AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diet Tips: ఉడకబెట్టిన గుడ్డుతోపాటు వీటిని తీసుకుంటున్నారా.. అయితే ఈ 5 వ్యాధుల బారిన పడే ఛాన్స్..!

Boiled Egg And Tea Side Effects: ఉదయం అల్పాహారంగా ఉడకబెట్టిన గుడ్లతో పాటు టీ కూడా తీసుకోవడం సాధారణంగా మారింది. అయితే టీతోపాటు ఉడకబెట్టిన గుడ్డును కలిపి తీసుకంటే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు.

Diet Tips: ఉడకబెట్టిన గుడ్డుతోపాటు వీటిని తీసుకుంటున్నారా.. అయితే ఈ 5 వ్యాధుల బారిన పడే ఛాన్స్..!
Egg With Tea
Follow us
Venkata Chari

|

Updated on: Feb 21, 2022 | 5:13 PM

Health Tips: గుడ్డు(EGG) అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న ఆహారాలలో ఒకటిగా పేరుగాంచింది. ఉడకబెట్టడం నుంచి ఆమ్లెట్ వరకు వివిధ రకాల వంటకాలు తయారు చేస్తారు. అయితే చాలా మంది ఉడకబెట్టిన గుడ్లను తినడానికి ఇష్టపడుతుంటారు. సహజంగానే గుడ్డు ఉడకబెట్టడం, తినడం కూడా చాలా సులభం. ఉదయం అల్పాహారంలో టీతో పాటు ఉడికించిన గుడ్లు తినడం తరచుగా కనిపిస్తుంది. అయితే టీతోపాటు ఉడకబెట్టిన గుడ్డు కలయిక ఆరోగ్యాని(Health)కి మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఉడకబెట్టిన కోడిగుడ్లు తింటే ఎన్నో లాభాలు ఉంటాయనడంలో సందేహం లేదు. ఉడికించిన గుడ్డు ప్రోటీన్‌కు మంచి మూలంగా ఉంటుంది. ఇది మీ శరీర పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇందులో కాల్షియం కూడా ఉంటుంది. దీని కారణంగా మీ ఎముకలు కాల్షియం పొంది, బలంగా మారుతాయి. మీ జీవక్రియను పెంచడం ద్వారా మీ బరువును నియంత్రించడంలో గుడ్లు కూడా సహాయపడతాయి.

జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో జరిపిన ఒక అధ్యయనంలో గుడ్లతో కలిపి టీ తాగడం వల్ల గుడ్లలోని ప్రోటీన్ కంటెంట్ 17 శాతం వరకు తగ్గుతుందని తేలింది. టీలో పాలీఫెనాల్స్ అని పిలువబడే సమ్మేళనాలు ఉన్నాయని తెలిసిందే. ఇది గుడ్లలోని ప్రోటీన్‌లకు కట్టుబడి, దానిని గ్రహించకుండా నిరోధిస్తుంది. సహజంగానే శరీరంలో ప్రోటీన్ తక్కువగా ఉంటే, దీని కారణంగా శరీరంలో అనేక తీవ్రమైన వ్యాధులు తలెత్తుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

మలబద్ధకం.. టీ, గుడ్డు కలిపి చాలా మంది ఇష్టపడే కలయికలలో ఒకటి. నిజానికి, ఈ కలయిక మీ శరీరానికి మరింత తీవ్రమైన హాని కలిగించే మలబద్ధకాన్ని కలిగిస్తుంది.

చర్మం, జుట్టుతోపాటు గోర్ల సమస్యలు.. ప్రోటీన్ లోపం చర్మం, జుట్టు, గోళ్లపై ప్రభావం చూపుతుంది. అవన్నీ ప్రొటీన్లతో నిర్మితమై ఉంటాయి. దీని లోపం వల్ల చర్మం ఎర్రగా మారడం, గోళ్లు పెళుసుగా మారడం, పల్చటి వెంట్రుకలు, జుట్టు రంగు మారడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

ప్రోటీన్ లోపం.. మీ కండరాలు ఎక్కువగా ప్రొటీన్‌తో తయారవుతాయి. మీ శరీరంలో ప్రోటీన్ లేనట్లయితే, అవి బలహీనంగా మారే అవకాశం ఉంది. నిజానికి, కండరాల నష్టం అనేది తగినంత ప్రోటీన్ పొందకపోవడానికి మొదటి సంకేతాలలో ఒకటి అని తెలుసుకోవాలి.

ఎముకలు బలహీనంగా మారవచ్చు.. శరీరానికి అదే మొత్తంలో ప్రోటీన్ అందకపోతే మీ ఎముకలు కూడా ప్రమాదంలో ఉంటాయి. ఎముకల బలాన్ని, సాంద్రతను కలిగి ఉండడంలో ప్రోటీన్ సహాయపడుతుంది. తగినంత ప్రోటీన్ తీసుకోకపోతే మీ ఎముకలు కూడా బలహీనపడతాయి. దీంతో పెళుసుగా మారి త్వరగా విరిగిపోతాయి.

రోగనిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం.. ప్రోటీన్ లోపం మీ రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. సహజంగానే, రోగనిరోధక శక్తి బలహీనపడటం వల్ల ఏదైనా ఇన్ఫెక్షన్‌తో పోరాడేందు మీ శరీరంలో తగినంత సామర్థ్యాన్ని ఉండదు.

ఫ్యాటీ లివర్ ప్రమాదం.. టీతో పాటు గుడ్లు తినడం వల్ల శరీరంలో ప్రోటీన్ లోపం ఏర్పడుతుంది. దీని వల్ల ఫ్యాటీ లివర్ ముప్పు పెరుగుతుంది. మీరు కాలేయంతో సహా ఇతర అవయవాలను ఆరోగ్యంగా, బలంగా చేయాలనుకుంటే, టీతో పాటు గుడ్డు తినవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి మందు/ఆహారం/చిట్కాలు పాటించే ముందు డాక్టర్‌ను సంప్రదించి ఓ మంచి నిర్ణయం తీసుకోవడం మంచిది.