సాధారణంగా మనం తలకు రాసుకోవడానికి కొబ్బరి నూనెను ఉపయోగిస్తాము. కానీ కేరళ రాష్ట్రం, కర్ణాటక తీర ప్రాంతంలో కొబ్బరి నూనె వంట కోసం ఉపయోగిస్తారు. ఇటీవల, కొబ్బరి నూనె అనేక ఆరోగ్య ప్రయోజనాల కారణంగా విపరీతమైన ప్రజాదరణ పొందింది. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనె తీసుకుంటే ఒక నెలలోనే శరీరానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు అందుతాయంటున్నారు.
జీవక్రియ మెరుగుదల: కొబ్బరి నూనెలో మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల మన శరీరానికి సులభంగా లభించే శక్తి వనరులను అందిస్తుంది. మన జీవక్రియను మరింత వేగవంతం చేస్తుంది. కొబ్బరి నూనె రోగ నిరోధక శక్తిని పెంపొందించి జ్వరాలు, వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది.
జీర్ణక్రియ: కొబ్బరి నూనె తీసుకోవడం వల్ల పేగు ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు అవాంఛిత పేగు బ్యాక్టీరియాను చంపుతాయి. ఉబ్బరం, మలబద్ధకం, ఇతర జీర్ణ రుగ్మతల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అజీర్ణం కలిగించే వివిధ బ్యాక్టీరియాలు, ఫంగస్‌లతో కొబ్బరి నూనె పోరాడుతుంది. కొబ్బరి నూనెలో విటమిన్ E, Kతోపాటు ఐరన్ తదితర మినరల్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి.
మెదడు పనితీరు: ఉదయాన్నే కొబ్బరి నూనెను తీసుకోవడం వల్ల మెదడు పనితీరు, మానసిక స్పష్టత మెరుగుపడుతుంది. మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ మీ మెదడును పదునుగా, ఏకాగ్రతగా ఉంచుతాయి. రక్తపోటు, మధుమేహం రోగులకు కూడా కొబ్బరి నూనె చాలా మేలు చేస్తుంది.
గుండె ఆరోగ్యం: ఆరోగ్యకరమైన గుండె కోసం మీ ఆహారంలో కొబ్బరి నూనెను చేర్చుకోండి. ఈ మంచి కొవ్వులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను సమర్థవంతంగా నిర్వహించవచ్చు.
కొబ్బరి నూనె వల్ల శరీరంలో గుండెకు మేలు చేసే మంచి కొవ్వు పెరుగుతుందని తాజా అధ్యయనంలో తెలిసింది.
బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది: సహజ పద్ధతుల్లో బరువు తగ్గాలనుకొనేవారు కొబ్బరి నూనె వాడితే ఫలితం ఉంటుంది. కొబ్బరి నూనె జీవక్రియను పెంపొందించడంతో పాటు థైరాయిడ్, ఎండోక్రైన్ గ్రంధులు సక్రమంగా పనిచేయడానికి సహకరిస్తుంది.
సౌందర్య అవసరాల్లో: కొబ్బరి నూనెను ఎన్నో శతాబ్దాల నుంచి సౌందర్య అవసరాలకు వాడుతున్నారు. ఇది శరీరానికి మంచి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. దీన్ని ఎలాంటి చర్మం వారైనా వాడొచ్చు. ముడతలు, చర్మం పగుళ్లను కొబ్బరి నూనె నియంత్రిస్తుంది. జట్టు బాగా పెరిగేందుకు అవసరమైన పోషకాలన్నీ కొబ్బరి నూనెలో ఉంటాయి. కొబ్బరి నూనె రసాయనాలు లేని సహజ హెయిర్ కండిషనర్‌గా పనిచేస్తుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..