Diabetic Diet: డయాబెటిస్ ను కంట్రోల్ చేయడానికి ఈ నాలుగింటిని మీ డైట్ లో చేర్చుకోండి అద్భుతఫలితం పొందండి

|

Jun 10, 2021 | 4:24 PM

Diabetic Diet: మధుమేహ వ్యాధి అనగానే వెంటనే తీపి పదార్ధాలను, చక్కర, బెల్లం వాటిని తగ్గించమని అంటాం. అయితే నిజానికి షుగర్ వ్యాధి కి చక్కెర తీసుకోవడం..

Diabetic Diet: డయాబెటిస్ ను కంట్రోల్ చేయడానికి ఈ నాలుగింటిని మీ డైట్ లో చేర్చుకోండి అద్భుతఫలితం పొందండి
Diabetic Diet
Follow us on

Diabetic Diet: మధుమేహ వ్యాధి అనగానే వెంటనే తీపి పదార్ధాలను, చక్కర, బెల్లం వాటిని తగ్గించమని అంటాం. అయితే నిజానికి షుగర్ వ్యాధి కి చక్కెర తీసుకోవడం తగ్గించడం అనేది ప్రత్యామ్నయం కాదు. నిజానికి మధుమేహ వ్యాధిని తగ్గించుకోవడానికి తినడాల్సింది ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం. పీచు పదార్ధాలు ఎక్కువగా తింటే రక్తప్రవాహంలో చక్కెర విడుదలను తగ్గించడంలో సహాయపడతాయి. మధుమేహాన్ని కంట్రోల్ చేయడం లో సహాయపడే ఆహార పదార్ధాల గురించి తెలుసుకుందాం..

* బెండకాయ:

బెండకాయ అధికంగా ఫైబర్స్ కలిగి ఉంటుంది. దీనిలో అదనంగా మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లు మరియు ఖనిజాలను కలిగి ఉంటుంది. ఇది తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంది, కనుక బెండకాయ త్వరగా జీర్ణమవుతుంది. అంతేకాదు బెండకాయ విటమిన్ బి యొక్క మంచి మూలం .. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

* కాకరకాయ:

కాకరకాయ అంటేనే చాలామంది దూరం అంటారు. చేదు రుచి ఉంటుందని చాలా మంది దీనిని తినరు. అయితే, కాకరకాయ బరువు తగ్గించడంలో సహాయపడుతుంది మరియు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఒక అద్భుతమైన ఆహారం. ఎందుకంటే ఇందులో ఇన్సులిన్‌ను అనుకరించే పాలీపెప్టైడ్-పి లేదా పి-ఇన్సులిన్ అనే సమ్మేళనం ఉంటుంది.

*ముల్లంగి:

మధుమేహ వ్యాధిగ్రస్తులు ముల్లంగిని ఎక్కువగా తీసుకోవచ్చు. దీనిలో ఫైబర్ అధికంగా ఉంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ముల్లంగిని తినే ఆహారంలో చేర్చుకోండి. సలాడ్ , జ్యుస్ , సూప్ ఇలా ఏ రూపంలోనైనా షుగర్ వ్యాధిగ్రస్థులు ముల్లంగిని తీసుకోండి.

• రాగి:

డయాబెటిస్ ఉన్నవారు అన్నం గోధుమల కంటే రాగి పదార్ధాలను తీసుకోవడం మంచిది. రైస్ లో చాలా కార్బోహైడ్రేట్లను కలిగి ఉన్నందున, దాని తీసుకోవడం తగ్గించడం మంచిది. గోధుమలు తినడం కూడా మంచిది కాదు. దానికి బదులుగా రాగిని తినడం మంచిది., ఇది ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. ఫైబర్, కాల్షియం మరియు అవసరమైన అమైనో ఆమ్లాలతో నిండి, ఇది పోషకమైన తృణ ధాన్యo. రాగి జావ, రాగి ముద్దలు రాగి దోస ఒక పాపులర్ ఐటం. మీరు రాగి ఆలూ పరాటా కూడా ప్రయత్నించవచ్చు.

ఈ నాలుగింటిని రోజూ తినే డైట్ లో చేర్చుకోండి.. షుగర్ ను అదుపులో ఉంచుకోండి.

Also Read: రోజూ బాదంపప్పుని తింటే వైరల్ ఇన్ఫెక్షన్స్‌తో పోరాడే సామర్ధ్యంతో పాటు ఎన్ని ప్రయోజంలో తెలుసా