Mango Side Effects: వేసవిలో మామిడి పండు తింటే మంచిదే.. అయితే వీరు మాత్రం అస్సలు తినకూడదు!

|

Apr 09, 2022 | 8:58 PM

పండ్లకు రారాజు మామిడి. ఇవి వేసవిలో మాత్రమే దొరుకుతాయి. మామిడి పండ్లలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా..

Mango Side Effects: వేసవిలో మామిడి పండు తింటే మంచిదే.. అయితే వీరు మాత్రం అస్సలు తినకూడదు!
Mangoes
Follow us on

పండ్లకు రారాజు మామిడి. ఇవి వేసవిలో మాత్రమే దొరుకుతాయి. మామిడి పండ్లలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఎండాకాలంలో మామిడి పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే వీటిని అతిగా తింటే మాత్రం అనర్ధాలు తప్పవు. సహాజంగా మామిడి పండ్లలో అధిక మొత్తంలో సహజ చక్కెర ఉంటుంది. అలాగే విటమిన్లు A, B, C, E, Kతో పాటు ఖనిజాలు సమృద్దిగా దొరుకుతాయి. ఇక మామిడిలో లభించే పాలీఫెనాల్స్, ట్రైటెర్పెన్, లూపియోల్‌.. యాంటీ ఆక్సిడేటివ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇదిలా ఉంటే.. తాజా పరిశోధనల్లో మామిడి పండ్లు తింటే ప్రయోజనాలతో పాటు కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని తేలింది.

మామిడి పండ్లను ఎక్కువగా తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు..

1. మామిడిని అతిగా తినడం వల్ల విరేచనాలు పట్టుకుంటాయి. మామిడి పండ్లలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. పీచు పదార్ధం ఎక్కువగా ఉండే పండ్లు తింటే విరేచనాలు అవుతాయి. అందుకే మామిడి పండ్లను మోతాదుకు మించి తినకూడదు.

2. మామిడి పండ్లలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది కచ్చితంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు సమస్యలు తెచ్చిపెడుతుంది. కాబట్టి మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే.. మామిడి పండ్లు తినాలనిపిస్తే.. ముందుగా డాక్టర్‌ను సంప్రదించండి.

3. కొంతమందికి మామిడి పండ్లు అలెర్జీని కలిగిస్తాయి. ముక్కు కారటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కడుపు నొప్పి, తుమ్ములు వంటి సమస్యలతో బాధపడుతుంటారు. కాబట్టి అలెర్జీలతో బాధపడేవారు ముందుగా డాక్టర్‌ను సంప్రదించి.. మామిడి పండ్లను తీసుకోండి.

4. మామిడి పండ్లలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు ఈ పండ్లకు దూరంగా ఉంటే మంచిది. సగటు పరిమాణంలో ఉండే మామిడికాయలో 150 క్యాలరీలు ఉంటాయి.

5. మామిడి పండ్లు అతిగా తింటే.. కొన్నిసార్లు అజీర్తి సమస్య కూడా తలెత్తవచ్చు. ముఖ్యంగా పచ్చి మామిడిని తిన్నప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. అందువల్ల, పచ్చి మామిడికాయలను తక్కువ మోతాదులో తీసుకోవాలి. అదే విధంగా, పండిన మామిడిపండ్లలో కార్బైడ్ అనే రసాయనం ఉంటుంది, అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

గమనిక: ఈ వార్తలో అందించిన సమాచారం అధ్యయనాలు, నిపుణులు పేర్కొన్న వివరాలు మాత్రమే. కేవలం అవగాహన కోసమే. ఏదైనా డైట్ తీసుకునే విషయంలో మీరు కచ్చితంగా వైద్యులు సలహా పాటించాలి.