అందమైన, ఆరోగ్యకరమైన జుట్టు కావాలని ఎవరు కోరుకోరు. మరీ ముఖ్యంగా ఆడవాళ్లకు జుట్టు మరింత అందాన్ని ఇస్తుంది. జుట్టు ఆరోగ్యకరంగా ఉండాలంటే.. దానిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ మధ్యకాలంలో చాలామంది జుట్టు సమస్యలతో సతమతమవుతున్నారు. జుట్టును ఆరోగ్యకరంగా ఉంచేందుకు మార్కెట్‌లో అనేక రకాల కెమికల్ ఉత్పత్తులు ఉండగా.. వాటిని యధాలాపంగా వినియోగిస్తే.. మరిన్ని సమస్యలు చుట్టుముడతాయి. మరి జుట్టును ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి.! మీ ఆహారపు అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేయండి చాలు.. రోజూ పచ్చి బఠానీలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. ఇవి జుట్టును ఆరోగ్యకరంగా ఉంచేందుకు తోడ్పడతాయి.
బఠానీల్లో ప్రోటీన్లు పుష్కలంగా దొరుకుతాయి. ఇక ప్రోటీన్లు జుట్టుకు చాలా అవసరం. మొక్కల ఆధారిత ప్రోటీన్ పచ్చి బఠానీల్లో సమృద్ధిగా ఉంటుంది. దీనిని అనేక రకాల షాంపూలు, కండీషనర్లలో ఉపయోగిస్తున్నారు.
వేడి, రసాయన ఉత్పత్తులు జుట్టులో ఉండే కెరాటిన్ ప్రోటీన్‌ను దెబ్బతీస్తాయి. దీని వల్ల జుట్టు బలహీనపడటమే కాకుండా.. రాలడం కూడా మొదలవుతుంది. ఇక బఠానీలో ఉండే ప్రోటీన్‌లో లభ్యమయ్యే అమినో యాసిడ్‌లు జుట్టు డ్యామేజ్‌ని నివారిస్తాయి. దానిని రిపేర్ చేసి కెరాటిన్‌ను పునర్నిర్మించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
బఠానీలలో ఉండే ప్రోటీన్‌లో లభ్యమయ్యే అమినో యాసిడ్‌లు కెరాటిన్ ఉత్పత్తి స్థాయిని పెంచుతాయి. ఇక కెరాటిన్.. మీ జుట్టు దృఢంగా, మృదువుగా పెరగడంలో సహాయపడుతుంది.
ప్రొటీన్‌తో పాటు ఐరన్, జింక్, విటమిన్ సి వంటి పోషకాలు కూడా బఠానీలలో పుష్కలంగా లభిస్తాయి. ఇవి మీ జుట్టు ఆరోగ్యకరంగా ఉండేందుకు సహాయపడతాయి.
జుట్టును అందంగా మెరిసేలా చేయడానికి.. బఠానీల్లో ఉండే ప్రోటీన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. జుట్టును ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉంచడమే కాదు.. పొడిబారే సమస్యను తగ్గిస్తుంది.
బఠానీలు జుట్టుకు సహజమైన ప్రొటీన్‌ను అందించడంలో సహాయపడతాయి. తద్వారా మీ జుట్టు అందంగా మారుతుంది.