
రుచికరమైన చపాతీలు తయారు చేయాలంటే పిండిని పిసికే విధానం ఎంతో ముఖ్యం. మనం ఇంట్లో చేసే చపాతీలు మృదువుగా, నమలడానికి సులభంగా ఉండాలని కోరుకుంటాం. ప్రతి సారి చపాతీలు చేసే సమయంలో అవి కనీసం ఒక్కసారి మెత్తగా రావాలని ఆశపడతాం. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే చపాతి దూదిలా మెత్తగా వస్తుంది. ఈ చిట్కాలను ఉపయోగించి చపాతీలు చేసి చూడండి.
ఒక వెడల్పాటి గిన్నెలో గోధుమ పిండి, చక్కెర, ఉప్పు కలపండి. తరువాత నూనె, పెరుగు వేసి చేతులతో కలపండి. బాగా కలిపిన తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని మెత్తగా అయ్యే వరకు పిసకండి. ఇప్పుడు పిండిపై 1 టీస్పూన్ నూనె పోసి మళ్ళీ పిసికండి. తర్వాత ఒక కాటన్ బట్టను నీటిలో తడి చేసి పిండి మీద ఉంచి దానిని గాలి చొరబడకుండా కప్పి ఫ్రిజ్‌లో 2 గంటలు ఉంచండి. పిండి బాగా నాని మెత్తగా తయారవుతుంది.
ఇప్పుడు పిండిని చపాతి రాయి మీద ఉంచి చపాతీలుగా చుట్టండి. పిండి చేతులకు అంటుకోకుండా ఉండటానికి కొద్దిగా గోధుమ పిండి చల్లి రుద్దండి. ఇప్పుడు టావా మీద చపాతీని రెండు వైపులా బాగా కాల్చండి. అప్పుడు చపాతి మృదువుగా, రుచికరంగా తయారవుతుంది. పిండిని గట్టిగా పిసకపోతే చపాతి త్వరగా ఆరిపోతుంది. తక్కువ మంట మీద కాల్చితే చపాతీలు రోటీలా రుచిగా ఉంటాయి.