Cauliflower Pickle:కాలీఫ్లవరు పోషక పదార్ధాలు అధికంగా ఉన్న కూరగాయ. కేబేజీ, కాలీఫ్లవరు ఒకే కుటుంబం కాకపోయినా ఒక జాతి మొక్కలే. అయితే కాలీఫ్లవర్ చూడటానికే కాదు తినటానికి కూడా చాలా బాగుంటుంది. అయితే మనకు ఎక్కువగా తెల్లగా ఉన్న కాలిప్లవర్ మాత్రమే తెలుసు.. కానీ కొన్ని ప్రాంతాల్లో కాలిప్లవర్ నారింజ రంగు లోనూ, కొన్ని బచ్చలిపండు రంగులోనూ కూడా దొరుకుతున్నాయి. వీటిల్లో తెల్ల రంగు కాలిప్లవర్ ఉన్న వాటిలో కంటే 25 శాతం అధికంగా పోషకాలు ఉంటాయట. బచ్చలి కలర్ లో కాలిప్లవర్ కనిపించడానికి కారణం ఆంథోసయనిన్ అనే రసాయనం.. ఇక నారింజ రంగు కాలిప్లవర్ కి ఎర్ర ద్రాక్ష సారా ఆ రంగుని ఇస్తుందట. ఈ రసాయనం ఏంటీఆక్సిడెంటు కోవకి చెందటం వలన ఇది శరీరానికి మేలు చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు, కాలీఫ్లవరులో పిండి పదార్ధాలు తక్కువ కనుక బంగాళాదుంప తినటానికి వీలులేని వారు.. బంగాళా దుంపల బదులు కాలిప్లవర్ ను తినవచ్చు. దీనిని పచ్చిగాను, ఉడకబెట్టుకుని తింటారు. ఇక ఈ కాలిప్లవర్ తో కురాలే కాదు.. స్నాక్ ఐటెం కూడా చేస్తారు. ఇక కాలిప్లవర్ తో నిల్వ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. రుచికరమైన కాలిప్లవర్ నిల్వ పచ్చడి తయారీ ఎలా చేయాలో తెలుసుకుందాం..
పచ్చడికి కావాల్సిన పదార్థాలు:
కాలీఫ్లవర్ – ఒకటి
కారం – 4 చెంచాలు
ఆవపిండి – 4 చెంచాలు
మెంతిపిండి – 1 చెంచా
వెల్లుల్లి రెబ్బలు – 10
ఉప్పు రుచికి పరిపడా
నూనె – తగినంత
పసుపు- కొంచెం
నిమ్మరసం
పోపుకు కావాల్సిన దినుసులు
ఎండు మిర్చి
ఆవాలు
వెల్లుల్లి
కర్వేపాకు
ఇంగువ
తయారి విధానం:
ముందుగా కాలిప్లవర్ ను శుభ్రం చేసుకుని నీటిలో ఉప్పు కలిపి.. అందుకో శుభ్రం చేసుకున్న కాలిప్లవర్ ముక్కలను వేయాలి. పురుగులు లేకుండా చూసుకోవాలి. అనంతరం నీటి నుంచి కాలిప్లవర్ ముక్కలను తీసుకుని నీరు లేకుండా ఒక బట్టమీద ఆరబెట్టాలి. తర్వాత స్టౌ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి అందులో తరిగిపెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలని వెయ్యాలి. మూత పెట్టకుండా కాస్త ఎరుపు రంగు వచ్చేదాకా వేయించి ఒక బౌల్ లోకి తీసి పెట్టుకోవాలి. ఆ ముక్కలలో కారం, ఉప్పు, మెంతి పిండి, ఆవపిండి, పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత కొంచెం నిమ్మరసం వేసుకుని కలుపుకోవాలి. ఇలా తయారయిన మిశ్రమంలో పోపు వేసుకుపోవాలి. అంతే ఎంతో ఘుమఘుమలాడే కాలీఫ్లవర్ నిలవ పచ్చడి రెడీ.
Also Read: మగవారిలో లైంగిక సామర్ధ్యాన్ని పెంచే ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధం ‘పల్లేరు’.. ఎలా ఉపయోగించాలంటే