భారతీయులు ఎక్కువగా రాత్రి మిగిలిపోయిన అన్నంను పడేయకుండా.. మరునాడు ఉదయాన్నే తింటుంటారు. అయితే కొన్నిసార్లు నేరుగా అన్నాన్ని తినకుండా.. పోపు వేసుకోవడం.. లేదా ఆ అన్నంతో వడియాలు పెట్టడం చేస్తుంటారు. ఇక పూర్వ కాలంలో చద్దన్నంతోనే వారి రోజూ మొదలయ్యేది. ప్రస్తుతం టిఫిన్లు చేసుకుంటున్న వారికి దాదాపు చద్ధన్నం తినడం ఎవరు చేయడం మిగిలితే పడేస్తున్నారు. ఇక మన పెద్దవారు ఒకప్పుడు ఉదయం ఐదు గంటలకల్లా చద్దన్నం తినేసి పొలాలకు వెళ్లిపోయేవారు. అయితే ప్రస్తుతం కాలంలో చద్దన్నాం తినాలంటే.. చాలా మందికి అనేక సందేహాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా దీని వలన సైడ్ ఎఫేక్ట్స్ వచ్చే ప్రభావం ఉందని భ్రమపడుతుంటారు. కానీ చద్దన్నం వలన కలిగే ప్రయోజనాలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. రాత్రి మిగిలిన అన్నం.. శరీరానికి శక్తిని అందిస్తుంది. ఉదయాన్నే తినడం వలన రోజంత ఉత్సహంగా ఉంటారు.
2. ఇక కాళ్ళకు చేతులకు ఏదైనా దెబ్బలు తగిని చద్దన్నం తినడం వలన అవి తొందరగా మానే అవకాశం ఉంటుంది. అందుకే వారానికి మూడుసార్లు చద్దన్నం తినడం వలన దెబ్బలు తగ్గుతాయి.
3. ఉదయాన్నే చద్దన్నం తినడం వన మలబద్ధకం సమస్య తగ్గుతుంది. రోజూ చద్ధన్నం తినడం వలన మలబద్ధకం సమస్యను పూర్తిగా నివారిస్తుంది. ఇందులో అధికంగా ఫైబర్ ఉంటుంది.
4. రోజూ ఉదయాన్నే చద్దన్నం తినే అలవాటు ఉంటే.. టీ ఎక్కువగా తాగే అలవాటు తగ్గిపోతుంది.
5. చద్దన్నం తినడం వలన రోజంతా ఉత్సహంగా ఉంటారు. అలాగే.. బలంగా ఉండేలా చేస్తుంది.
6. చద్దన్నం తినడం వలన శరీరం చల్లగా ఉంటుంది. ప్రతి రోజూ వీటిని తినడం వలన శరీరంలో అధిక ఉష్ణోగ్రత సమస్య తగ్గుతుంది.
Also read: Summer Health Tips: వేసవిలో కుండ నీళ్ళు తాగడం వలన ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..
Happy Holi 2021: ఈ రంగుల హోలీకి అందమైన కోట్స్‌తో మీ ఆత్మీయులను విష్ చేయాండిలా..
ఆదిలాబాద్ రిమ్స్‌లో బాలింతల వార్డులోకి దూసుకొచ్చిన నాగుపాము.. ముప్పుతిప్పలు.. చివరకు