Quick Dinner Ideas: వంట చేయడానికి బద్ధకంగా ఉందా? కేవలం 10 నిమిషాల్లో ఈ ‘స్మార్ట్’ డిన్నర్ ట్రై చేయండి!

కొన్ని రోజులు వంట చేయాలనిపిస్తుంది.. మరికొన్ని రోజులు వంట అదే జరిగిపోతే బాగుండు అనిపిస్తుంది. ఆఫీసు నుండి అలసిపోయి వచ్చినప్పుడో లేదా ఆదివారం బద్ధకంగా ఉన్నప్పుడో గంటల తరబడి కిచెన్‌లో గడపడం ఎవరికీ ఇష్టం ఉండదు. కానీ వండకపోతే కుదరని పరిస్థితులు.

Quick Dinner Ideas: వంట చేయడానికి బద్ధకంగా ఉందా? కేవలం 10 నిమిషాల్లో ఈ ‘స్మార్ట్’ డిన్నర్ ట్రై చేయండి!
Quick Dinner Ideas.jpg

Updated on: Feb 26, 2026 | 6:10 AM

అందుకే తక్కువ శ్రమతో, ఇంట్లో ఉన్న వస్తువులతోనే రెస్టారెంట్ స్టైల్​ డిన్నర్​ రెసిపీస్​ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. వంట గదిలోకి వెళ్లాలంటేనే భయం వేసే రోజులు మనందరికీ ఎదురవుతాయి. అటువంటప్పుడు ఆర్డర్ ఇచ్చే బదులు, ఇంట్లో ఉన్న సాధారణ పదార్థాలతోనే వినూత్నమైన వంటకాలను తయారు చేసుకోవచ్చు. మిగిలిపోయిన చపాతీలు ఉన్నాయా? లేదా ఇంట్లో కేవలం ఇన్‌స్టంట్ నూడుల్స్ మాత్రమే ఉన్నాయా? వాటిని ఎలా ఖరీదైన కేఫ్ స్టైల్ వంటకాలుగా మార్చాలో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కేవలం 10 నిమిషాల్లో సిద్ధమయ్యే ఆ 6 అద్భుతమైన డిన్నర్ ఐడియాస్ ఏంటో చూద్దాం.

  • నాచో సలాడ్- ఒక పెద్ద గిన్నెలో నాచోస్ వేసి.. అందులో రాజ్మా, స్వీట్ కార్న్, ఉల్లిపాయలు, టమోటాలు, కొత్తిమీర, తురిమిన చీజ్ వేయండి. పైన కొంచెం నిమ్మరసం చల్లితే క్రంచీగా ఉండే నాచో సలాడ్ సిద్ధం. ఇది తింటే ఏదో చాట్ తిన్న ఫీలింగ్ కలుగుతుంది.
  • రోటీ టాకోస్- రాత్రి మిగిలిపోయిన చపాతీలను లైట్‌గా వేడి చేసి.. అందులో మష్రూమ్స్ లేదా పనీర్ భూర్జీని నింపండి. పుదీనా చట్నీ, కొంచెం నిమ్మరసం పిండితే మీ దేశీ ‘టాకోస్’ రెడీ. మిగిలిపోయిన ఫుడ్‌ను కూడా ఇలా రాయల్ గా తినొచ్చు.
  • అవకాడో చిల్లీ టోస్ట్- బ్రెడ్ ముక్కలను టోస్ట్ చేసి, దానిపై అవకాడో పేస్ట్ రాయండి. పైన దానిమ్మ గింజలు లేదా చెర్రీ టమోటాలు వేసి డెకరేట్ చేస్తే ఎంతో రుచిగా ఉండటమే కాకుండా చూడటానికి కేఫ్ ఫుడ్ లా కనిపిస్తుంది.
  • దేశీ క్వెసాడిల్లా- రెండు చపాతీల మధ్యలో మిగిలిపోయిన ఆలూ గోబీ లేదా భిండీ ఫ్రై లాంటి సబ్జీని నింపి, చీజ్ వేసి బట్టర్ తో కాల్చండి. దీనిని ట్రయాంగిల్ ముక్కలుగా కోసి సాస్‌తో తింటే ఆ మజాయే వేరు.
  • గార్లిక్ రామెన్- ఇన్‌స్టంట్ నూడుల్స్ ఉడకబెట్టి.. ఒక పాన్‌లో వెల్లుల్లి, సోయా సాస్, తేనె వేసి సాట్ చేయండి. అందులో మీకు నచ్చిన కూరగాయలు వేసి నూడుల్స్ కలిపితే ఖరీదైన హోటల్ రామెన్ రెడీ.
  • స్నాక్ బోర్డ్ డిన్నర్- అసలు పొయ్యి వెలిగించే ఓపిక లేనప్పుడు.. ఒక ప్లేట్‌లో టోస్ట్ చేసిన బ్రెడ్, హుమ్ముస్ లేదా చట్నీ, క్యారెట్ ముక్కలు, కొన్ని నట్స్, ఆపిల్ ముక్కలు పెట్టుకుని సర్వ్ చేయండి. ఇది హెల్తీగా ఉండటమే కాకుండా కడుపు నింపుతుంది.

వంట అనేది ఎప్పుడూ ఒక సీరియస్ పనిలా ఉండకూడదు. మన దగ్గర ఉన్న వాటితోనే కొత్త ప్రయోగాలు చేస్తే డిన్నర్ బోర్ కొట్టకుండా ఉంటుంది.

Follow Us