Health Tips: చిట్టి గుండె గట్టిగా ఉండాలంటే.. ఈ ఫుడ్స్‌ను రెగ్యులర్‌గా తినండి

|

Mar 10, 2023 | 6:22 PM

గుండెకు మేలు చేసే ఆహారం మనం తీసుకోవాలి. అప్పుడు హార్ట్ ఫ్రెండ్లీ అవుతాం. తృణధాన్యాలు గుండెకు ఎంతో మేలు చేస్తాయి.

Health Tips: చిట్టి గుండె గట్టిగా ఉండాలంటే.. ఈ ఫుడ్స్‌ను రెగ్యులర్‌గా తినండి
Spinach
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో గుండెపోట్లతో గుండె బేజారవుతోంది. చూస్తుండగానే కుప్పకూలిపోతున్నారు… నిండుగుండెలు నిలువునా ఎండిపోతున్నాయి. ఉన్నపళంగా ఊపిరి ఆగిపోతోంది… ఇక్కడ అంబులెన్సుల్లేవ్… హాస్పిటల్‌ ట్రీట్‌మెంట్లూ లేవు. కళ్ల ముందే జీవితాలు ఆవిరైపోతుంటే కళ్లు తేలేస్తున్నాం… తప్ప ఏమీ చెయ్యలేని అచేతనావస్థ మనది.  వయసుతో నిమిత్తం లేకుండా పట్టుమని పాతికేళ్ళు కూడా లేని వాళ్ళు ఉన్నఫళంగా గుండెపోటుతో కుప్పకూలుతున్న ఘటనలు హడలెత్తిస్తున్నాయి. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా స్ట్రస్, లైఫ్ స్టైల్, జంక్ వంటి వాటిని ప్రధాన రీజన్స్‌గా చెబుతున్నారు వైద్యులు. దీంతో ఇప్పుడు హార్ట్ హెల్త్‌పై చాలామంది ఫోకస్ పెరిగింది. గుండెకు మేలు చేసే ఆహార పదార్థాల గురించి నెట్టింట సెర్స్ కూడా పెరిగింది. అలాంటి  ఫుడ్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  1.  వెన్న తీసిన పాలతో చేసిన పెరుగు గుండెకు ఎంతో మేలు చేస్తుంది. మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం ఇందులో పుష్కలంగా ఉంటాయి. అందుకే పెరుగు, మజ్జిగ మీ ఫుడ్‌లో తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి.
  2. అవిసె గింజ‌ల్లో అధికంగా ఉండే.. ‘ఒమెగా 3’ ఫ్యాటీ యాసిడ్లు హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తాయి. శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ లేకుండా చేస్తాయి.
  3. సముద్ర చేపల్లో చెడు కొవ్వు చాలా తక్కువ మోతాదులో ఉంటుంది.  గుండెకు మేలు చేసే మెగ్నీషియం, పొటాషియమూ…. రక్తనాళాలు మెరుగ్గా పనిచేయటానికి, బీపీ తగ్గటానికి, గుండె మంచిగా కొట్టుకోవటానికి, వాపు ప్రక్రియ అదుపులో ఉండటానికి, తోడ్పడే ఒమేగా3 వీటిలో ఎక్కువగా ఉంటుంది.
  4.  ఇక పాలకూర రెగ్యూలర్‌గా తినేదానికి ట్రై చేయండి. దీని ద్వారా శరీరానికి నైట్రేట్లు యాడ్ అవుతాయి. వీటిని మన శరీరం నైట్రిక్‌ ఆక్సైడ్‌గా మారుస్తుంది. ఇది రక్త ప్రసరణ మంచిగా జరగడానికి, బీపీ అదుపులో ఉంచడానికి సాయపడుతుంది. ఫలితంగా గుండె మీద ఒత్తిడి తగ్గుతుంది. బచ్చలి కూర లాంటి ఆకుకూరలు కూడా గుండెకు అదనపు బలం ఇస్తాయి.
  5. చిక్కుడు కూరను చాలామంది ఇష్టంగా తింటారు. చిక్కుడు కాయ తోలు కూడా గెండెకు మేలు చేస్తుంది.  దీనిలో పొటాషియం, వృక్ష రసాయనాలతో పాటు పీచు పదార్థాలు ఉంటాయి. నీటిలో కరిగే పీచు రక్తంలో కొలెస్ట్రాల్‌ లెవల్ ఎక్కువ అవ్వకుండా చూస్తుంది.
  6. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. రోజూ నిర్ణీత మోతాదులో కనీసం మూడు నెలల పైగా దానిమ్మ జ్యూస్ తాగితే, గుండెకు రక్త ప్రసారం బాగా జరుగుతుంది. దానిమ్మ పండు గుండె రక్తనాళాల్లో పేరుకుపోయే అడ్డంకులు (ప్లాక్స్)నూ క్లీన్ చేస్తాయి.
  7.  స్ట్రాబెర్రీలు, బ్లూ బెర్రీల లాంటివి తింటే, వాటిలో ఫైటోన్యూట్రియెంట్స్, పీచుపదార్థాలు రక్తనాళాల్ని వెడల్పు చేసి, హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు తగ్గిస్తాయని ఒక పరిశోధనలో వెల్లడైంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి..