Hypertension Controlling Tips: ఆహారంలో సోడియం తగ్గించడం ద్వారా రక్తపోటు(High Blood Pressure)ను అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు సలహా ఇస్తూనే ఉన్నారు. ఎందుకంటే, సోడియం అధికంగా తీసుకోవడం వల్ల శరీర అసమతుల్యతతోపాటు ఉబ్బరం ఏర్పడుతుంది. ఎందుకంటే శరీరం ఉప్పు(Salt)ను బయటకు పంపడానికి అదనపు నీటిని నిల్వ చేస్తుంది. ఇది తరచుగా శరీరంలో రక్తపోటును ప్రేరేపిస్తుంది. దీంతో అరోగ్య సమస్యలు మొదలువుతాయి. అందుకే ఉప్పును ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిదని అంటుంటారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ రోజువారీ సోడియం తీసుకోవడం 1,500 మిల్లీగ్రాములకు పరిమితం చేయాలని సూచిస్తుంది. అయితే ఒక టీస్పూన్ ఉప్పులో సుమారు 2,400 మిల్లీగ్రాముల సోడియం ఉందని తెలుసుకుంటే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు.
కారంతోపాటు ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. అందువల్ల రక్తపోటును తగ్గించే ఏకైక మార్గం ఆహారంలో ఉప్పును తగ్గించడమేనని నిపుణులు సూచిస్తున్నారు. రక్తపోటు స్థాయిలను తగ్గించడం ద్వారా ఆరోగ్యకరమైన సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడే మూడు ఆహారాలను ఇప్పుడు చూద్దాం.
అరటిపండ్లు:
అరటిపండ్లు పొటాషియంకు గొప్ప మూలంగా ఉంటాయి. రక్తపోటు స్థాయిలను నిర్వహించడంలో సహాయపడే ఖనిజంగా పొటాషియం పనిచేయనుంది. పొటాషియం, సోడియం 2:1 నిష్పత్తిగా ఉంటేనే శరీరంలో రక్తపోటు స్థాయిలను సమతుల్యంగా ఉంటాయి. దీంతో అరటిపండ్లను ఎక్కువగా తీసుకుంటే ఎటువంటి సమస్యలు రావు. బనానా షేక్, స్మూతీని తయారు చేసుకోని లేదా అలాగే తింటే శరీరానికి మంచింది.
బియ్యం, వేరుశెనగ, బాదం..
బియ్యం, వేరుశెనగ, గుమ్మడి గింజలు, జీడిపప్పు, బాదం, వోట్స్ లాంటివి మెగ్నీషియంకు మంచి వనరులు. మెగ్నీషియం కూడా ఒక ముఖ్యమైన ఖనిజం. ఇది సహజంగా రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే మెగ్నీషియం నైట్రిక్ ఆక్సైడ్ ధమని గోడలను సడలించి, రక్తం సాఫీగా ప్రవహించేలా చేయడంలో సహాయపడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం, 500 mg నుంచి 1,000 mg వరకు మెగ్నీషియం తీసుకోవడం వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుందని తేలింది.
పాలు, పాలతో కూడిన ఆహారాలు..
ఆహారంలో తాజా లేదా ఇంట్లో తయారుచేసిన పాల ఉత్పత్తులను చేర్చడం వల్ల రక్తపోటు స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. మన శరీరం ఎముకలు, దంతాలలో భారీ మొత్తంలో కాల్షియం నిల్వ ఉంటుంది. అయితే ఇది గుండె ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న ఖనిజంగా పేరుగాంచింది. ఇది నేరుగా పెరిగిన రక్తపోటు ద్వారా ప్రభావితమవుతుంది. కాల్షియం రక్త నాళాలు విస్తరించడానికి, సంకోచించడంలో సహాయపడుతుంది. అయితే కాల్షియం లేకపోవడం వల్ల హృదయనాళ వ్యవస్థ ద్వారా రక్తాన్ని పంప్ చేయడం కష్టతరం చేస్తుంది. దీంతో కాల్షియం పొందేందుకు శరీరం ఇతర వనరుల కోసం వెతకడం మొదలవుతుంది. దీంతో ఎముకల వ్యాధులకు దారితీస్తుంది. మీ ఆహారంలో పాలు, జున్ను, పెరుగు, మజ్జిగ వంటి కాల్షియం అధికంగా ఉండే వాటిని ఉండేలా చూసుకుంటే, ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న సలహాలు, సూచనలు సాధారణ సమాచార ప్రయోజనం కోసమే అని గమనించాలి. వైద్య సలహాగా పరిగణించకూడదు. ఏదైనా ఆరోగ్య చిట్కాలను పాటించాలని అనుకుంటే తప్పకుండా మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది.
Also Read: Pulses: అతిగా పప్పులు తీసుకుంటున్నారా.. అయితే ఈ సమస్యలు రావొచ్చు..!
Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే మీ డైట్‌లో ఇది తప్పనిసరిగా ఉండాల్సిందే..