పిల్లలు, పెద్దలు ఇష్టంగా తినే రాగి లడ్డూ రెసిపీ మీకోసం..! ప్రతి రోజూ తింటే ఆరోగ్యానికి మస్త్ బెనిఫిట్స్..!

|

Mar 18, 2025 | 5:00 PM

రాగి, వేరుశెనగలతో చేసిన లడ్డూలను తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రాగి ఐరన్, ఫైబర్ సమృద్ధిగా కలిగి ఉండగా, వేరుశెనగలు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు అందిస్తాయి. బెల్లంతో తాయారు చేయడం వల్ల చక్కెరను తగ్గించుకోవచ్చు. ఈ లడ్డూలు శక్తిని పెంచి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడే ఆరోగ్యకరమైన స్వీట్ రెసిపీ ఇది.

పిల్లలు, పెద్దలు ఇష్టంగా తినే రాగి లడ్డూ రెసిపీ మీకోసం..! ప్రతి రోజూ తింటే ఆరోగ్యానికి మస్త్ బెనిఫిట్స్..!
Healthy Ragi Laddus
Follow us on

రాగులు, వేరుశనగలతో లడ్డూలు తాయారు చేయడం ఒక సులభమైన ఆరోగ్యకరమైన రెసిపీ. ఈ లడ్డూలు రుచికరంగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచివి. ఈ లడ్డూ రెసిపీని పిల్లలు, పెద్దలు అందరూ తినటానికి ఇష్టపడతారు. రాగులు పౌష్టిక పదార్థాలతో నిండినవి. అలాగే వేరుశెనగలు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ కలిగినవి. ఈ లడ్డూలు ఆరోగ్యానికి మేలు చేసే వాటిలో ఒకటి. ఇప్పుడు ఈ లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

  • నెయ్యి – 2 చెంచాలు
  • రాగి పిండి – 1/4 కప్పు
  • వేరుశెనగలు – 1/2 కప్పు
  • బెల్లం పొడి – 3/4 కప్పు
  • నీరు – 1/4 కప్పు
  • ఏలకుల పొడి – 1 టేబుల్ స్పూన్
  • ఉప్పు – తగినంత

తయారీ విధానం

ముందుగా వేరుశెనగలను పాన్‌లో వేయించి వాటిని చల్లారిన తర్వాత మిక్సర్‌లో వేసి మెత్తగా పొడి చేయాలి. వేరుశనగలలో పుష్కలమైన ప్రోటీన్ ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది.

తర్వాత పాన్‌లో నెయ్యి వేసి వేడయ్యాక దానిలో రాగి పిండి వేసి బాగా వేయించాలి. ఇది పిండికి మంచి రుచిని కలిగిస్తుంది. రాగులు ఐరన్, ఫైబర్, ప్రోటీన్ వంటి అనేక పోషకాలు కలిగినవిగా ఉంటాయి. ఇవి శరీరానికి ఉత్తమమైన జీవక్రియను అందిస్తాయి.

రాగి పిండి, వేరుశెనగ పొడిని మిక్సింగ్ బౌల్‌లో వేసి బాగా కలపాలి. ఇంతలో పాన్‌లో కొద్దిగా నీటిలో బెల్లం వేసి కరిగించాలి. బెల్లం పూర్తిగా కరిగిన తరువాత ఏలకుల పొడి, కొద్దిగా ఉప్పు కలపాలి. సిరప్ చిక్కగా అయ్యే వరకు స్టవ్ మీద ఉంచాలి.

బెల్లం సిరప్‌ను మిశ్రమంలో వేసి బాగా కలిపి వేడిగా ఉండగానే చిన్న చిన్న బాల్స్ ను చేయాలి. లడ్డూలను చల్లార్చిన తర్వాత వాటిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయాలి.

ఈ లడ్డూలు తయారు చేసిన తర్వాత ఒక వారం వరకు నిల్వ చేయవచ్చు. రోజూ ఉదయాన్నే ఈ లడ్డూలు తింటే శక్తిని ఇస్తాయి. ఎందుకంటే వీటిలో రాగి, వేరుశనగల పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ లడ్డూలు శరీరానికి అవసరమైన ఐరన్, ప్రోటీన్, కొవ్వులు అందించి శక్తివంతమైన ఆహారంగా ఉపయోగపడతాయి. రాగులు డైజెస్టివ్ సిస్టమ్‌ను మెరుగుపరచడంలో సహాయపడతాయి. పిల్లలు, పెద్దలు ఈ రుచికరమైన లడ్డూలను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ రెసిపీని మీరు ఇంట్లో సులభంగా తయారు చేయండి.