‌‌Health Tips: ఆహారంలో మార్పులతో జీవిత కాలాన్ని 13 ఏళ్లు పెంచుకోవచ్చు.. నార్వే శాస్త్రవేత్తల స్టడీలో ఆసక్తికర విషయాలు

|

Feb 10, 2022 | 4:55 PM

సమతుల్య ఆహారంతో దీర్ఘాయువును పెంచుకోవచ్చని నార్వే శాస్త్రవేత్తలు తేల్చారు. దీంతో మహిళలు తమ జీవితాన్ని 10 సంవత్సరాలు, పురుషులు 13 సంవత్సరాల వరకు పెంచుకోవచ్చు.

‌‌Health Tips: ఆహారంలో మార్పులతో జీవిత కాలాన్ని 13 ఏళ్లు పెంచుకోవచ్చు.. నార్వే శాస్త్రవేత్తల స్టడీలో ఆసక్తికర విషయాలు
Super Foods
Follow us on

Health Tips: ఆహారం(Diet)లో చిన్న మార్పులు చేయడం ద్వారా, మీరు మీ వయస్సును 13 సంవత్సరాల వరకు పెంచవచ్చు. అవును మీరు విన్నది నిజమే. ఇలాంటి మార్పులు చేయడం ద్వారా మహిళల వయస్సు 10 సంవత్సరాల వరకు పెరుగుతుందని కొత్త అధ్యయనంలో శాస్త్రవేత్తలు తేల్చారు. PLOS మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, ఒక మహిళ 20 సంవత్సరాల వయస్సులో మంచి ఆహారం తీసుకోవడం ప్రారంభిస్తే, ఆమె తన జీవితాన్ని 10 సంవత్సరాలు పెంచుకోవచ్చని తెలిపింది. అలాగే ఒక పురుషుడు తన జీవితానికి 13 సంవత్సరాలు అధికంగా జీవించవచ్చని తేల్చారు. ఆరోగ్యకరమైన ఆహారం వృద్ధుల జీవితకాలాన్ని కూడా పొడిగించగలదని అధ్యయనం చెబుతోంది.

60 సంవత్సరాల వయస్సు నుంచి ఒక స్త్రీ తన జీవితాన్ని 8 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. మగవారు తమ జీవిత కాలానికి దాదాపు తొమ్మిది సంవత్సరాలు జోడించవచ్చని పేర్కొంది. ఆహారంలో పచ్చి ఆకుకూరలు, కూరగాయలు క్రమం తప్పకుండా తీసుకుంటే 80 ఏళ్ల వృద్ధుడు కూడా ప్రయోజనం పొందవచ్చని ఈ అధ్యయం తేల్చింది. ఈ వయస్సులో ఆహారంలో మార్పులు పురుషులు, మహిళల జీవితకాలాన్ని 3.5 సంవత్సరాల వరకు పెంచుతాయని పేర్కొంది.

ట్రూ హెల్త్ ఇనిషియేటివ్ ప్రెసిడెంట్, వ్యవస్థాపకుడు డాక్టర్ డేవిడ్ కాట్జ్ మాట్లాడుతూ, “సమతుల్య ఆహారం దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని, అకాల మరణ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీర్ఘాయువుని సొంతం చేసుకోవచ్చు’ అని అన్నారు. దీర్ఘాయువు కోసం అత్యంత ప్రయోజనకరమైన ఆహారాల గురించి మాట్లాడితే.. చిక్కుళ్ళు, వీటిలో బీన్స్, బఠానీలు, కాయధాన్యాలు ఉండాలని అధ్యయనం కనుగొంది. తృణధాన్యాలే కాకుండా వాల్ నట్స్, బాదం, పిస్తాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కూడా వ్యాధులు రాకుండా ఉంటాయి. ఆకు, ధాన్యపు ఆహారాలు కూడా ఎక్కువ కాలం జీవించడానికి సహాయపడతాయని ఈ అధ్యయనంలో తేలింది.

దీర్ఘాయువు, ఆహారంతో దాని సంబంధంపై డేటాను సేకరించడం కోసం చేసిన సర్వేలో ఇలాంటి ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. నార్వే పరిశోధకులు స్త్రీలు, పురుషుల దీర్ఘాయువులో ఆహారం పాత్రపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. దీని కోసం ఒక నమూనాను తయారు చేశారు. రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం పురుషులు లేదా స్త్రీల దీర్ఘాయువుతో ఎలా సంబంధం కలిగి ఉంటుందో ఇందులో పేర్కొన్నారు. రెండవ డేటాలో సమతుల్య ఆహారం ఉన్నవారి నుంచి సేకరించి రూపొందించారు. వీరి ఆహారంలో పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉన్నాయి.

Also Read: Kitchen Tips: పాన్ లో ఆహారం అంటుకుంటుందని ఇబ్బంది పడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలు మీ కోసం..

Teddy Day 2022: ఈరోజు టెడ్డీ డే.. మీ భాగస్వామికి ఇచ్చే టెడ్డీ బేర్ రంగుల ప్రాముఖ్యత ఏమిటంటే..