ఆదివారం అంటే చాలు.. నాన్‌వెజ్ లవర్స్‌కు ముక్క లేనిదే ముద్ద దిగదు. అందుకే వీకెండ్స్‌లో నగరాలలోని మర్కెట్స్ అన్నీ కూడా రద్దీగా ఉంటాయి. ఆ రోజు చాలామంది చేపలు, చికెన్, మటన్ కొంటుంటారు. కొంతమందికి చికెన్, మటన్ ఇష్టమైతే.. మరికొందరికి చేపలు అంటే మహా ఇష్టం. ఇదంతా బాగానే ఉంది. మనం ఏం తింటున్నాం అన్నది కాసేపు పక్కన పెడితే.. తీసుకునే ఆహారం.. మనల్ని ఎంతవరకు ఆరోగ్యకరం ఉంచుతోందన్నది మీరెప్పుడైనా ఆలోచించారా.? చేపలు చాలామంది ఇష్టంగా తింటారు. అవి మన ఆరోగ్యానికి ఎంత వరకు మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..
చేపలలో ప్రోటీన్, కాల్షియం, ప్రోస్పరెస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యకరంగా ఉండేందుకు వారానికి రెండు, మూడు సార్లు చేపలు తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. చేపలలో కొవ్వు పదార్ధాలు తక్కువని.. నాణ్యమైన పోషకాలు మరింత ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటిస్ వంటి వ్యాధులు చేపలు తినడం వల్ల కంట్రోల్‌లో ఉంటాయి. దీనితో పాటు అల్జీమర్స్, కీళ్ల నొప్పులు, గుండె జబ్బులకు కూడా చెక్ పెట్టొచ్చు. అంతేకాకుండా చేపల తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరగడంతో డోపమైన్, సెరోటోనిన్ అనే హార్మోన్ల స్థాయిలు పెరిగి డిప్రెషన్స్‌ను తగ్గిస్తాయి. అలాగే చేపలు పలు రకాల క్యాన్సర్లను రాకుండా అడ్డుకుంటాయి.