చియా సీడ్స్​ని నానపెట్టకుండా తింటున్నారా..? మీ ఆరోగ్యం డేంజర్‌లో పడినట్టే.. వైద్యులు ఏం చెప్తున్నారంటే..!

చియా గింజలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. ఇది చర్మంపై ముడతలు రాకుండా నివారిస్తుంది. యవ్వనంగా ఉండటానికి సహాయపడుతుంది. చియా గింజలలో ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడే ఖనిజాలు ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. కానీ, వాటిని సరిగ్గా తినకపోతే ఆస్పత్రిలో చేరాల్సిన అత్యవసరం ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చియా సీడ్స్​ని నానపెట్టకుండా తింటున్నారా..? మీ ఆరోగ్యం డేంజర్‌లో పడినట్టే.. వైద్యులు ఏం చెప్తున్నారంటే..!
Chia Seeds

Updated on: Jun 14, 2025 | 9:34 PM

చియా సీడ్స్​తో శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. వివిధ పోషకాలతో నిండిన చియా గింజలు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా బరువు తగ్గడానికి కూడా చాలా ఉపయోగపడతాయి. కొన్ని గింజలలో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, ఫైబర్, ప్రోటీన్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి వివిధ విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. చియా గింజలలో ఉండే ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. చియా గింజలలో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మెదడు పనితీరు, గుండె ఆరోగ్యం, వాపును తగ్గించడంలో సహాయపడతాయి.

చియా గింజలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. ఇది చర్మంపై ముడతలు రాకుండా నివారిస్తుంది. యవ్వనంగా ఉండటానికి సహాయపడుతుంది. చియా గింజలలో ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడే ఖనిజాలు ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. కానీ, వాటిని సరిగ్గా తినకపోతే ఆస్పత్రిలో చేరాల్సిన అత్యవసరం ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

డ్రై చియా సీడ్స్​ తిని, ఆ తర్వాత నీళ్లు తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయి. చియా సీడ్స్​ పరిమాణం పెరిగి గొంతు- కడుపు మధ్య ఆగిపోతాయట. అయితే, ఇది చాలా అరుదుగా జరగవచ్చు. ఒకవేళ జరిగితే మాత్రం వాటిని తొలగించేందుకు ఎండోస్కోపిక్​ సర్జరీ చేయాల్సి ఉంటుంది. చియా సీడ్స్​వాటి బరువు కన్నా 27రెట్లు ఎక్కువ నీటిని పీల్చుకోగలవు. అందుకే ఎలాంటి సమస్యలు రాకూడదంటే చియా సీడ్స్​ని రాత్రంతా నానపెట్టిన తర్వాత తినాలి. అది కుదరకపోతే కనీసం 30 నిమిషాలు నానపెట్టాలని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..