Food Poisoning: వేసవిలో ఫుడ్ పాయిజనింగ్‌ సమస్య అధికం.. చెక్ పెట్టాలంటే ఈ విషయాలను తెలుసుకోండి

|

Apr 05, 2022 | 8:13 AM

Food Poisoning Remedies: వేసవిలో ఆహారం చాలా త్వరగా పాడైపోతుంది. ఇలాంటి ఆహారాలు తీసుకోవడం ద్వారా ఫుడ్ పాయిజనింగ్ సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఫుడ్ పాయిజనింగ్‌కు ప్రధాన కారణం

Food Poisoning: వేసవిలో ఫుడ్ పాయిజనింగ్‌ సమస్య అధికం.. చెక్ పెట్టాలంటే ఈ విషయాలను తెలుసుకోండి
Food Poisoning
Follow us on

Food Poisoning Remedies: వేసవిలో ఆహారం చాలా త్వరగా పాడైపోతుంది. ఇలాంటి ఆహారాలు తీసుకోవడం ద్వారా ఫుడ్ పాయిజనింగ్ సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఫుడ్ పాయిజనింగ్‌కు ప్రధాన కారణం అనారోగ్యకరమైన ఆహారం. వాస్తవానికి, హానికరమైన బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్లు మొదలైనవి ఆహారంలో వృద్ధి చెందుతాయి. మనం ఈ ఆహారాన్ని తీసుకుంటే అవి మన శరీరంలోకి వెళ్లి విషపూరితంగా మారుతాయి. దీని వల్ల వాంతులు, వికారం, విపరీతమైన కడుపునొప్పి, విరేచనాలు వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ సమయంలో అలసట, బద్ధకం, అనారోగ్య సమస్యలు వస్తాయి. అటువంటి పరిస్థితిలో మనం తినే, తాగే వాటి విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ఇది కాకుండా ఫుడ్ పాయిజన్‌ను నివారించడానికి మనం కొన్ని ఇంటి నివారణలను కూడా ప్రయత్నించవచ్చు. అవేంటో తెలుసుకుందాం..

ఫుడ్ పాయిజనింగ్ నివారణలు

అల్లం: ఒక కప్పు నీటిలో ఒక టీస్పూన్ తురిమిన అల్లం వేసి మరిగించాలి. రుచికి అనుగుణంగా తేనె లేదా చక్కెర జోడించి తాగాలి. మీరు అల్లం ముక్కలను కూడా తినవచ్చు. ఇలా రెండు సార్లు చేయడం ద్వారా ఫుడ్ పాయిజనింగ్ కు అరికట్టవచ్చు.

పెరుగు: మెంతులు: పెరుగు, మెంతులు ఫుడ్ పాయిజనింగ్‌ను నయం చేయడానికి చాలా ప్రభావవంతమైన నివారణలుగా పరిగణిస్తారు. దీని కోసం ఒక పెరుగు, మెంతి గింజలను కలిపి తీసుకోవాలి. మెంతులు మెత్తగా నమిలి తింటే మంచి ఫలితం ఉంటుంది.

నిమ్మకాయ: ఫుడ్ పాయిజనింగ్‌ను నయం చేయడానికి నిమ్మకాయ ఒక గొప్ప ఔషధంగా పరిగణిస్తారు. దీని కోసం ఒక చెంచా నిమ్మరసంలో పంచదార, నీరు తాగితే తక్షణ ఉపశమనం లభిస్తుంది.

అరటిపండ్లు: ఫుడ్ పాయిజనింగ్‌ను నయం చేయడానికి అరటిపండు మంచి ఔషధం. అవి చాలా తేలికగా సులభంగా జీర్ణమవుతాయి. దీనిని నివారించడానికి ప్రతిరోజూ కనీసం ఒక అరటిపండు తినాలి. ఇది కాకుండా బనానా షేక్ కూడా తీసుకోవచ్చు.

ఆపిల్ వెనిగర్: ఒక కప్పు వేడి నీటిలో 2-3 టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ కలపి తాగాలి. ఆహారం తీసుకునే ముందు దీన్ని తాగడం మంచిది.

ఈ విషయాలను గుర్తుంచుకోండి..

భోజనం చేసే స్థలాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. పాత్రలను శుభ్రంగా ఉంచుకోవాలి.

పొడి సుగంధ ద్రవ్యాలు, ఆహార పదార్థాలల్లో ఫంగస్ సులభంగా కనిపిస్తుంది. కాబట్టి వాటిని ఉపయోగించే ముందు తనిఖీ చేయండి.

నామ్‌కీన్ – బిస్కెట్లు వంటి స్నాక్స్‌ని హెయిర్ టైట్ బాక్స్‌లలో ఎల్లప్పుడూ ఉంచండి.

మసాలా దినుసులలో ఫంగస్ లాంటివి ఉంటాయి. క్రమం తప్పకుండా తనిఖీ చేయండి.

పెరుగు, పాలు, టమోటాలు వంటి వాటిని ఎల్లప్పుడూ ఫ్రీజర్‌లో నిల్వ చేయండి.

వంటగదిని శుభ్రంగా ఉంచుకోండి. ఎల్లప్పుడూ కత్తిని కడిగే ఉపయోగించాలి.

ఎల్లప్పుడూ పిండిని, మిగిలిన కూరగాయలను రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయండి. తినడానికి ముందు తనిఖీ చేయండి.

(ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం సమాచారం కోసం మాత్రమే.. నిపుణులను సంప్రదించిన తర్వాత మాత్రమే దీన్ని అనుసరించండి.)

Also Read:

Stomach Pain: కడుపునొప్పి బాధపడుతున్నారా..? ఇది వాడి చూడండి.. మందుల అవసరమే ఉండదు..

Dinner Tips: బిజీ లైఫ్‌తో రాత్రి లేటుగా తింటున్నారా? అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..