
పెరుగు తినడం వల్ల పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పెరుగులో ప్రోటీన్స్, కాల్షియం, విటమిన్లు, మినరల్స్ ఇలా శరీరానికి అవసరమైన పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎముకలకి చాలా మంచిది. పెరుగులోని ప్రోబయోటిక్స్ జీర్ణక్రియని మెరుగ్గా చేస్తుంది. ఇది అసిడిటీ, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి.
రోజూ పెరుగు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెరుగులోని కాల్షియం, విటమిన్లు, కేలరీలు, ప్రోటీన్ శరీరానికి సరైన పోషణను అందిస్తాయి. పెరుగు కాల్షియం, విటమిన్లు B2, B12, పొటాషియం, మెగ్నీషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటుంది. పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. పెరుగులో కొవ్వు తక్కువగా ఉంటుంది. గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇందులోని కొవ్వు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
రోజూ పెరుగు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు తగ్గుతుంది. పెరుగులోని ప్రోటీన్స్ అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. కాబట్టి బరువు కూడా తగ్గుతారు. ఇక ఇందులోని కాల్షియం తలనొప్పి తగ్గిస్తాయి. అంతేకాదు..పెరుగు తీసుకోవడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పెరుగు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పెరుగు చుండ్రుతో సహా అనేక జుట్టు సమస్యలను తగ్గిస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..