Green Tea: రోజూ గ్రీన్ టీ తాగుతున్నారా ? అయితే ఈ పొరపాట్లు మాత్రం అసలు చేయకూడదు..

|

Mar 28, 2021 | 5:56 PM

Green Tea: ఇటీవల చాలా మంది వెయిల్ లాస్ అవ్వడం కోసం గ్రీన్ టీని తీసుకుంటుంటారు. అయితే చాలా మంది ఈ టీని ఉదయం మాత్రమే కాకుండా..

Green Tea: రోజూ గ్రీన్ టీ తాగుతున్నారా ? అయితే ఈ పొరపాట్లు మాత్రం అసలు చేయకూడదు..
Green Tea
Follow us on

Green Tea: ఇటీవల చాలా మంది వెయిల్ లాస్ అవ్వడం కోసం గ్రీన్ టీని తీసుకుంటుంటారు. అయితే చాలా మంది ఈ టీని ఉదయం మాత్రమే కాకుండా.. తమకు వీలున్న సమయాల్లో తాగుతుంటారు. అంతేకాకుండా.. రోజూలో ఎక్కువసార్లు టీని తాగుతుంటారు. అయితే గ్రీన్ టీ తీసుకునే ముందు కొన్ని విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..

— సాధరణంగా భోజనం తర్వాత అసలు గ్రీన్ టీ తీసుకోవద్దు. భోజనం చేసిన వెంటనే.. ఆహారం జీర్ణం కాదు. అలాగే ఆహారంలోని ప్రోటీన్లు శరీరానికి అందవు. అందుకే భోజనం చేసిన వెంటనే గ్రీన్ టీ తాగకూడదు.

Green Tea 3

— గ్రీన్ టీ మరీ వేడిగా ఉన్నప్పుడు తాగకూడదు. వేడిగా ఉన్నప్పుడు తాగితే.. రుచిగా అనిపించదు. అలాగే.. మీ పొట్టను, గొంతును దెబ్బతీస్తుంది. అందుకే గ్రీన్ టీ కాస్తా చల్లారిన తర్వాత తాగడం మంచిది.

Green Tea 5

— చాలా మందికి గ్రీన్ టీ ఉదయం లేవగానే తాగే అలవాటు ఉంటుంది. అలా చేయడం అసలు మంచిది. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ ఉండడం వలన.. ఖాళీ కడుపుతో దీనిని తాగితే.. కడుపులో ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. అలాగే జీర్ణక్రియకు భంగం కలిగిస్తాయి. అందుకే బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత గ్రీన్ టీ తీసుకోవడం ఉత్తమం.

Green Tea 7

— గ్రీన్ టీ వేడిగా ఉన్నప్పుడు అసలు తేనే కలపకూడదు. చాలా మంది చక్కెరకు బదులుగా తేనే యాడ్ చేస్తుంటారు. వేడిగా ఉన్నప్పుడు తేనే కలిపితే.. అందులోని పోషక విలువలు నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే గ్రీన్ టీ కాస్త్ చల్లారిన తర్వాత దాల్చిన చెక్క, తేనే కలపడం ఉత్తమం.

Green Tea 9

— చాలా మంది గ్రీన్ టీ తాగుతూ… మందులు వేసుకుంటారు. అయితే గ్రీన్ టీతో కలిపి మందులు వేసుకోవడం వలన యాసిడిటీకి దారి తీస్తుంది. అందుకే ట్యాబ్లెట్స్‏ను నీటితో మాత్రమే తీసుకోవాలి.

Green Tea 1

— టీలో ఉండేలాగే.. గ్రీన్ టీలోనూ కెఫిన్ ఉంటుంది. అందువలన రోజూలో ఎక్కువగా గ్రీన్ టీ తీసుకోవద్దు. ఎక్కువగా గ్రీన్ టీ తాగితే.. తలనొప్పి, బద్ధకం, అలసట, ఆందోళన, చిరాకు వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాగే శరీరంలోని ఐరన్ శాతాన్ని తగ్గిస్తుంది. అందుకే రోజూలో కేవలం 2-3 కప్పుల టీ మాత్రమే తాగాలి.

Green Tea 4

–గ్రీన్ టీ ఆకులను ఎక్కువసేపు సీప్ చేయకూడదు. ఎక్కువగా సీప్ చేయడం వలన అందులో ఉండే పోషకాలు తోలగిపోతాయి. తర్వాత విషపూరితం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే రుచి కూడా చెదుగా ఉంటుంది.

Green Tea 6

– గ్రీన్ టీని హడావిడిగా తాగకూడదు. ఆఫీసుకు వెళ్ళే సమయంలో టీ తాగకూడదు. దీనివలన మెదడు చురుకుగా ఉండదు. అలాగే జీవక్రియ రేటును పెంచుతుంది.

Also Read:

Holi 2021: హోలీలో వాడే గులాల్ రంగు నుంచి మీ జుట్టును ఈ విధంగా కాపాడుకోండిలా..