ఇడ్లీలు తిని బోర్ కొట్టిందా..? ఈ రెండు మిక్స్ చేస్తే బలానికి బలం.. ఆరోగ్యానికి ఆరోగ్యం..

రాగులు (ఫింగర్ మిల్లెట్), జొన్నలు (సొర్గం).. ఈ తృణధాన్యాలను పోషకాల పవర్ హౌస్‌గా పేర్కొంటారు ఆయుర్వేద నిపుణులు.. అలాంటి వాటిని మిక్స్ చేసి రాగి జొన్న రవ్వ ఇడ్లీ తాయరు చేసుకుంటే శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి.. రాగులు, జొన్నల రవ్వ, మినపప్పు, బియ్యం రవ్వ, ఉప్పుతో రుచికరమైన ఇడ్లీలను తయారు చేసుకోవడం ఎలానో ఈ కథనంలో తెలుసుకుందాం..

ఇడ్లీలు తిని బోర్ కొట్టిందా..? ఈ రెండు మిక్స్ చేస్తే బలానికి బలం.. ఆరోగ్యానికి ఆరోగ్యం..
Ragi Jonna Ravva Idli Recipe

Updated on: May 17, 2026 | 6:00 PM

రాగులు, జొన్నలు అత్యుత్తమ పోషకాలు కలిగిన తృణధాన్యాలు.. అందుకే.. రాగులు (ఫింగర్ మిల్లెట్), జొన్నలు (సొర్గం).. పోషకాల పవర్ హౌస్‌గా పేర్కొంటారు ఆయుర్వేద నిపుణులు.. రాగులు, జొన్నల్లో వీటిలో పీచుపదార్థం, ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూవారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల బరువు అదుపులో ఉండటంతో పాటు జీర్ణక్రియ మెరుగుపడుతుందని.. ఇంకా ఎన్నో సమస్యలను నివారించుకోవచ్చని పేర్కొంటున్నారు. అయితే.. ఉదయాన్నే చాలా మంది ఏవేవో టిఫిన్లు తింటుంటారు.. నూనెతో కూడిన అల్పాహారాలను సైతం తీసుకుంటారు. వాటన్నింటి బదులు.. రాగి, జొన్న ఇడ్లీలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఫైబర్, ప్రోటీన్, కాల్షియం అధికంగా ఉండటంతోపాటు.. బరువు తగ్గాలనుకునేవారికి, డయాబెటిస్ ఉన్నవారికి ఇవి అద్భుతమైన అల్పాహారం.. తయారు చేసుకోవడం కూడా సులభం..

రాగి జొన్న రవ్వ ఇడ్లీ తయారీ విధానం:

ఆరోగ్యకరమైన రాగి జొన్న రవ్వ ఇడ్లీని సులువుగా తయారు చేసుకోవచ్చు. ఈ వంటకానికి రాగులు, జొన్నల రవ్వ, మినపప్పు, ఉప్పు, కొద్దిగా బియ్యం రవ్వ ప్రధాన పదార్థాలు. ముందుగా, మినపప్పు, రాగులు, జొన్న రవ్వ, బియ్యం రవ్వను కలిపి నాలుగు నుండి ఆరు గంటల పాటు నానబెట్టాలి. నానిన తర్వాత ఈ మిశ్రమాన్ని మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బిన పిండిని మరో ఆరు గంటల పాటు పులియబెట్టాలి. మొత్తం రాత్రంతా ఆరు నుండి ఏడు గంటలు పిండి పులిస్తే ఇడ్లీలు మెత్తగా వస్తాయి. ఇడ్లీలు వేసే ముందు, ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నూనె రాసుకోవాలి. ఆ తర్వాత పిండిని ఇడ్లీ ప్లేట్లలో వేసి పది నుండి పదిహేను నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి. దీనితో రాగి జొన్న ఇడ్లీ సిద్ధమవుతుంది. ఈ ఇడ్లీలను పల్లి లేదా కొబ్బరి చట్నీ, సాంబార్‌తో తింటే రుచిగా ఉంటాయి.. లొట్టలేసుకుంటూ మరి లాగించేస్తారు.

రాగి, జొన్న అట్టు..

ఒకవేళ ఇడ్లీ పిండి మిగిలితే, దానిని అట్టులా కూడా వేసుకోవచ్చు. అట్టు కోసం, పిండిలో కొద్దిగా నూనె, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి (తినగలిగితే) కలిపి కడాయిలో వేసి రెండు నిమిషాల్లో చేసుకోవచ్చు. ఇది త్వరగా, రుచికరంగా తయారయ్యే వంటకం.. ఇంకెందుకు ఆలస్యం.. ఈ టిఫిన్లు కూడా చేసుకోని లొట్టలేసుకుంటూ తినండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us