గోధుమలు ఆరోగ్యకరమైన ధాన్యం. ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించే ఆహార ధాన్యం. గోధుమ పిండితో అనేక రుచికరమైన ఆహారాలు తయారు చేస్తారు. మనలో చాలామంది గోధుమ పిండితో చేసిన చపాతీలను ఇష్టంగా తింటారు. గోధుమలలో మన శరీరానికి చాలా మేలు చేసే అనేక రకాల పోషకాలు ఉన్నాయి. అయితే మీరు ఎప్పుడైనా మొలకెత్తిన గోధుమలు తిన్నారా? మనలో చాలామంది లేదు అని సమాధానం ఇస్తారు. కానీ, మొలకెత్తిన గోధుమలతో కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. సాధారణంగా బరువు పెరగడం కొత్త సమస్య కాదు. ప్రజల శారీరక శ్రమ గణనీయంగా తగ్గింది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.
మొలకెత్తిన గోధుమలను తీసుకోవడం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్‌లో మొలకెత్తిన గోధుమలను తినడం మంచిది. ఇది రోజంతా శక్తిని చెక్కుచెదరకుండా ఉంచుతుంది. ఎక్కువసేపు ఆకలిగా అనిపించకుండా.. దీన్ని తీసుకోవడం వల్ల క్రమంగా బరువు తగ్గడం ప్రారంభమవుతుంది.
కడుపునొప్పితో బాధపడేవారు రోజువారీ ఆహారంలో మొలకెత్తిన గోధుమలను చేర్చుకోవాలి. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకం, ఆమ్లత్వం, గ్యాస్, జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడటం మొదలవుతుంది. దీనిని నివారించాలంటే ఉదయాన్నే ఖాళీ కడుపుతో మొలకెత్తిన గోధుమలు తినాలి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఎముకలకు అపారమైన బలం వస్తుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి అవసరమైన పోషణను అందిస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..