్లో లభిస్తుంటాయి. తెల్ల నువ్వులను సాధారణంగా చలికాలంలో బెల్లం కలిపి తీసుకుంటే అది వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మరోవైపు, బెల్లం లడ్డూలను తీసుకోవడం వల్ల శీతాకాలంలో మీ శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది.
జుట్టు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది- నువ్వులు, బెల్లం లడ్డూలను తీసుకోవడం వల్ల జుట్టు నాణ్యత పెరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే వాటిలో ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అందుకే మకర సంక్రాంతి నాడు నువ్వులు, బెల్లం లడ్డూలు తిని దానం చేయడం ఆనవాయితీగా వస్తుంది.
గుండెకు మంచిది – నువ్వులలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా, వాటిలోని యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి ఫలకం ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడతాయి. కాబట్టి చలికాలంలో నువ్వులు, బెల్లం లడ్డూలను తప్పనిసరిగా తినాలి.
Also Read: Alcohol Side Effects: రోజూ మద్యం తాగుతున్నారా.? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!
Winter Skin Care: స్వెటర్ వేసుకుని నిద్రపోతున్నారా ?.. అయితే వెంటనే అలవాటు మార్చుకోండి.. ఎందుకంటే..