Late Night Eating: రాత్రి పూట లేట్‌గా తినే అలవాటు మీకుందా..? ఈ అనారోగ్య సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేయెచ్చు

సరైన సమయంలో ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే శరీరానికి తగిన శక్తి లభిస్తుంది. బాగా లేట్‌‌గా తినడం వల్ల మన శరీరానికి ఎంతో హాని జరుగుతోంది.

Late Night Eating: రాత్రి పూట లేట్‌గా తినే అలవాటు మీకుందా..? ఈ అనారోగ్య సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేయెచ్చు
Late Night Dinner

Updated on: Aug 16, 2021 | 12:33 PM

Late Night Dinner: సరైన సమయంలో ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే శరీరానికి తగిన శక్తి లభిస్తుంది. బాగా లేట్‌‌గా తినడం వల్ల మన శరీరానికి ఎంతో హాని జరుగుతోంది. రాత్రి పూట ఆలస్యంగా తినడం వల్ల శరీరంలో అనేక వ్యాధులకు ఆవాసంగా మారనుంది. ఒక పరిశోధన మేరకు.. రాత్రి భోజనం, నిద్రకు మధ్య 3 గంటల సమయం ఉండాలని తెలిపారు. ప్రతిరోజు మన చివరి భోజనాన్ని అంటే డిన్నర్‌ను పడుకునే వెళ్లే 90 నిమిషాల ముందు తినాలి. అప్పుడే తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణింకాగలదు. లేదంటే అనేక అనర్థాలు జరగనున్నాయి. అర్థరాత్రి తినడం వల్ల కలిగే ప్రమాదాలపై ఓ లుక్ వేద్దాం..

ఆలస్యంగా తినడం వల్ల కలిగే 5 పెద్ద ప్రమాదాలు..
ఊబకాయం: నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ ప్రకారం, నిద్రవేళలో ఆహారం తీసుకోవడం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దీని కారణంగా, అదనపు కేలరీలు శరీరంలో ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఇది కొవ్వు రూపంలో నిల్వ ఉండనుంది. దీంతో ఊబకాయం పెరుగుతుంది.

రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదం: పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన పరిశోధన ప్రకారం, రాత్రి ఆలస్యంగా తినడం వల్ల అధిక బీపీ, మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇది గ్లూకోజ్‌ను పెంచుతుంది. రక్తంలో ఒక నిర్దిష్ట కొవ్వును పెంచేందుకు సహాయపడుతుంది. దీంతో గుండె జబ్బుల ప్రమాదం మరింతగా పెరుగుతుంది.

జ్ఞాపకశక్తిపై ప్రభావం: కాలిఫోర్నియా లాస్ ఏంజిల్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఎలుకలపై చేసిన పరిశోధనలో నిద్రవేళలో ఆహారం తిన్న ఎలుకల జ్ఞాపకశక్తిపై తీవ్ర ప్రభావితం చూపాయంట. అలాగే నేర్చుకునే సామర్థ్యం కూడా తగ్గిపోతుందని కనుగొన్నారు. ఈ ఎలుకలలో జ్ఞాపకశక్తి కోసం ఏర్పడే అణువులు చాలా ప్రభావితమయ్యాయంట.

ఈటింగ్ డిజార్డర్: రాత్రి ఆలస్యంగా తినడం వల్ల ఈటింగ్ డిజార్డర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. నిజానికి, అలసట కారణంగా ఇది జరుగుతుంది. అలసట కారణంగా ఓ వ్యక్తి త్వరగా శక్తిని తెచ్చుకునేందుకు ఆహారాన్ని తీసుకుంటాడు.

జీర్ణ సమస్యలు: రాత్రి సమయంలో తక్కువ శారీరక శ్రమ కారణంగా జీవక్రియ మందగిస్తుంది. శరీరానికి ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీంతో శరీరానికి సరైన పోషకాహారం అందదు. ఈ కారణంగా మన శరీరంపై వ్యాధులు దాడి చేసే ప్రమాదం మరింత పెరుగుతుంది.

Also Read: Curd: ఈ వ్యాధులు ఉన్నవారు పెరుగు అస్సలు తినకూడదట.. తింటే సమస్యలు తప్పవు..

Reheating Cooking Oil: ఒకసారి వాడిన వంట నూనెను మళ్ళీ మళ్ళీ వేడి చేసి వాడుతున్నారా.. కలిగే అనర్ధాలు తెలుసా