AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జామకాయ vs ఆరెంజ్.. విటమిన్ సీ శక్తి ఎందులో ఎక్కువ ఉంటుంది..? మీరు అస్సలు ఊహించలేరు..

విటమిన్ సి అనగానే మనందరికీ గుర్తొచ్చే మొదటి పేరు నారింజ పండు.. కానీ.. మనం రోజువారీగా చూసే ఒక సాధారణ పండులో నారింజ కంటే ఏకంగా 4 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉందంటే నమ్ముతారా? అవును జామకాయలో ఎంత విటమిన్ సీ ఉంటుందో తెలిస్తే నోరెళ్లబెడతారు.. ఆ విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

జామకాయ vs ఆరెంజ్.. విటమిన్ సీ శక్తి ఎందులో ఎక్కువ ఉంటుంది..? మీరు అస్సలు ఊహించలేరు..
Guava Vs Orange
Krishna S
|

Updated on: Jul 07, 2026 | 8:26 AM

Share

శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలన్నా, చర్మం కాంతివంతంగా మెరిసిపోవాలన్నా అందరికీ మొదట గుర్తొచ్చేది విటమిన్ సి. ఈ విటమిన్ అనగానే చాలామంది వెంటనే మార్కెట్‌కు వెళ్లి నారింజ పండ్లను తెచ్చేసుకుంటారు. కానీ మనకు సాధారణంగా లభించే జామకాయ.. నారింజ కంటే చాలా శక్తివంతమైనదని మీకు తెలుసా? విటమిన్ సి రేసులో జామకాయ ముందుందా లేక నారింజనా? ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అంజలి దీనికి సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు.

అసలు విటమిన్ సి ఎందుకు ముఖ్యం?

చాలామంది విటమిన్ సి కేవలం జలుబు, దగ్గు రాకుండా చూస్తుందని అనుకుంటారు. కానీ దీని పాత్ర చాలా పెద్దదని డాక్టర్ అంజలి హూడా వివరిస్తున్నారు. ఇది శరీరంలో రోగనిరోధక ప్రతిస్పందనను బలోపేతం చేసి, ఇన్‌ఫెక్షన్లపై పోరాడటమే కాకుండా.. చర్మం యవ్వనంగా ఉండటానికి, ఎముకల బలానికి, కనెక్టివ్ కణజాలాల రక్షణకు అవసరమయ్యే కొల్లాజెన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది.

నారింజ: ఆరోగ్యం.. రీఫ్రెష్మెంట్

నారింజ పండును విటమిన్ సి కి కేరాఫ్ అడ్రస్‌గా భావిస్తారు. దీనివల్ల కలిగే ప్రయోజనాలు:

హైడ్రేషన్: ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడకుండా చూస్తుంది.

గుండె ఆరోగ్యం: నారింజలో ఉండే ఫ్లేవనాయిడ్లు, పొటాషియం రక్తపోటును నియంత్రించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

సులభంగా తినొచ్చు: దీని తొక్క తీయడం సులభం, ప్రయాణాల్లో కూడా స్నాక్‌గా తినడానికి వీలుగా ఉంటుంది.

జామకాయ: పోషకాల గని

జామకాయను చాలామంది లైట్ తీసుకుంటారు, కానీ దీనిలోని పోషకాలు అద్భుతమైనవి.

జీర్ణక్రియకు మేలు: ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది.

యాంటీ ఏజింగ్ గుణాలు: యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల చర్మంపై ముడతలు రాకుండా కాపాడుతుంది.

శక్తివంతమైన ఇమ్యూనిటీ: వాతావరణం మారినప్పుడు వచ్చే సీజనల్ వ్యాధుల నుండి ఇది మనల్ని రక్షిస్తుంది.

అసలైన పోటీ: జామ vs నారింజ

USDA (అమెరికా వ్యవసాయ శాఖ) డేటా ప్రకారం.. ఈ రెండింటి మధ్య విటమిన్ సి వ్యత్యాసం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే..

