Beauty Tips: కరోనా నుంచి కోలుకున్నాక మీ జుట్టు ఎక్కువగా రాలిపోతుందా ? అయితే ఈ చిట్కాలను ఫాలో అవ్వండి..

|

Jun 24, 2021 | 12:38 PM

ప్రస్తుతం కరోనా రెండో దశ ప్రజలలో చాలా సమస్యలను కలిగిస్తుంది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత అలసట, నీరసం, ప్వూ లక్షణాలతో చాలా మంది

Beauty Tips: కరోనా నుంచి కోలుకున్నాక మీ జుట్టు ఎక్కువగా రాలిపోతుందా ? అయితే ఈ చిట్కాలను ఫాలో అవ్వండి..
Covid Stress
Follow us on

ప్రస్తుతం కరోనా రెండో దశ ప్రజలలో చాలా సమస్యలను కలిగిస్తుంది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత అలసట, నీరసం, ప్వూ లక్షణాలతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కరోనాను జయించిన మహిళలలో జుట్టు రాలడం సమస్య తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇందుకు కారణం.. కరోనా వలన కలిగే భయాలు.. ఒత్తిడి అని చెబుతున్నారు. అయితే ఒత్తిడితో కలిగిన వ్యాధులు నయమైన తర్వాత జుట్టు రాలిపోవడం సర్వసాదారణం. అయితే జుట్టు రాలే సమస్యను కొన్ని చిట్కాలతో నివారించవచ్చు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

* జుట్టు రాలే సమస్యను అధిగమించాలంటే రోజూ ఏడు బాదం పప్పులు, రెండు వాల్ నట్స్ తినాలి.
* అలాగే టీస్పూన్ సబ్జా గింజలు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు తీసుకోవడం వలన జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు.
* ప్రోటీన్ జుట్టు రాలే సమస్యను తగ్గించి ఒత్తుగా పెరిగేందుకు సహకరిస్తుంది. ఇందుకోసం రోజూ మూడు కోడిగుడ్ల తెల్లసొనలు, ఒక పచ్చసోన తీసుకోవడం మంచిది.
* శరీరంలో బీ12 విటమిన్ లోపముంటే కొత్త జుట్టు పెరిగేందుకు ఇది అడ్డు పడుతుంది.
* విటమిన్ డి… లోపం వలన అలోపేసియా (జుట్టు ప్యాచుల్లా రాలిపోవడం) సమస్య తలెత్తుతుంది.
* విటమిన్ సి సప్లిమెంట్స్ కూడా తీసుకోవాలి. అయితే సప్లిమెంట్స్ తీసుకునే మోతాదు గురించి మీ డాక్టర్ తో సంప్రదించి తీసుకోవడం మంచిది.
* జుట్టును ఇష్టమొచ్చినట్లుగా దువ్వడం.. బ్లో డ్రయర్స్ వాడడం కాస్త వేడిగా ఉండే నూనెతో మసాజ్ చేయడం వలన జుట్టు మరింత దెబ్బతింటుంది.
* ఒత్తిడిని తగ్గించుకుంటే అంత మంచిది. ధ్యానం, యోగా, శ్వాస సంబంధిత వ్యాయమాలు వంటివి మంచి ఫలితాన్ని అందిస్తాయి.
* ఆకుకూరలు, మాంసం, చేపలు వంటిని తినడం మంచిది. వీటిలోని పోషకాలు జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి.

Also Read: Brahmamgari Matam: రోజుకో మలుపు తిరుగుతున్న బ్రహ్మంగారి మఠం వివాదం.. ధార్మిక పరిషత్‌, దేవాదాయశాఖకు చేరిన పంచాయితీ

Nokia Employees: ఉద్యోగుల భద్రత కోసం నోకియా కీలక నిర్ణయం.. వారంలో 3 రోజులు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోమ్‌

Simhachalam Priest: సింహాచలంలో అర్చకుల మధ్య ఆధిపత్య పోరు.. మార్ఫింగ్‌ వీడియో కలకలం.. బాధ్యులపై చర్యలకు వేద పండితుల డిమాండ్