KFC India News : ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ కంపెనీ కేఎఫ్‌సీ భారత్‌లో తన రెస్టారెంట్ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి ప్రయత్ని స్తోంది. 2020లో కరోనా ప్రభావం ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా సుమారు 30 కొత్త రెస్టారెంట్లను ప్రారంభించిన కేఎఫ్‌సీ ఇండియా, ఈ ఏడాది కూడా కొత్త ఔట్‌లెట్లను ప్రారంభించనున్నట్టు తెలిపింది. ఈ సందర్భంగా కేఎఫ్‌సీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మీనర్ పలు విషయాలను వెల్లడించారు. కరోనాకు ముందు భారత్‌లో మొత్తం 450 కేఎఫ్‌సీ రెస్టారెంట్లు ఉండగా, ప్రస్తుతం ఇది 130కి పైగా నగరాల్లో 480కి చేరుకున్నాయని సమీర్ పేర్కొన్నారు.
దీనివల్ల మరింతమంది కొత్త వినియోగదారులను చేరుకోగలమని ఆకాంక్షిస్తున్నారు. రానున్న సంవత్సరాల్లో దేశీయంగా వృద్ధి పెరుగుతుందని నమ్ముతున్నట్టు తెలిపారు. ‘భారత్‌లో తమ బ్రాండ్‌ను పెంచుకోవడమే లక్ష్యం. ఇది కంపెనీ అతిపెద్ద వ్యూహాలలో ఒకటి. నేరుగానే కాకుండా డిజిటల్‌గా వినియోగదారుల్లో వృద్ధి సాధించాలని కొత్త వాటిని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కరోనాతో ఆన్‌లైన్ ఆర్డర్లు పెరుగుతుండటం, వినియోగదారుల ప్రవర్తనలో మార్పు నేపథ్యంలో వారి అవసరాలను తీర్చేందుకు కేఎఫ్‌సీ ఇండియా ఆ దిశగా వృద్ధిని సాధించే ప్రయత్నాలను వేగవంతం చేస్తుందన్నారు.
కెఎఫ్‌సీ సంస్థను 1930లో హార్లండ్ శాండర్స్ అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో స్థాపించారు. 1950లో తొలి ఫ్రాంచైజీ మొదలుపెట్టిన నాటి నుంచీ ‘ఫింగర్ లికింగ్ గుడ్’ నినాదాన్నే ఉపయోగిస్తూ వస్తున్నారు. కాగా, కెఎఫ్‌సీకి ప్రస్తుతం ప్రపంచమంతటా 22,621 శాఖలున్నాయి. పరిస్థితులు కుదుటపడిన అనంతరం.. ఈ నినాదాన్నే కొనసాగిస్తామని సంస్థ యాజమాన్యం ‘యమ్ బ్రాండ్స్’ తెలిపింది. కాగా, మరో ప్రముఖ ఫాస్ట్‌ఫుడ్ సంస్థ పిజ్జా హట్ కూడా యమ్ బ్రాండ్స్ ఆధీనంలోనే ఉండటం విశేషం.