Ginger: అలెర్జీకి చెక్.. జలుబు మటుమాయం.. చిన్న అల్లం ముక్క తింటే ఇన్ని ఉపయోగాలా..!

|

Apr 04, 2022 | 9:12 AM

100 గ్రాముల అల్లంలో క్యాల్షియం 21గ్రా ఉంటుంది. 11గ్రాముల పిండి పదార్థాలు, 2.5గ్రాముల కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఎ, సి విటమిన్లు దండిగా ఉంటాయి.

Ginger: అలెర్జీకి చెక్.. జలుబు మటుమాయం.. చిన్న అల్లం ముక్క తింటే ఇన్ని ఉపయోగాలా..!
Benefits Of Ginger
Follow us on

Health Tips: ఉదయం వేళ కానీ.. సాయంకాలం కానీ ఓ కప్పు అల్లం టీ తాగితే ఆ కిక్కే వేరు. మైండ్ రిఫ్రెష్ అవుతుంది. ఇక జలుబు తెగ ఇబ్బంది పెడుతుంటే అల్లం మురబ్బాతో చెక్ పెట్టవచ్చు. జలుబు(common cold) రావడానికి కారణమైన రైనోవైరస్‌(Rhinovirus)ని అదుపుచేసే శక్తి అల్లానికి ఉంది. ఫుడ్‌కి టేస్ట్ కావాలన్నా కూడా.. అల్లం కావాల్సిందే.  అల్లానికి రక్తంలో కొవ్వుని తగ్గించే గుణాలు ఉన్నాయి.  జీర్ణ వ్యవస్థకు వచ్చే సమస్యలు కూడా దూరం చేయవచ్చు.  100 గ్రాముల అల్లంలో క్యాల్షియం 21గ్రా ఉంటుంది. 11గ్రాముల పిండి పదార్థాలు, 2.5గ్రాముల కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఎ, సి విటమిన్లు దండిగా ఉంటాయి. అల్లం వల్ల ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం

  • అల్లం రసంలో తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే వాంతులు తగ్గుతాయి.
  • అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
  •  దురదలు, దద్దుర్లు వంటి అలెర్జీ సమస్యలతో సతమతమయ్యేవారు… అల్లం రసం రెండు చెంచాలు తీసుకుని అందులో రెండు చిటికెల పసుపు, తగినంత పటిక బెల్లం వేసుకుని తాగాలి. ఇలా పదిహేను రోజులు తాగితే అలెర్జీ సమస్య నుంచి రిలీఫ్ లభిస్తుంది.
  • ఆహారంలో అల్లం భాగం చేయడం వల్ల గ్యాస్‌, అజీర్ణం, అరుచి వంటి సమస్యలన్నీ తొలగిపోతాయి.
  • అల్లం మీ ఆకలిని తగ్గిస్తుంది. జీర్ణక్రియ సమయంలో మీరు బర్న్ చేసే కేలరీల సంఖ్యను మెరుగుపరచడానికి ఇది సహాయపడుతుంది.
  • షుగర్ పేషెంట్స్‌కు ఇన్సులిన్ వ్యవస్థ మెరుగుపడేందుకు అల్లం ఉపయోగపడుతుంది.
  • కీళ్లు, ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడానికి కూడా అల్లం ఉపయోగపడుతుంది.
  •  కడుపులో గ్యాస్ ఏర్పడితే అల్లం దివ్యౌషధంలా పని చేస్తుంది.
  • విపరీతమైన దగ్గు ఇబ్బంది పెడుతుంటే వెంటనే అల్లం, ఉప్పు కలిపి తీసుకోంటే సరి.. ఆ సమస్య అక్కడే ఆగిపోతుంది.
  • అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గొంతులో, శ్వాసనాళాల్లో ఉన్న టాక్సిన్స్ ని వెంటనే తొలగిస్తాయి.

అయితే అల్లం, వెల్లుల్లిని కలిపి ఎక్కువగా తినకూడదు.

నోట్: ఇది నిపుణల నుంచి సేకరించిన సమాచారం. అల్లాన్ని మీ డైట్‌లో చేర్చుకొనే ముందు తప్పకుండా డైటీషియన్లు లేదా డాక్టర్ల సూచనలు తీసుకోవాలని మనవి.

Also Read: ఈ చిత్రంలో కొండచిలువ దాగి ఉంది.. కనిపెడితే మీరు గ్రేట్.. ట్రై చేయండి