  • 100 గ్రాముల నారింజలో సుమారు 53 మిల్లీగ్రాముల విటమిన్ సీ ఉంటుంది.
  • 100 గ్రాముల జామకాయలో సుమారు 228 మిల్లీగ్రాములు విటమిన్ సీ ఉంటుంది.

అంటే 100 గ్రాముల జామకాయలో నారింజ కంటే నాలుగు రెట్లకు పైగా విటమిన్ సి ఉంటుంది. అంటే మీరు రోజువారీ శరీరానికి కావలసిన విటమిన్ సి ని అందుకోవడానికి ఒక్క జామకాయ తింటే సరిపోతుంది, అదే నారింజ పండ్లయితే నాలుగైదు తినాల్సి వస్తుంది.

నిపుణుల సలహా: డైట్‌లో దేన్ని ఎంచుకోవాలి?

మీరు తక్కువ ఖర్చులో, త్వరగా ఎక్కువ విటమిన్ సి పొందాలనుకుంటే ఖచ్చితంగా జామకాయ ఉత్తమమైన ఎంపిక. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని త్వరగా పెంచుకోవాల్సిన సమయంలో జామకాయ అద్భుతంగా పనిచేస్తుంది. అయితే అలా అని నారింజను పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. నారింజ ఇచ్చే రీఫ్రెష్మెంట్, గుండె ఆరోగ్య ప్రయోజనాలు దానికి ఉన్నాయి. అందుకే ఈ రెండింటినీ మీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా అన్ని రకాల పోషకాలను సమతుల్యంగా పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us
జామకాయ vs ఆరెంజ్.. విటమిన్ సీ శక్తి ఎందులో ఎక్కువ ఉంటుంది..?
జామకాయ vs ఆరెంజ్.. విటమిన్ సీ శక్తి ఎందులో ఎక్కువ ఉంటుంది..?
దశాబ్దాలు గడిచినా చెక్కుచెదరని ‘కెప్టెన్ కూల్’ 5 రికార్డులు..!
దశాబ్దాలు గడిచినా చెక్కుచెదరని ‘కెప్టెన్ కూల్’ 5 రికార్డులు..!
ఇకపై సిలిండర్ల కొరత ఉండదు.. కేంద్రం కీలక నిర్ణయం..!
ఇకపై సిలిండర్ల కొరత ఉండదు.. కేంద్రం కీలక నిర్ణయం..!
మనిషిని నొక్కిపట్టి అరగంట కూర్చున్న ఆడ సింహం.. ఏం చేసిందో చూస్తే
మనిషిని నొక్కిపట్టి అరగంట కూర్చున్న ఆడ సింహం.. ఏం చేసిందో చూస్తే
2 కిలోల బంగారం.. కోట్ల ఆస్తులు.. డీఎస్పీ చిట్టా చాంతాడంత..!
2 కిలోల బంగారం.. కోట్ల ఆస్తులు.. డీఎస్పీ చిట్టా చాంతాడంత..!
వరల్డ్‌కప్ నుంచి పోర్చుగల్ ఔట్.. కన్నీటితో రొనాల్డో వీడ్కోలు
వరల్డ్‌కప్ నుంచి పోర్చుగల్ ఔట్.. కన్నీటితో రొనాల్డో వీడ్కోలు
ఈ చెట్టు పండు దివ్యౌషధం..వయసును తగ్గిస్తుంది..ఇమ్యూనిటీ బూస్టర్!
ఈ చెట్టు పండు దివ్యౌషధం..వయసును తగ్గిస్తుంది..ఇమ్యూనిటీ బూస్టర్!
ఇదేందయ్యా ఇది..కాటేసే పామును కరకర నమిలేసిన జింక..వీడియో చూస్తే..
ఇదేందయ్యా ఇది..కాటేసే పామును కరకర నమిలేసిన జింక..వీడియో చూస్తే..
ఇడ్లీ vs దోశ.. వీటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
ఇడ్లీ vs దోశ.. వీటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
నా కుమారుడు చూడబోయే ఫస్ట్ సినిమా ఇదే: కాజల్ అగర్వాల్
నా కుమారుడు చూడబోయే ఫస్ట్ సినిమా ఇదే: కాజల్ అగర్వాల్