Coffee Milkshake: మీకు డిఫరెంట్ కాఫీ టెస్ట్ ఇష్టమా.. అయితే కాఫీ మిల్క్ షేక్ ను ట్రై చేయండి..

|

Apr 08, 2021 | 1:19 PM

కాఫీని అతి వేడిగానూ, అతి చల్లగానూ త్రాగడం చాలా మందికి అలవాటు. కొంతమంది డిఫరెంట్ రుచులను కావాలనుకుంటారు.. అటువంటి వారికోసం ఈరోజు కాఫీ మిల్క్ షేక్ తయారీ...

Coffee Milkshake: మీకు డిఫరెంట్ కాఫీ టెస్ట్ ఇష్టమా.. అయితే కాఫీ మిల్క్ షేక్ ను ట్రై చేయండి..
Coffee Milk Shake
Follow us on

Coffee Milkshake: కాఫీ అనేది ఒక ప్రస్తుత జీవన శైలిలో ఉత్సాహపానీయంగా మారిపోయింది. దీనిని ఎక్కువ మంది ఉదయపు వేళలో ఉట్టిదిగా.. కొంత మంది అల్పాహారంతో పాటు కాఫీని తాగుతారు. ఇక స్నేహితులు బంధువులు వచ్చినపుడు కాఫీ ఇవ్వడం సర్వసాధారణమైంది. విందులు వినోదాలలో కాఫీలు అతి ముఖ్యం అయ్యాయి. ఇంకా చెప్పాలంటే కాఫీ రోజువారీ జీవిత ఆహారపు శైలిలో ఒక భాగం అయింది. కాఫీని అతి వేడిగానూ, అతి చల్లగానూ త్రాగడం చాలా మందికి అలవాటు. కొంతమంది డిఫరెంట్ రుచులను కావాలనుకుంటారు.. అటువంటి వారికోసం ఈరోజు కాఫీ మిల్క్ షేక్ తయారీ విధానం తెలుసుకుందాం..!

కాఫీ మిల్క్‌షేక్ కు కావాల్సిన పదార్థాలు:

ఇన్‌స్టంట్‌ కాఫీ పొడి – ఒక టేబుల్‌ స్పూన్‌
గోరువెచ్చని నీళ్లు – పావు కప్పు
పంచదార – మీరు ఇష్టపడేంత తీపి
వెన్నతీయని పాలు (చల్లటివి) – రెండు కప్పులు
ఐస్‌క్యూబ్స్‌ – ఎనిమిది

తయారీ విధానం:

ముందుగా బ్లెండర్‌లో ఇన్‌స్టంట్‌ కాఫీ పొడి, పంచదార, గోరువెచ్చని నీళ్లు పోసి కలపాలి. తర్వాత ఫుల్ క్రీమ్ పాలు వేసుకుని.. పావుకప్పు నీళ్లకు పోసి బ్లెండ్ చేయాలి. (మిల్క్‌షేక్‌ కోసం ఫుల్‌క్రీమ్‌ పాలు అయితే టెస్టు చాలా బాగుంటుంది) అలా కాఫీ నురగ వచ్చే వరకు లేదా మిశ్రమం లేతరంగుకు వచ్చేవరకు బ్లెండ్‌ చేయాలి. ఐస్‌క్యూబ్స్‌ వేయాలి. షేక్‌ చిక్కగా ఇష్టపడేవారు ఐస్‌క్యూబ్స్‌ ను తక్కువగా వేసుకోవాలి. తరువాత చల్లటి పాలను పోసి బాగా కలిపి మళ్లీ ఒకసారి బ్లెండ్‌ చేయాలి. పైన నురగ వస్తుంది. ఇలా తయారైన కాఫీ మిల్క్‌షేక్‌ని గ్లాసుల్లో పోసుకుని వెంటనే తాగేయాలి. లేదంటే నురగ తగ్గిపోతుంది.

గమనిక : కాఫీ మిల్క్ షేక్ కు వెన్న తీసిన పాలు, తక్కువ కొవ్వు ఉన్న పాలు కూడా వాడొచ్చు. ఒకవేళ ఇవి వాడి మిల్క్ షేక్ తయారు చేసుకునే వారు పావుకప్పు నీళ్లకు బదులు రెండు లేదా మూడు టేబుల్‌ స్పూన్ల నీళ్లు పోస్తే చాలు.

Also Read: చిలుకా సరస్సు వద్ద కెమెరా కు చిక్కిన అరుదైన పిల్లుల ఫ్యామిలీ.. నెటిజన్లను ఆకట్టుకుంటున్న వీడియో

ఉగాది పచ్చడి విశిష్టత.. షడ్రుచులు జీవితంలో అనుభవాల సారం.. దేనికి సంకేతం అంటే..!